సమీక్ష : ‘బేబీ’ – ఎమోషనల్ గా సాగే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ !

సమీక్ష : ‘బేబీ’ – ఎమోషనల్ గా సాగే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ !

Published on Jul 15, 2023 3:06 AM IST
Hostel Days Movie Review in Telugu

విడుదల తేదీ : జూలై 14, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు: ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య, నాగబాబు, లిరిష, కుసుమ, సాత్విక్ ఆనంద్, బబ్లూ, సీత, మౌనిక, కీర్తన తదితరులు

దర్శకుడు : సాయి రాజేష్ నీలం

నిర్మాతలు: ఎస్.కె.ఎన్

సంగీతం: విజయ్ బుల్గానిన్

సినిమాటోగ్రఫీ: ఎం.ఎన్. బాల్ రెడ్డి

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ఆనంద్ దేవరకొండ నటించిన తాజా సినిమా బేబీ. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో విరాజ్ అశ్విన్ కీలక పాత్ర చేశారు. ఎస్ కె ఎన్ నిర్మాతగా, సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ బేబీ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఏ మేరకు ఆకట్టుకుందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

ఆనంద్ (ఆనంద్ దేవరకొండ) ఓ ఆటో డ్రైవర్. తన బస్తీలో తన ఎదురింట్లో ఉండే వైష్ణవి (వైష్ణవి చైతన్య) అనే అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తాడు. మొదట వైష్ణవి, టెన్త్ నుంచే ఆనంద్ తో ప్రేమలో పడినా.. అనంతరం ఆనంద్, వైష్ణవిని ఆమె కంటే చాలా గొప్పగా ప్రేమిస్తాడు. ఆ తర్వాత వైష్ణవి ఇంజనీరింగ్ లో జాయిన్ అవుతుంది. కాలేజీలో ఆమెకు విరాజ్ (విరాజ్ అశ్విన్) పరిచయం అవుతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఆనంద్ ప్రేమ కథలో ఎలాంటి మలుపు చోటు చేసుకుంది ?, అలాగే వైష్ణవి జీవితం ఎలా సాగింది ?, మధ్యలోవిరాజ్ పాత్ర ఏమిటి ?, చివరకు ఆనంద్ ప్రేమలో గెలిచాడా ? లేదా ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా కథలోని వాస్తవిక అంశాలు, అలాగే ఎమోషనల్ గా సాగే లవ్ ట్రాక్, ఆనంద్ దేవరకొండ పాత్రలోని ఎమోషన్స్, వైష్ణవి చైతన్య పాత్రలోని బలహీనతలు.. ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. పాఠశాల, కాలేజీల్లో ఈతరం ప్రేమ కథలు ఎలా ఉంటున్నాయి ?, చిన్న చిన్న పొరపాట్లు కారణంగా యువత తమ లైఫ్ ల్లో ఎలా బ్యాలెన్స్ తప్పి పోతున్నారనే కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి.

దర్శకుడు సాయి రాజేష్ బలమైన ఎమోషనల్ సన్నివేశాలతో పాటు కొన్ని హార్డ్ హిట్టింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా ఆయన బలంగా రాసుకున్నారు. అలాగే ఆనంద్ దేవరకొండకి, వైష్ణవి చైతన్యకి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. హీరోగా ఆనంద్ దేవరకొండ నటన చాలా బాగుంది. గుండె బద్దలైన ప్రేమికుడిగా ఆనంద్ తన పాత్రలోకి ఒదిగిపోయాడు. మానసిక సంఘర్షణతో అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు ఆనంద్ పూర్తి న్యాయం చేశాడు.

హీరోయిన్ వైష్ణవి చైతన్య కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఆ పెయిన్ అర్ధమయ్యేలా కేవలం తన కళ్లల్లో ఆమె పలికించిన హావభావాలు మెచ్చుకోదగినవి. కీలక పాత్రలో నటించిన విరాజ్ అశ్విన్ తన నటనతో ఆకట్టుకోగా.. ఇక ఎప్పటిలాగే తండ్రి పాత్రలో కనిపించిన నాగబాబు కూడా బాగా నటించాడు. వైవా హర్ష, లిరిష, కుసుమ, సాత్విక్ ఆనంద్ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

మొత్తమ్మీద సాయి రాజేష్ రాసిన కథ మరియు పాత్రలు కూడా నేటి యువత జీవితాల్లోని సంఘటనలు మరియు పరిస్థితుల ఆధారంగా సాగుతూ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా కథను దర్శకుడు చాలా సున్నితంగా నడుపుతూ.. సినిమాలో ప్రేమతో పాటు ఆ ప్రేమలోని ఎమోషన్ని, పెయిన్ని కూడా హైలెట్ అయ్యే విధంగా కొన్ని ఏమోషనల్ సన్నివేశాలను చాలా బాగా మలిచాడు.

 

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు సాయి రాజేష్.. పాత్రలను, నేపథ్యాన్ని అలాగే సినిమాలో కొన్ని ఎమోషన్స్ ను బాగా ఎలివేట్ చేసినా.. సినిమాలో కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగుతూ రెగ్యులర్ సీన్సే కదా అని ఫీల్ ని కలిగిస్తాయి. అలాగే హీరోయిన్ ట్రాక్ లోని కొన్ని సీన్స్ కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని లవ్ సీన్స్ కూడా ల్యాగ్ అనిపిస్తాయి. మొత్తంగా రెగ్యులర్ ప్లే, స్లో నేరేషన్ వంటి అంశాలు సినిమాకి కొంతవరకు మైనస్ అయ్యాయి.

 

సాంకేతిక విభాగం :

సినిమాలో సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ప్రేమ కథకు అనుగుణంగా విజువల్స్ ను చాలా అందంగా చూపించారు. సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ అందించిన పాటలు ఆకట్టుకున్నాయి. నేపథ్య సంగీతం కూడా బాగుంది. ముఖ్యంగా ఆనంద్ దేవరకొండ పై వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో నేపధ్య సంగీతం చాలా బాగా ఆకట్టుకుంది. ఎడిటింగ్ విషయానికి వస్తే.. ల్యాగ్ సీన్స్ లెంగ్త్ ను తగ్గించి ఉంటే బాగుండేది. సినిమాలో నిర్మాత ఎస్.కె.ఎన్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు సాయి రాజేష్ రచయితగా దర్శకుడిగా ఆకట్టుకున్నారు.

 

తీర్పు:

బేబీ అంటూ వచ్చిన ఈ డీసెంట్ ఎమోషనల్ లవ్ డ్రామా బలమైన ఎమోషన్స్ అండ్ ఫీల్ గుడ్ సీన్స్ తో సాగుతూ బాగా ఆకట్టుకుంది. అలాగే ప్రేమలో నేటి యువత చేసే పొరపాట్లు తాలూకు పర్యవసానాలను కూడా చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. పైగా, గుడ్ కంటెంట్ తో పాటు డీసెంట్ టేకింగ్, మేకింగ్ కూడా ఈ సినిమా స్థాయిని పెంచాయి. ఐతే, స్క్రీన్ ప్లే లో స్లో నేరేషన్ సినిమాకి మైనస్ అయ్యింది. కానీ, ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య తమ నటనతో సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. సాయి రాజేష్ రచన – దర్శకత్వం కూడా మెప్పించాయి. మొత్తమ్మీద ఈ చిత్రం చాలా బాగా మెప్పిస్తుంది.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు