విడుదల తేదీ : అక్టోబర్ 28, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు: అలీ, మౌర్యాని, నరేష్, పవిత్రా లోకేష్, మంజు భార్గవి, మను, తనికెళ్ళ భరణి, ఎల్‌బి శ్రీరామ్ మరియు ఇతరులు
దర్శకుడు : కిరణ్ శ్రీపురం
నిర్మాతలు: అలీబాబా, కొణతాల మోహన్ & శ్రీ చరణ్
సంగీతం: రాకేష్ పజెడం, భాస్కర్ పట్ల
సినిమాటోగ్రఫీ: మోహన్ రెడ్డి
ఎడిటర్: సెల్వ కుమార్
సంబంధిత లింక్స్: ట్రైలర్
లేటెస్ట్ గా ఓటిటి లో రిలీజ్ అయినటువంటి మరో చిత్రం “అందరూ బాగుండాలి అందులో నేనూ ఉండాలి” కూడా ఒకటి. కమెడియన్ అలీ నిర్మాతగా చేసిన మొదటి సినిమా ఇది కాగా ఈ చిత్రం అయితే ప్రముఖ ఓటిటి యాప్ ఆహా లో రిలీజ్ కాగా మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.
కథ :
ఇక కథలోకి వస్తే..శ్రీనివాసరావు(నరేష్) మాటలు రాని ఓ సర్వ సాధారణ మధ్యతరగతి వ్యక్తి. అయితే తాను ఓ చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. ఇక మరో పక్క సమీర్(ఆలీ) సౌథీ నుంచి వచ్చిన వైకాతి కాగా మీడియా అంటే బాగా పిచ్చి.. ఏదైనా సరే సోషల్ మీడియాలో అలా షేర్ చేస్తూ ఉంటాడు. మరి ఇలా ఓ రోజు లోకల్ ట్రైన్ ప్రయాణంలో శ్రీనివాసరావు పడుకున్న పొజిసిన్ చూసి ఫన్నీ గా ఉందని అతడికి తెలీకుండా దానిని రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా అది అనుకోని రీతిలో వైరల్ అయ్యిపోతుంది. దీనితో అక్కడ నుంచి శ్రీనివాసరావు లైఫ్ ఎలా మారిపోయింది? సమీర్ పై అతడు ఎందుకు కంప్లైంట్ చేస్తాడు? ఈ ఇద్దరికీ లింక్ ఏమన్నా ఉందా? చివరికి ఏమవుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ చిత్రం ఆల్రెడీ ఓ డీసెంట్ సినిమా వికృతి కి రీమేక్ గా ప్లాన్ చేశారు. అలాగే చాలా అంశాలు అయితే బాగానే అడాప్ట్ చేసి ప్రెజెంట్ చెయ్యడం ఆకట్టుకుంటుంది. ఇక నటీనటుల్లో అయితే మెయిన్ పాత్రలో కనిపించే నటుడు నరేష్ తన పాత్రకి ప్రాణం పోశారు. చాలా మెచ్యూర్ నటనతో తాను ఆకట్టుకున్నారు. ఓ మూగ వ్యక్తిగా తాను పండించిన హావభావాలు బాగున్నాయి.
ముఖ్యంగా తన ఫోటోలు వైరల్ అయిన సందర్భంలో వచ్చిన సీన్స్ లో అయితే తన నటన సూపర్బ్ గా ఉందని చెప్పాలి. అలాగే సినిమాలో సెటప్ అంతా కూడా మంచి నాచురల్ గా కూడా కనిపిస్తుంది. ఇక మరో నటుడు ఆలీ చాలా రోజుల తర్వాత తన మార్క్ ఇంట్రెస్టింగ్ నటనను కామెడీ టైమింగ్ ని కనబరిచారు. అలాగే సెకండాఫ్ లో అయితే తన నటన బాగుంది. అలాగే ఈ చిత్రంలో సోషల్ మీడియా వల్ల జరిగే అనర్ధాలు ఎలా ఉంటాయి అనేది చూపించిన విధానం కూడా బాగుంది.
మైనస్ పాయింట్స్ :
ఈ చిత్రం మెయిన్ పాయింట్ లోకి వెళ్ళడానికి అయితే తీసుకుంటుంది. అలాగే ఇద్దరు మెయిన్ పాత్రల్లో మరీ ఎక్కువ డీటెయిల్స్ చూపించినట్టు అనిపించడం కూడా కాస్త చికాకు తెప్పిస్తుంది. ఇంకా ఈ సినిమాలో పాటలు హీరోయిన్ అంశాలు కూడా అనవసరం కానీ వాటిని ఆలీకి ఇరికించడం సినిమా థీమ్ కి అంత బాగా సెట్టవ్వలేదు.
దీనితో సినిమా ఫ్లో దెబ్బ తింటుంది. అలాగే ఒరిజినల్ తో పోలిస్తే ఇందులో కొన్ని అంశాలు మాత్రమే మెప్పిస్తాయి తప్ప చాలా సీన్స్ లో నాచురాలిటీ బాగా లోపించింది. అలాగే మెయిన్ లీడ్ తప్ప ఇతర సపోర్టింగ్ కాస్ట్ కూడా సినిమాకి ఏమంత గొప్ప ఫీల్ ని తీసుకురాలేదు.
అలాగే చిత్రంలో మరో పెద్ద డ్రా బ్యాక్ ఏదన్నా ఉంది అంటే సినిమా నిడివి అని చెప్పాలి. సినిమాని అనవసర సీన్స్ పెట్టి బాగా లెంగ్త్ చేసేసారు. దీనితో సినిమాపై అయితే ఆసక్తి బాగా సన్నగిల్లుతుంది. ఇంత రన్ టైం లో కూడా సినిమా ఏమన్నా ఎంగేజింగ్ గా ఉంటుంది అంటే అది కూడా లేదు.
సాంకేతిక వర్గం :
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు పర్వాలేదని చెప్పాలి. అలాగే టెక్నీకల్ టీం లో రాకేష్, భాస్కర్ ల సంగీతం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. అలాగే మోహన్ రెడ్డి సినిమాటోగ్రఫీ నీట్ గా ఉంది. అలాగే డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ అయితే ఇంకా బెటర్ గా చెయ్యాల్సి ఉంది. ఇక దర్శకుడు కిరణ్ విషయానికి వస్తే.. తన వర్క్ సినిమాకి జస్ట్ ఓకే అనిపించే రేంజ్ లో ఉందని చెప్పాలి. సినిమాలో తాను చాలా ఎక్కువగా స్క్రీన్ ప్లే పై దృష్టి పెట్టాల్సింది. అలాగే సినిమాలో సీరియస్ నెస్ ని కూడా తాను ఎస్టాబ్లిష్ చెయ్యలేకపోయాడు. అలాగే పలు ఎమోషన్స్ రాబట్టడంలో కూడా తాను ఇంకా నేటర్ వర్క్ చెయ్యాల్సి ఉంది. ఇక వీటితో పాటుగా సినిమా రన్ టైం విషయంలో కూడా ఆలోచించాల్సింది.
తీర్పు :
ఇక మొత్తంగా చూసినట్టు అయ్యితే “అందరూ బాగుండాలి అందులో నేనూ ఉండాలి” సినిమాలో కొన్ని అంశాలు వరకు పర్వాలేదు. అలాగే సినిమాలో ఆలీ మరియు నరేష్ ల పెర్ఫామెన్స్ లు ప్రామిసింగ్ గా ఉంటాయి. అలాగే చిన్నపాటి మెసేజ్ కూడా బాగుంటుంది. కానీ సినిమాలో సరైన ఎమోషన్స్ ఎస్టాబ్లిష్ కాలేదు. అలాగే డల్ గా సాగే ఫస్ట్ హాఫ్ మినహాయిస్తే సెకండాఫ్ కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఓవరాల్ గా అయితే ఈ చిత్రం జస్ట్ ఓకే అనిపిస్తుంది.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team