విడుదల తేదీ : జూన్ 11, 2021
123telugu.com Rating : 2.25/5
నటీనటులు : కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, సాయికుమార్, కృష్ణ ప్రియ, శుభలేఖ సుధాకర్
దర్శకత్వం : రవీంద్ర పుల్లె
నిర్మాత : : చిట్టి కిరణ్ రామోజు
సంగీతం : నవ్‌ఫాల్ రాజా ఎఐఎస్
సినిమాటోగ్రఫీ : అష్కర్, వెంకట్ ఆర్ శాకమూరి, ఈజె వేణు
ఎడిటింగ్ : ప్రతాప్ కుమార్
ప్రస్తుతం కొనసాగుతున్న పలు ఓటిటి చిత్రాలు మరియు వెబ్ సిరీస్ ల రివ్యూల క్రమంలో మేము ఎంచుకున్న లేటెస్ట్ చిత్రం “అర్ధ శతాబ్ధం”. ఈ మూవీ నేడు ఆహాలో విడుదల అయ్యింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.
కథ:
కథలోకి వెళ్లినట్టయితే తెలంగాణలోని సిరిసిల్ల పట్టణంలోని కృష్ణ(కార్తీక్ రత్నం) అనే వ్యక్తి పుష్ప(కృష్ణ ప్రియ) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే కృష్ణ తన ప్రేమను పుష్పకు చెప్పాలనుకున్న సమయంలో సృష్టించిన ఒక వెర్రి సంఘటన ఆ గ్రామమంతా అందులో కలగజేసుకునేలా మారింది. కుల సంబంధిత సమస్యలు బయటికి రావడంతో ఆ వివాదం మరింత పెద్దదిగా మారిపోతుంది. ఆ సమయంలో కృష్ణుడు ఏమి చేస్తాడు? ఆ సమస్యను అతను ఎలా ఎదుర్కొంటాడు? చివరకు ఆ గ్రామానికి ఏమవుతుంది? అనేదే అసలు కథాంశం.
ప్లస్ పాయింట్స్:
ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన కార్తీక్ రత్నం వన్ సైడ్ ప్రేమికుడిగా చాలా బాగా ఆకట్టుకున్నాడు. అన్ని ప్రేమ సన్నివేశాల్లో కార్తీక్ బాగా నటించాడు, ముఖ్యంగా సెకండాఫ్‌లో అతను చాలా బాగున్నాడు. నిస్సహాయ ప్రేమికుడిగా కనిపించడం కూడా చాలా బాగా అనిపించింది.
కృష్ణ ప్రియ ఓక్ విలేజ్ అమ్మాయిలా చక్కగా సెట్ అయ్యింది. ఆమె తన పాత్రకు ఏది అవసరమో అదే చేసింది. ఇక ఈ చిత్రం యొక్క క్లైమాక్స్ డీసెంట్‌గా అనిపించింది. అనిల్ గీలా ఫ్రెండ్స్ గ్యాంగ్ బాగుంది. గ్రామీణ వాతావరణం ఈ చిత్రంలో బాగా చూపించబడింది.
ఈ చిత్రం యొక్క రెండవ భాగంలో కొన్ని సీన్లు మరియు అది ముగిసిన విధానం బాగుంది. తక్కువ సమయంలో గ్రామంలోని చిన్న కులాల సమస్యలను కొన్ని సన్నివేశాల్లో చక్కగా చూపించగలిగారు. అజయ్ తన పోలీసు పాత్రలో చక్కగా ఉండగా, శుభలేఖ సుధాకర్ కూడా తన పాత్రకు న్యాయం చేశాడు.
మైనస్ పాయింట్స్:
మాజీ నక్సలైట్ పాత్రలో సాయి కుమార్ బాగానే కనిపించినా అతని పాత్రకు అంత స్పష్టత లేదు. అంతేకాదు కొన్ని సన్నివేశాలు మరియు చివరికి అతను ఏమనుకుంటున్నారనేదానిపై అంతగా స్పష్టత లేదు. నవీన్ చంద్ర ఒక అగ్రెసివ్ పోలీసుగా నటించినా అతని పాత్రకు ప్రాముఖ్యత కనిపించలేదు. ఇలాంటి పాత్రకు తను ఎందుకు ఒకే చెప్పాడో అర్థం చేసుకోవడం కష్టం.
అయితే దాదాపు ఫస్ట్ హాఫ్‌లో హీరో హీరోయిన్ చుట్టూ సైకిల్‌పై తిరుగుతూ మరియు ఆమెకు లవ్ ప్రపోజ్ చేయడమే ఎక్కువగా కనించడంతో ఇది బాగా నిరుత్సాహపరించింది. ఇక దీని తరువాత పాటలు ఒకే లవ్ యాంగిల్ సమయాన్ని మళ్లీ మళ్లీ ప్రదర్శిస్తాయి. ఇవన్నీ ఇప్పటికే చాలా సినిమాల్లో చూడడంతో కాస్త బోర్‌గా అనిపిస్తాయి.
ఇక అసలు కథ రెండవ భాగంలో మొదలవుతుంది. అందులో కులాల అంశం తెరపైకి వస్తుంది. చాలా కథలు మరియు పోరాటాలు ప్రధాన ఇతివృత్తానికి కూడా అనుసంధానించబడవు. సౌలభ్యం కోసమే, కుల-ఆధారిత పోరాటాలు హైలైట్ చేయబడతాయి. ఇలాంటి అసలు అవసరం లేదని చెప్పాలి.
సాంకేతిక విభాగం:
ఈ చిత్రం యొక్క నిర్మాణ విలువలు బాగున్నాయి మరియు బీజీఎం కూడా బాగుంది. పాటలు డీసెంట్‌గా ఉన్నా కాస్త భయంకరమైన రీతిలో ఉన్నాయి. ఇక విలేజ్ సెటప్‌ను బాగా చూపించిన కెమెరా పనితీరు చాలా బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ మరియు ఆర్ట్ డిపార్ట్మెంట్ చక్కగా పని చేశారు. శుభలేఖ సుధాకర్ కోసం రాసిన డైలాగులు బాగా ఆకట్టుకున్నాయి.
దర్శకుడు రవీంద్ర పుల్లె విషయానికి వస్తే అతని కథ ఆలోచన బాగుంది కానీ అది అమలు చేసిన విధానం నిరాశపరిచింది. అతను ఫస్ట్ హాఫ్‌లో పాత సీన్ల మాదిరిగానే హీరో హీరోయిన్ వెంట పడే సన్నివేశాలను ఎక్కువగా చూపించాడు కానీ మిగిలిన వాటిపై దృష్టి పెట్టలేదు. ఇక హీరోయిన్ కోణం ద్వారా ప్రాథమిక మలుపును తెచ్చినప్పటికీ, కుల వ్యవస్థను హైలైట్ చేసే విధానం బాగా అనిపించలేదు. ఎలాంటి కారణం లేకుండానే ఒకరినొకరు చంపుకోవడం మరియు భావోద్వేగాలు ఉన్నా సినిమాకు ఓ ఎజెండా లేదనే చెప్పాలి.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే అర్ధ శతాబ్ధం మంచి కథను కలిగి ఉన్నా కొన్ని రొటిన్ మరియు వేగవంతమైన కథనం ద్వారా అది కాస్త చెడిపోయింది. మొదటి సగం బోరింగ్, రొటీన్ మరియు పెద్దగా విలువలు కనిపించలేదు. కానీ విరామ సమయం నుంచి కాస్త విషయాలు అర్ధవంతం అవుతాయి. కీ ట్విస్ట్ వెల్లడైన తర్వాత, కుల వ్యవస్థ సమస్యలు వంటి అంశాలు బాగున్నా పెద్దగా ఎమోషన్‌గా అయితే కనెక్ట్ కాలేరు. ఏదేమైనా ఈ వారాంతంలో ఈ సినిమా ఓ యావరేజ్ చిత్రంగా నిలిచే అవకాశం ఉంది
123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team