ఓటిటి సమీక్ష: అర్థమయ్యిందా..? అరుణ్ కుమార్ – ఆహాలో తెలుగు వెబ్ సిరీస్

Arthamainda Arun Kumar Movie Review Telugu

విడుదల తేదీ : జూన్ 30, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: హర్షిత్ రెడ్డి, తేజస్వి మదివాడ, అనన్య, వాసు ఇంటూరి, జే ప్రవీణ్, శ్రావ్య మృదలా

దర్శకుడు : జోనాథన్ ఎడ్వర్డ్స్

నిర్మాతలు: బి.సాయి కుమార్, నియతి మర్చంట్, శరణ్ సాయికుమార్, అర్చన కరుల్కర్, తన్వి దేశాయ్

సంగీతం: అజయ్ అరసాడ

సినిమాటోగ్రఫీ: అమర్‌దీప్ గుత్తుల

ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

తెలుగు ఓటిటి ప్లాట్ ఫారం ఆహా వీడియో అర్థమయ్యిందా..? అరుణ్ కుమార్ అనే కొత్త షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో హర్షిత్ రెడ్డి, తేజస్వి మదివాడ, అనన్య ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ ప్రస్తుతం స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. అది ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.

 

కథ:

అమలాపురంకు చెందిన అరుణ్ కుమార్ (హర్షిత్ రెడ్డి) తన గోల్స్ ను నెరవేర్చుకోవడానికి హైదరాబాద్‌లో అడుగు పెడతాడు. అతను జీవితంలో పెద్ద లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. అరుణ్ కుమార్ ఓ కార్పొరేట్ కంపెనీలో ఇంటర్న్‌గా చేరతాడు. అక్కడ అతను రకరకాల వ్యక్తులను కలుసుకుంటాడు. కార్పొరేట్ లైఫ్ లోని అప్ అండ్ డౌన్స్ ను చూస్తాడు, అనుభవిస్తాడు. కార్పోరేట్ వాతావరణంలో అరుణ్ కుమార్ ఎలా కొనసాగాడు అనేది ఈ షో తెలియజేస్తుంది.

 

ప్లస్ పాయింట్స్:

ఈ షో చాలా చూపించిన కొన్ని సన్నివేశాలు ఆడియెన్స్ కి రిలేట్ గా ఉంటాయి. జీవితంలో ఏదో ఒక దశలో ఇంటర్న్‌షిప్‌లు చేసిన వారందరూ ఈ సిరీస్‌లో చిత్రీకరించబడిన కొన్ని సన్నివేశాలకి బాగా కనెక్ట్ అవుతారు. ఉదాహరణకు, హీరో తన స్వగ్రామానికి తిరిగి రావడమో లేదా ఆఫీసులో ఉండటమో ఎంచుకోవాల్సిన కీలకమైన పరిస్థితి వస్తుంది. దీన్ని చాలా రియలిస్టిక్‌గా చూపించారు.

హర్షిత్ రెడ్డి ఇందులో ప్రధాన పాత్రలో నటించారు. అతను తన పాత్రలో ఉన్న డిఫరెంట్ ఎమోషన్స్ ను చాలా బాగా చూపించాడు. సిరీస్‌ని తన పర్ఫార్మెన్స్ తో చాలా వరకు హ్యాండిల్ చేశాడు. తేజస్వి మదివాడ ఇందులో చాలా అందంగా కనిపించింది. ఆమె నటన బాగుంది.

 

మైనస్ పాయింట్స్:

ఇందులో చూపించిన కొన్ని సన్నివేశాలు రియల్ లైఫ్ కి చాలా దగ్గరగా ఉన్నాయి. అయితే కొన్నిటిని మోతాదు కి మించి చూపించడం జరిగింది. మేకర్స్ కొన్ని సన్నివేశాలను మసాలా యాడ్ చేయడం జరిగింది. ఇవి ఫీల్ ను తగ్గించి, షో పై ప్రభావం చూపించాయి.

ఈ షో లో అనన్య చక్కని నటనను కనబరిచినప్పటికీ, ఆమె పాత్రకి అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఈ షో స్టార్టింగ్ చాలా బాగుంది, అయితే టైమ్ గడుస్తున్న కొద్దీ, మెయిన్ ట్రాక్ కి డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. హర్షిత్ మరియు అనన్య మధ్య లవ్ ట్రాక్ సన్నివేశాలు అంత బాగా ప్రదర్శించబడలేదు. అందువల్ల ఎమోషనల్ గా సాగే సన్నివేశాలు అంతగా ప్రభావం చూపించవు. ఈ షో కి సీక్వెల్ ఉంది. మేకర్స్ రెండవ సీజన్ కోసం కొంత కంటెంట్‌ను రిజర్వ్ చేసినట్లు కనిపిస్తోంది.

స్టార్టింగ్ ఎపిసోడ్‌లో హీరో పాత్ర హైదరాబాద్‌లో సందడిగా ఉన్న నగరంలోకి ఎంటర్ అవ్వడం, మరియు ఆఫీస్ లో ఎదుర్కొనే అనుభవాలను చూపించడం అంతా హడావుడిగా జరుగుతుంది. ఇందులో ఇంకాస్త డెప్త్ గా చూపించలేదు. దాని కారణం గా ప్రదర్శన అంతగా ఆకట్టుకోదు.

 

సాంకేతిక విభాగం:

అజయ్ అరసాడ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు బాగున్నాయి. అమర్‌దీప్ గుత్తుల సినిమాటోగ్రఫీ నీట్‌గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు.

దర్శకుడు జోనాథన్ ఎడ్వర్డ్స్ విషయానికి వస్తే, అతను సిరీస్‌తో ఓకే అనిపిస్తాడు. అతను మంచి కథాంశాన్ని ఎంచుకున్నప్పటికీ, సిరీస్‌లో డెప్త్ లేదు. అందువల్ల షో కంప్లీట్ ఫీల్ ను అందించదు. ఈ షో ఏ విధంగా కూడా అంత చెడ్డ షో అయితే కాదు. కానీ సమస్య ఏమిటంటే ఎమోషన్స్ ను డీల్ చేసే విధానం బాగోలేదు.

 

తీర్పు:

మొత్తం మీద, అర్థమయ్యిందా..? అరుణ్ కుమార్ కార్పొరేట్ వరల్డ్ ను చూపించిన విధానం బాగుంది. కానీ, అందుకు కావలసిన ఎమోషనల్ డెప్త్ ఇందులో లేదు. ప్రధాన నటీనటుల నటన బాగుంది. కొన్ని మంచి సన్నివేశాలు ఉన్నాయి. కానీ షో పూర్తిగా చూస్తే, కంప్లీట్ ఫీల్ ను ఇవ్వదు, సాటిస్ఫాక్షన్ అనిపించదు

 

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version