సమీక్ష : “అశోక వనంలో అర్జున కళ్యాణం” – ఆకట్టుకునే రోమ్ కామ్ డ్రామా

సమీక్ష : “అశోక వనంలో అర్జున కళ్యాణం” – ఆకట్టుకునే రోమ్ కామ్ డ్రామా

Published on May 7, 2022 3:03 AM IST
AVAK Movie Review

విడుదల తేదీ : మే 06, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: విశ్వక్ సేన్, రుక్సర్ ధిల్లాన్, రితికా నాయక్, వెన్నెల కిషోర్, కాదంబరి కిరణ్ తదితరులు

దర్శకత్వం : విద్యా సాగర్ చింత

నిర్మాతలు: బాపినీడు బి & సుధీర్ ఈదర

సంగీత దర్శకుడు: జై క్రిష్

సినిమాటోగ్రఫీ: పవి కె పవన్

ఎడిటర్ : విప్లవ్ నైషాదం

 

మన టాలీవుడ్ యూత్ లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో విశ్వక్ సేన్ కూడా ఒకడు. మరి తాను హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “అశోక వనంలో అర్జున కళ్యాణం”. మంచి బజ్ మరియు కొన్ని ఊహించని సంఘటనల నడుమ ఈరోజు థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

 

కథ :

 

ఇక కథ లోకి వచ్చినట్టు అయితే.. ఆల్రెడీ 33 ఏళ్ళు వచ్చేసిన అర్జున్(విశ్వక్ సేన్) ఒక చిన్నపాటి ఫైనాన్సియర్ గా తన లైఫ్ ని కొనసాగిస్తూ ఉంటాడు. అయితే తనకు ఓ పక్క వయసు అవుతుంది.. ఈ క్రమంలో తనకి ఎన్నో సంబంధాలు కూడా కుటుంబీకులు చూస్తారు. అయితే ఫైనల్ గా అతి కష్టం మీద తన తండ్రి ఫిక్స్ చేసి ఆ పెళ్లి చూపుల నిశ్చితార్థం కి తీసుకెళ్తారు. అక్కడ మాధవి(రుక్షర్ ధిల్లాన్) పెళ్లి కూతురుగా చూసాక ఏమవుతుంది? అర్జున్ కి ఆమెకి పెళ్లవుతుందా లేదా? ఆమె సడెన్ గా కనిపించకపోవడానికి కారణం ఏమిటి? అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో నటీ నటుల పెర్ఫామెన్స్ లతో పాటు మంచి ఎమోషన్స్ కూడా ఆకట్టుకుంటాయి. మొదటగా నటీనటుల కోసం చెప్పుకున్నట్టయితే మేజర్ ప్లస్ విశ్వక్ సేన్ కోసం మొదటగా చెప్పుకోవాలి. విశ్వక్ ఐ ఇది వరకు మంచి అగ్రెసివ్ యంగ్ హీరోగా లవర్ బాయ్ లా చూసాము కానీ ఈ సినిమా పూర్తి డిఫరెంట్ విశ్వక్ కనిపిస్తాడు.

ఇది ఇది వరకు టీజర్ ట్రైలర్స్ లలో చూసాం కానీ సినిమాలో కంప్లీట్ ప్యాకేజ్ తన నుంచి కనిపిస్తుంది. తన హావభావాలు చిన్న చిన్న సెన్సిబుల్ ఎమోషన్స్ ని తాను చాలా చక్కగా పలికించాడు. అలాగే ఆ ఏజ్ వచ్చిన యువకుల్లో ఉండే ఫ్రస్ట్రేషన్ ఇతర ఎమోషన్స్ చాలా బాగా చేసి సినిమాలో డెఫినెట్ మేజర్ అట్రాక్షన్ గా నిలిచాడు.

అలాగే హీరోయిన్ రుక్షర్ ఈ చిత్రంలో చాలా అందంగా నీట్ లుక్స్ లో కనిపించి మంచి నటనతో ఆకట్టుకుంటుంది. అలాగే విశ్వక్ తో ఉన్న సీన్స్ లో గాని వారిద్దరి కెమిస్ట్రీ గాని చాలా బాగున్నాయి. ఇంకా ఈ సినిమాలో మరో మెయిన్ పాత్రలో యంగ్ నటి రితిక నాయక్ ఒక స్పెయికాల్ ట్రీట్ అని చెప్పాలి. ఆమెకి ఇచ్చిన కీలక పాత్రకి తగ్గట్టుగా మంచి నటనను సినిమాలో మార్పులు ఆమె చూపించింది. అలాగే ఆ రోల్ కూడా ఆమె పర్ఫెక్ట్ గా చేసి రక్తి కట్టించింది.

ఇంకా వెన్నెల కిషోర్ మరియు కాదంబరి కిరణ్ లు మంచి పాత్రల్లో కనిపించి మెప్పించారు. ఇంకా ఈ సినిమాలో మెయిన్ హైలైట్ గా మంచి ఎమోషన్స్ మరియు మంచి కామెడీ డ్రామా కనిపిస్తుందని ఇది వరకే అర్ధం అయ్యింది. వాటిని చాలా చక్కగా దర్శకుడు సినిమాలో హ్యాండిల్ చేసి ఆకట్టుకున్నాడు. ఇవి ఆడియెన్స్ లో కూడా డెఫినెట్ గా వర్కవుట్ అవుతాయి. తాను డిజైన్ చేసిన ట్విస్ట్ కూడా బాగుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో కాస్త ఆకట్టుకొని అంశం ఏదన్నా ఉంది అంటే కథనంలో కొత్తదనం లేకపోవడం అని చెప్పాలి. ఒకింత ఇది చాలా వరకు ఊహించదగ్గ రీతిలోనే ఉంటుంది. సినిమాలో ఒక స్టేజ్ వచ్చేసరికి మిగతా అంతా ఆడియెన్ ఊహించ రీతిలో కనిపిస్తుంది.

అలాగే సెకండాఫ్ లో పలు చోట్ల ఎమోషన్స్ కాస్త ఇరికించినట్టు అనిపిస్తాయి. ఇంకా మరో డ్రా బ్యాక్ ఏమిటంటే హీరోయిన్ రోల్ కి పూర్తి న్యాయం చేసినట్టు అనిపించదు. కథనంలో మొదట తన పాత్ర బాగానే అనిపించినా తర్వాత కాస్త పలచబడినట్టు అనిపిస్తుంది.

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు చాలా బావున్నాయి. దాదాపు తక్కువ లొకేషన్స్ లోనే ఈ సినిమా షూటింగ్ జరిగినా విజువల్స్ మాత్రం నీట్ గా ఉన్నాయి. ఇందులో సినిమాటోగ్రఫర్ పనితనం బాగుంది. అలాగే సంగీతం ఇచ్చిన జై క్రిష్ సినిమాకి మంచి సోల్ ని అందించాడు. అలాగే ఎడిటింగ్ పర్వాలేదు.

ఇక దర్శకుడు విద్యా సాగర్ విషయానికి వస్తే తాను ఎంచుకున్న కథ కాస్త రొటీన్ గానే ఉన్నా మంచి ఎమోషన్స్ తో ఆకట్టుకునే కథనం రాసుకున్నాడు. ఒకింత ఊహించదగేది అయినా కూడా ఆడియెన్స్ కి నచ్చేలా తాను తెరకెక్కించడం ఆకట్టుకుంటుంది. అయితే సెకండాఫ్ లో మరికొన్ని జాగ్రత్తలు గాని తీసుకొని సినిమా మరింత ఆకట్టుకునే విధంగా వచ్చి ఉండేది. ఓవరాల్ గా అయితే ఈ సినిమాకి దర్శకునిగా విద్యా సాగర్ అయితే డీసెంట్ వర్క్ ని కనబరిచి ఆకట్టుకుంటాడు.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “అశోక వనంలో అర్జున కళ్యాణం” లో విశ్వక్ సేన్ సహా ఇతర నటీనటుల ప్రామిసింగ్ పెర్ఫామెన్స్ లు అలాగే ఆకట్టుకునే కథనం, సెన్సిబుల్ ఫ్యామిలీ ఎమోషన్స్ వంటివి ఆడియెన్స్ ని ఆకట్టుకుంటాయి. కాకపోతే రొటీన్ కథ సెకండాఫ్ లో అక్కడక్కడా ఊహించదగ్గ నరేషన్ వంటివి నిరాశ పరుస్తాయి. జస్ట్ ఇవి పక్కన పెడితే ఈ వారాంతానికి ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చెయ్యవచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు