సమీక్ష : అథర్వ – కొన్ని సీన్స్ కోసం మాత్రమే

సమీక్ష : అథర్వ – కొన్ని సీన్స్ కోసం మాత్రమే

Published on Dec 1, 2023 9:00 PM IST
Calling Sahasra Movie Review in Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 01, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, కల్పిక గణేష్, మారిముత్తు, ఐరా జైన్ తదితరులు.

దర్శకుడు : మహేష్ రెడ్డి

నిర్మాణం: సుభాష్ నూతలపాటి

సంగీతం: శ్రీచరణ్ పాకాల

సినిమాటోగ్రఫీ: చరణ్ మాధవనేని

ఎడిటర్: ఎస్ బీ ఉద్ధవ్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్స్ గా తాజాగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అథర్వ. నేడు మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందనేది పూర్తి సమీక్ష లో చూద్దాం.

 

కథ :

దేవా అథర్వ కర్ణ (కార్తీక్ రాజు) కెరీర్ పరంగా పోలీసు కావాలని ప్రయత్నిస్తాడు, కానీ అతని ఆరోగ్య రీత్యా ఆస్తమా సమస్య కారణంగా లక్ష్యాన్ని సాధించలేకపోతాడు. అయితే క్లూస్ టీమ్‌లో మంచి భవిష్యత్తు ఉంటుందని ఓ వ్యక్తి అథర్వకు చెప్తాడు. అనంతరం కొన్నాళ్ళకు అధర్వకు క్లూస్ టీమ్‌లో ఉద్యోగం వస్తుంది మరియు తన నైపుణ్యంతో చాలా కేసులను ఛేదిస్తాడు. ఒక రోజు, అధర్వ తన కాలేజీ క్రష్ అయిన నిత్య (సిమ్రాన్)ని క్రైమ్ సీన్‌లో కలుస్తాడు. మెల్లగా నిత్య అథర్వకి దగ్గరవుతుంది. నిత్య తన స్నేహితురాలు మరియు టాలీవుడ్ నటి జోష్నీ హుపారికర్ (ఐరా జైన్)ని అధర్వకు పరిచయం చేస్తుంది. ఒకానొక సందర్భంలో ఒక రోజు జోష్ని తన ఫ్లాట్‌లో ప్రియుడు శివతో కలిసి చనిపోతుంది. అయితే జోష్నీని శివ కాల్చి చంపి ఉంటాడని పోలీసులు భావిస్తారు. కాగా ఆ మర్డర్ మిస్టరీని చేధించడమే మిగతా సినిమా కథ.

 

ప్లస్ పాయింట్స్ :

నిజానికి గతంలో మన తెలుగులో అనేక క్రైమ్ థ్రిల్లర్‌లు వచ్చాయి, కానీ అథర్వలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, నేరం జరిగినప్పుడు క్లూస్ టీమ్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. అథర్వ తన ఉద్యోగంలో చేరిన తర్వాత కొన్ని కేసులను ఛేదిస్తాడు. అయితే ఈ సన్నివేశాలు మొదటి గంటలోనే గ్రిప్పింగ్‌గా ఉంటాయి. కాగా అథర్వ పాత్రలో కార్తీక్ రాజు డీసెంట్ పెర్ఫార్మెన్స్ కనబరిచాడు. సిమ్రాన్ చౌదరి తన పాత్ర యొక్క పరిధి మేరకు ఆకట్టుకుంది. ఐరా జైన్ కూడా పాత్రలో చక్కగా పెర్ఫార్మ్ చేసింది. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా స్పీడ్ గా సాగుతుంది. అనంతరం ఊపందుకోవడం కాస్త తగ్గినప్పటికీ, జోష్నీ పాత్ర హత్యతో సినిమా మళ్లీ ట్రాక్‌లోకి వస్తుంది.

 

మైనస్ పాయింట్స్ :

నిజానికి ఇంట్రెస్టింగ్ గా సాగె ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉన్నా,సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా సాగదు. ముఖ్య సమస్య ఏమిటంటే, ప్రతి కేసు చాలా త్వరగా పరిష్కరించబడుతుండడంతో ఆసక్తి అంతగా ఉండదు. ఇక సినిమా సబ్జెక్ట్ నేచర్‌ని బట్టి ఇంట్రెస్టింగ్ గా సాగినా కానీ కొంత సమయం తర్వాత హీరోయిజం వంటి అనవసరమైన సీన్స్ తో ఒకింత మైనస్ గా మారుతుంది. డైలాగులు పెద్దగా బాగోలేదు, ముఖ్యంగా ప్రథమార్ధంలో సుదీర్ఘమైన ఏకపాత్రాభినయం పర్వాలేదనిపిస్తుంది. అలాగే డైలాగ్స్ వల్ల వార్నింగ్ సీన్స్ ఒకింత రొటీన్ గా అనిపిస్తాయి. అనవసరమైన పాటలు సినిమాపై ప్రభావం చూపుతాయనడానికి అథర్వ ఉదాహరణ. సాహిత్యం నార్మల్ గా ఉంది, కానీ పాటలు లేకుంటే సినిమా ఇంకా బాగుండేదని చెప్పాలి. హత్యల యొక్క కేసు చివర్లో తేలింది. దీన్ని చూపించడానికి, మేకర్స్ స్టాక్ ఫుటేజీని ఉపయోగించారు, ఇది స్క్రీన్‌పై చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ ఉందని మేకర్స్ వెల్లడించారు, అయితే ఈ సినిమా రెండవ భాగం కోసం వేచి ఉండటానికి ఇంట్రెస్టింగ్ అంశలు ఏమి లేవు. ఏదైనా సీక్వెల్ ఆలోచన ఉంటే, క్లైమాక్స్ నిజంగా బాగుండాలి, లేకుంటే అది సినిమాకి ప్రతికూలంగా మారుతుంది అనేది మేకర్స్ గుర్తించాలి.

 

సాంకేతిక వర్గం :

ఇక అథర్వ మూవీకి శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం డీసెంట్‌గా ఉంది, కానీ సదా సీదా లిరిక్స్ కారణంగా పాటలు బోర్ కొట్టేలా ఉన్నాయి. చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ టీమ్ డీసెంట్ గా పనిచేసింది. డైలాగ్స్ పార్ట్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. దర్శకుడు మహేష్ రెడ్డి విషయానికి వస్తే, సెకండాఫ్‌లో ఆసక్తికరమైన కథనంతో స్టోరీబి ముందుకు నడపడంలో విజయం సాధించలేకపోయాడు. బోరింగ్ లవ్ ట్రాక్ మరియు అనవసరమైన పాటలు ఉన్నప్పటికీ, మొదటి గంట ఆకర్షణీయంగా ఉంది. అయితే అనవసర హీరోయిజాన్ని చూపించడంతో స్క్రీన్ ప్లే చివరి గంటలో దాని పట్టును కోల్పోతుంది. కబీర్ దుహన్ సింగ్ పాత్ర సరిగ్గా సెట్ కాలేదని చెప్పాలి.

 

తీర్పు :

మొత్తంగా చెప్పాలి అంటే అథర్వ సగం మాత్రమే ఆకట్టుకునే సస్పెన్స్ థ్రిల్లర్. ఇది క్లూస్ డిపార్ట్‌మెంట్ యొక్క ప్రాముఖ్యతను మనకు చూపిస్తుంది. ఇక మధ్యలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, గ్రిప్పింగ్ మూమెంట్స్‌తో మొదటి సగం ఆసక్తికరంగా ఉంది. కానీ రెండవ సగం మొదలయ్యాక అది తారుమారవుతుంది. హీరోయిజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, ఇంట్రెస్టింగ్ గా లేని సాంగ్స్, రెండవ బలహీనంగా ఉండటం అథర్వ యొక్క ప్రతికూలతలు అని చెప్పాలి. మొత్తంగా ఇది కొన్ని సీన్స్ కి మాత్రమే పరిమితమైన సినిమా.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు