ఆడియో సమీక్ష : బాద్షా – పెప్పీగా సాగిపోయే ఎంటర్టైనింగ్ ఆల్బమ్
యంగ్ టైగర్ ఎన్.టి.అర్ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బాద్షా’ త్వరలోనే రిలీజ్ కి సిద్దమవుతోంది. ఈ మూవీ ఆడియోని నిన్న హైదరాబాద్లో విడుదల చేసారు. ఎస్.ఎస్ థమన్ కంపోజ్ చేసిన ఈ మ్యూజిక్ ఆల్బంలో మొత్తం 6 పాటలున్నాయి. ఈ ఆల్బంలోని పాటలు ఎలా ఉన్నాయి, థమన్ చార్ట్ బస్టర్ లాంటి పాటలు అందించారా లేదా అనేది ఇప్పుడు చూద్దాం…
1. పాట : సైరో సైరో
గాయనీ గాయకులు : రంజిత్, రాహుల్ నంబియార్, నవీన్
సాహిత్యం : కృష్ణ చైతన్య
‘సైరో సైరో’ పెప్పీ గా సాగుతూ చాలా ఫాస్ట్ గా ఉండే సోలో సాంగ్. ఎన్.టి.ఆర్ మరోసారి తన డాన్సింగ్ స్కిల్స్ చూపే విధంగా థమన్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ ట్రాక్లో సింథసైజర్, ఎలక్ట్రిక్ గిటార్, పెర్క్యూషణ్ వాయిద్యాలను ఎక్కువగా ఉపయోగించారు. రంజిత్, రాహుల్ నంబియార్, నవీన్ లు తమ వాయిస్ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకొని ఎంతో ఎనర్జిటిక్ గా ఈ పాటని పాడారు. కృష్ణ చైతన్య లిరిక్స్ బాగున్నాయి. స్టూడెంట్స్, అలాగే యువతకు ఈ పాత బాగా నచ్చుతుంది.
2. పాట :డైమండ్ గర్ల్
గాయనీ గాయకులు : శింబు, సుచిత్ర
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
డైమండ్ గర్ల్ పాట ఆల్బం బెస్ట్ సాంగ్స్ లోనే ఒకటిగా చెప్పుకోవచ్చు. తమిళ్ స్టార్ శింబు(ఎస్.టి.అర్) తమిళ వాడైనా సాంగ్ విషయంలో ఎంతో కేర్ తీసుకొని సూపర్బ్ గా పాడారు. శింబుకి సుచిత్ర మంచి సపోర్ట్ ఇచ్చి మరోసారి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. థమన్ తన మ్యూజిక్ తరహాలో మరోసారి వాయిద్యాలను వాయించారు ఎలా అంటే ఈ పాట వింటున్నప్పుడు మీరు మీ కాళ్ళు కదల్చకుండా ఉండలేరు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం బాగుంది. పాటలో వచ్చే ‘ఎస్.టి.అర్ ఫర్ ఎన్.టి.అర్’ అనే ప్రాసలో వచ్చే సౌండ్, అలాగే పాటలో ఇలాంటి టచ్ ఇవ్వడం చాలా బాగుంది. ఈ పాటకి గ్రాండ్ విజువల్స్ ఉంటాయని ఆశించవచ్చు.
‘బాద్షా’ అనే పాట మూవీలో వచ్చే టైటిల్ ట్రాక్ మరియు ఆల్బంలో మీ కాళ్ళను కుదురుగా ఉంచకుండా చేసే మరో సాంగ్ ‘బాద్షా’. హేమచంద్ర, షేఫాలి అల్వారెస్, గీతా మాధురిలు హై ఎనర్జీ లెవల్స్ తో చాలా ఈజ్ తో పాడి తమ వాయిస్ తో పాటకు పూర్తి న్యాయం చేసారు. వినసొంపుగా ఉండే గిటార్ మ్యూజిక్ తో ఈ పాట మొదలవుతుంది. పాట చాలా వేగంగా ఉంటుంది కానీ థమన్ ఈ పాటలో కొన్ని రొటీన్ సౌండ్స్ ని ఉపయోగించారు. విశ్వ సాహిత్యం డీసెంట్ గా ఉంది.
4. పాట : బంతి పూల జానకి
గాయనీ గాయకులు : దలేర్ మెహంది, రనినా రెడ్డి
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
ఆల్బంలోనే ‘బంతిపూల జానకి’ హైలైట్ ట్రాక్ అవుతుంది, అలాగే చార్ట్ బస్టర్ సాంగ్ అవుతుంది. ముందు బెంచ్ వారిని టార్గెట్ చేసిన మాస్ డ్యూయెట్ సాంగ్ ఇది. దలేర్ మెహంది వాయిస్ ఎంతో ఎనర్జీ తో ఈ పాటని పాడారు ఆయన వాయిస్ కి సరిపోయేటట్టుగా ఆయనతో సరి సమానంగా రనినా రెడ్డి తన గాత్రాన్ని అందించింది. ఈ పాటకి తగ్గట్టుగా థమన్ మాస్ కి నచ్చే మోటైన మ్యూజిక్ ని ఇచ్చారు. అందరూ అడిక్ట్ అయ్యే ఈ పాటలో ఎన్.టి.అర్ నుండి సూపర్బ్ స్టెప్స్ ఆశించవచ్చు.
5. పాట : వెల్ కమ్ కనకం
గాయనీ గాయకులు : సౌమ్య రావు, జస్ప్రీత్ జాస్
సాహిత్యం : భాస్కర భట్ల
సినిమాలో వచ్చే ఐటెం సాంగ్ ‘వెల్ కమ్ కనకం’. ఈ పాటకి భాస్కర భట్ల మాస్ మాసాల సాహిత్యాన్ని అందించారు. సౌమ్య రావు తమ వాయితో ఎంతో ఎఫెక్టివ్ గా పాడారు. ఈ పాటలో థమన్ మ్యూజిక్ కాస్త రిపీట్ అయినట్టుగా అనిపిస్తుంది, అలాగే ‘పువాయ్ పువాయ్’ పాటను పోలినట్టు ఉంటుంది. మొత్తంగా ఫాస్ట్ బీట్ తో సాగే ఈ పాట ముందు బెంచ్ వారిని బాగానే ఆకట్టుకుంటుంది.
6. పాట : రంగోలి రంగోలి
గాయనీ గాయకులు : బాబా సెహగల్, ఎం.ఎం మనసి
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
ఈ పాట చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. ఈ పాటలో వచ్చే మ్యూజికల్ సౌండ్ మాన్ టౌన్ లలో జరిగే పెళ్ళిళ్ళలో వాయించే మస్తాన్ బ్యాండ్ ఆర్కెస్ట్రాని పోలి ఉంటుంది. బాబా సెహగల్ ఎంతో ఎనర్జీతో ఈ పాటని పాడారు కానీ ఈ పాటలో అతని సౌండ్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ఓకే అనేలా ఉంది. ఈ పాటలో థమన్ మ్యూజిక్ గురించి రాయడానికి పెద్దగా ఏమీ లేదు. ఆర్డినరీ గా ఉండే ఈ పాట చాలా ఫాస్ట్ గా ఉంటుంది. మాకు తెలిసిన దాని ప్రకారం ఈ పాటలో ఎన్.టి.అర్ డాన్సులు అదిరిపోయే స్టెప్పులు వేసారని సమాచారం.
తీర్పు :
ఎంతో ఎంటర్టైనింగ్ మరియు పెప్పీగా సాగే ‘బాద్షా’ ఆల్బంతో థమన్ మనముందుకొచ్చాడు. ఎక్కువగా కొత్తదనం కోసం ట్రై చెయ్యకుండా ఎన్.టి.అర్ లోని డాన్సింగ్ స్కిల్స్ చూపించే ఫాస్ట్ బీట్ సాంగ్స్ ఇచ్చారు. ‘డైమండ్ గర్ల్’, ‘బంతిపూల జానకి’, ‘సైరో సైరో’ పాటలు ఆల్బంలోని హైలైట్ ట్రాక్స్. మిగిలిన మూడు పాటలు చార్ట్ బస్టర్స్. ‘బాద్షా’ ఎన్.టి.అర్ ఫ్యాన్స్ కి గ్రాండ్ ట్రీట్ ఇవ్వడానికి సిద్దమవుతోంది దానికి ఏ మాత్రం తీసిపోకుండా ఆడియో ఆల్బం ఉంది.