విజయ్ దేవరకొండ నటించిన చిత్రం ‘ గీతగోవిందం’. ఈ సినిమా యొక్క ఆడియో నిన్నే విడుదలైంది. మరి సంగీత దర్శకుడు గోపి సుందర్ సంగీతం అందించిన ఈ పాటలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
గాయనీ గాయకులు : సిడ్ శ్రీరామ్
రచన : అనంత్ శ్రీరామ్
ఈ ఆల్బమ్ ఇంకేం ఇంకేం కావాలా పాటతోనే మొదలవుతుంది. అయితే ఇప్పటికే ఈ పాట బ్లాక్ బస్టర్ అయింది. సిడ్ శ్రీరామ్ ఈ పాటను పాడారు. ఆయన గానంలోని మేజిక్ ఈ పాటకు తోడవడంతో ఓ ఫీల్ క్రియేట్ అయింది. సాంప్రదాయిక ట్యూన్ నుండి మొదలై ఒక సమకాలీన బీట్ తో సాగుతుంది. ఇక అనంత్ శ్రీరామ్ శ్రావ్యమైన సాహిత్యం ఈ పాటను మరో స్థాయికు తీసుకెళ్లాయి. ఇది సరళమైన మరియు రోమాంటిక్ భావాలతో హీరో ఆనందాన్ని వ్యక్తపరుస్తోంది.
గాయనీ గాయకులు : చిన్మయీ
రచన : శ్రీ మణి
ఆల్బమ్ రెండవ పాట అయిన ‘ఏంటి ఏంటి’ పాటను సూపర్ టాలెంట్ సింగర్ చిన్మయీ పాడింది. ఆమె అద్భుతమైన గానంతో పాడగా హీరోయిన్ ఉత్సాహం మరియు ప్రేమను ఈ పాట వ్యక్తపరుస్తోంది. ఇక ఈ పాట సాధారణంగా ప్రారంభించినప్పటికీ, హుక్ అప్ లైన్లు చక్కగా అమర్చబడి ఉంటాయి, గోపి సుందర్ మరోసారి భారతీయ బీట్స్ ను చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు. ఈ పాట విజేతగా నిలిచాడు.
3. పాట : వచ్చిందమ్మా
గాయనీ గాయకులు : సిడ్ శ్రీరామ్
రచన : అనంత్ శ్రీరామ్
ఆల్బమ్ లోని మూడవ పాటగా వచ్చిందమ్మా పాట ఉంది. ఇది అందమైన మోంటేజస్ తో సాగే పాట. ఆసక్తికరమైన ఈ పాట సాంప్రదాయిక మరియు రొమాంటిక్ టచ్ తో చక్కని కోరస్ తో ఆసక్తికరంగా సాగుతుంది. సిడ్ శ్రీరామ్ గానం ఈ చిత్రానికి మరింత బలం చేకూర్చింది. గౌరవప్రదమైన పాత్రలో హీరోయిన్ గురించి మాట్లాడే మరొక పాట ఇది.
గాయనీ గాయకులు : విజయ్ దేవరకొండ
రచన : శ్రీ మణి
ఇక వివాదాస్పదమైన నాలుగవ పాట వాట్ ద లైఫ్ పాటను విజయ్ దేవరకొండ స్వయంగా పాడారు. ట్యూన్ చాలా నిస్తేజంగా ఉంది. సాధారణంగా ఉన్న పాటను ఇక విజువల్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి.
5. పాట : కనురెప్పల కాలం
గాయనీ గాయకులు : గోపి సుందర్
రచన : శసాగర్
ఆల్బమ్ చివరి పాట కనురెప్పల కాలం సంగీత విద్వాంసుడు గోపి సుందర్ స్వయంగా పాడారు. ట్యూన్ చాల సరళమైనది. పైగా గోపి సుందర్ గానం చాలా చక్కగా ఉంది.
తీర్పు:
ఇప్పటి వరకు వచ్చిన విజయ్ దేవరకొండ యొక్క మంచి సినిమాల ఆడియోల్లో ఈ ‘ గీతగోవిందం ఆడియో కూడ ఒకటిగా నిలుస్తుంది. ఒక ప్రేమ కథకు ఎలాంటి సంగీతం, పాటలైతే కావాలో అలాంటివే ఈ పాటలు. ఉన్న ఆరు పాటల్లోకి రెండు పాటలు నిరాశ పరచగా, మరో రెండు పాటలు చాలా బాగున్నాయి. విన్న వెంటనే ఆకట్టుకొనేలా ఉండగా మరో పాట పర్వాలేదనిపించాయి. మొత్తం మీద ఈ పాటలు సినిమాను ప్రేక్షకులకు దగ్గరచేయడంలో దోహపడతాయనే చెప్పొచ్చు.