ఆడియో సమీక్ష : గుండెజారి గల్లంతయ్యిందే – కూల్ గా సాగిపోయే మెలోడీ ఆల్బమ్

ఆడియో సమీక్ష : గుండెజారి గల్లంతయ్యిందే – కూల్ గా సాగిపోయే మెలోడీ ఆల్బమ్

Published on Mar 28, 2013 4:50 PM IST

gunde_jaari-gallanthayyinde

‘ఇష్క్’ లాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ తో చాలా కాలం తర్వాత హిట్ అందుకున్న నితిన్ త్వరలోనే మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘గుండెజారి గల్లతయ్యిందే’ తో మనకు ముందుకు రానుంది. తర్వాత నితిన్, నిత్యా మీనన్, ఇషా తల్వార్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించారు. సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఆడియో నిన్న హైదరాబాద్లో విడుదలైంది. అనూప్ రూబెన్స్ ఇష్క్ సినిమా తర్వాత నితిన్ కి సంగీతం అందించిన ఈ సినిమాలో మొత్తం 5 పాటలున్నాయి. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘తొలిప్రేమ’ సినిమాలోని ‘ఏమైందో ఏమో ఈ వేల’ అనే సూపర్ హిట్ పాటని రీమిక్స్ చెయ్యడం విశేషం. అనూప్ రూబెన్స్ నితిన్ కి మళ్ళీ ఇష్క్ రేంజ్ లో ఆడియో అందించాడో లేదో ఇప్పుడు చూద్దాం..

 

1. పాట : గుండెజారి గల్లంతయ్యిందే

గాయనీ గాయకులు : అనూప్ రూబెన్స్, శ్రావణి, కోరస్

సాహిత్యం : కృష్ణ చైతన్య

gjg1 ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సాంగ్ ఆల్బమ్ వచ్చే మెలోడీ టైటిల్ ట్రాక్. ఈ సాంగ్ మొదట్లో వచ్చే హార్మోనియం మ్యూజిక్, కొద్దిసేపటి తర్వాత ఆ మ్యూజిక్ సరిపోయే రేంజ్ లో డ్రమ్ బీట్స్ జత చేయడం వినడానికి చాలా బాగుంది. మెలోడీగా సాగే ఈ పాటకి అనూప్ రూబెన్స్ వాయిస్ బాగుంది, కానీ ఫుల్ రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్ కి కావాల్సిన వాయిస్ అనూప్ దగ్గర లేదు, శ్రావణి అనూప్ రూబెన్స్ కి మంచి సపోర్ట్ ఇచ్చింది, పాటకి ఆమె వాయిస్ పర్ఫెక్ట్ గా సరిపోయింది. అనూప్ రూబెన్స్ చాలా వినసొంపుగా ఈ మెలోడియస్ పాటకి తగ్గట్టు అనూప్ వాయిద్యాలను ఉపయోగించాడు, ముఖ్యంగా లిరిక్స్ వచ్చేటప్పుడు లిరిక్స్ ని మ్యూజిక్ డామినేట్ చెయ్యకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కృష్ణ చైతన్య అందించిన సాహిత్యం చాలా బాగుంది. ఈ ఆల్బమ్ లో బెస్ట్ సాంగ్స్ లో ఒకటిగా దీన్ని చెప్పుకోవచ్చు, అలాగే అదుతమైన విజువల్స్ తో తీయదగిన సాంగ్.

 

2. పాట : తుహిరే

గాయనీ గాయకులు : నిఖిల్ డిసౌజ, నిత్యా మీనన్

సాహిత్యం : కృష్ణ చైతన్య

gjg4 ‘తుహిరే’ ఆల్బం లో వున్న మరో మెలోడీ డ్యూయెట్ సాంగ్. పాట మొదట్లో వచ్చే తుహిరే తుహిరే అనే పదాలకి నిఖిల్ డిసౌజా ఇచ్చిన వాయిస్ చాలా బాగుంది, ఆ వాయిస్ పాటలో మనల్ని లీనం చేసేస్తుంది. నిత్యా మీనన్ వాయిస్ కూడా పాటకి పర్ఫెక్ట్ గా సరిపోయింది. మెలోడియస్ సాంగ్స్ పాడడంలో మంచి పేరున్న నిత్యా మరోసారి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంది. ఇద్దరి కాంబినేషన్ సింప్లీ సూపర్బ్. పాట మధ్య మధ్యలో వచ్చే ‘తూహి హై మేరీ జాన’ అనే లైన్ యూత్ కి విపరీతంగా నచ్చేస్తుంది. ఈ సాంగ్ లో అనూప్ రూబెన్స్ అందించిన గిటార్ సౌండ్స్, చిన్న చిన్నడ్రమ్ బీట్స్, సింథసైజర్ సౌండ్స్ బాగున్నాయి. కృష్ణ చైతన్య హిందీ తెలుగు కలిపి మంచి ఫీలున్న సాహిత్యాన్ని అందించాడు. చార్ట్ బస్టర్ గా చెప్పుకోదగిన ఈ సాంగ్ ఆల్బమ్ లోనే ది బెస్ట్ సాంగ్.

 

3. పాట : డింగ్ డింగ్ డింగ్

గాయనీ గాయకులు : నితిన్, చైత్ర, రంజిత్, తాగుబోతు రమేష్, ధనంజయ్, అనూప్ రూబెన్స్

సాహిత్యం : కృష్ణ చైతన్య

gjg2 ‘డింగ్ డింగ్ డింగ్’ ఆల్బమ్ ఫాస్ట్ గా సాగే క్లబ్ మిక్స్ సాంగ్. ఈ పాటలో జ్వాలా గుత్తా స్క్రీన్ పై మెరవనుంది. చైత్ర క్లబ్ మిక్స్ కి తగ్గట్టుగా వాయిస్ బాగుంది కానీ స్పెషల్ గా చెప్పుకోవటానికి ఏమీ లేదు అలాగే కృష్ణ చైతన్య సాహిత్యం కూడా చెప్పుకునే స్థాయిలో లేదు. సాంగ్ మొదట్లో మధ్య మధ్యలో వచ్చే తాగుబోతు రమేష్ వాయిస్ కామెడీగా ఉంది. అలాగే ఇష్క్ సినిమాలోని లచ్చమ్మ రీమిక్స్ బిట్ ఈ పాట మధ్యలో రావడం బాగుంది. మొత్తంగా ఈ పాటలో జ్వాలా గుత్తా ఎంట్రీ తప్పితే చెప్పుకోవడానికి ఏమీ లేదు.

 

4. పాట : నీవే నీవే

గాయనీ గాయకులు : అద్నాన్ సమీ

సాహిత్యం : కృష్ణ చైతన్య

gjg5 ‘నీవే నీవే’ ఆల్బమ్ లో వచ్చే మరో సోలో మెలోడీ సాంగ్. ఇది హీరో లవ్ లో పడి తన లవర్ ని తలచుకుంటూ సాగే పాట అయ్యే అవకాశం ఉంది. అద్నాన్ సమీ డైరెక్టర్ అనుకున్న ఫీల్ ని తన వాయిస్ లో చూపించగలిగాడు. పాట మొదట్లో వచ్చే హమ్మింగ్, విజిల్ బాగుంది. ఈ పాటలో అనూప్ రూబెన్స్ గిటార్ వర్క్ బాగుంది. అలాగే ఇండియన్ – వెస్ట్రన్ వాయిద్యాలను మిక్స్ చేసిన మ్యూజిక్ డీసెంట్ గా ఉంది. కృష్ణ చైతన్య సాహిత్యం వినసొంపుగా ఉంది.

 

తీర్పు :

మొత్తంగా ‘గుండెజారి గల్లంతయ్యిందే’ మూవీఆడియో ఆల్బమ్ కూల్ మెలోడీస్ తో సాగిపోయే డీసెంట్ ఆల్బమ్. ‘తుహిరే’, ‘గుండె జారి గల్లంతాయ్యిందే’ పాటలు ఆల్బమ్ లోని బెస్ట్ సాంగ్స్ మరియు ఇవి జనంలో బాగా ప్రాచుర్యం పొందుతాయి. అద్నాన్ సమీ పాడిన ‘నీవే నీవే’ సాంగ్ వినగా వినగా బాగుంటుంది. అనూప్ రూబెన్స్ కొత్తరకమైన ట్యూన్స్ పై ప్రయోగం చేయకుండా తన ట్రేడ్ మార్క్ తో కూడుకున్న వెస్ట్రన్ బీట్స్ తో కూడుకున్న ఆల్బమ్ ని ఈ సినిమాకి ఇచ్చాడు.

సమీక్ష – మహేష్ ఎస్ కోనేరు
అనువాదం – రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు