ఆడియో రివ్యూ : సింగం – డీసెంట్ ట్యూన్స్ విత్ బీట్స్

Singam
తమిళ్ స్టార్ సూర్య పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ‘యముడు’ సినిమా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆ సక్సేసుల్ సినిమాకి సీక్వెల్ రానున్న విషయం అలాగే ఈ సినిమాకి ‘సింగం’ అనే టైటిల్ ని ఖరారు చేసిన విషయం కూడా తెలిసిందే. ఫస్ట్ వెర్షన్ కి మ్యూజిక్ కంపోజ్ చేసిన దేవీశ్రీ ప్రసాద్ ఈ సీక్వెల్ కి కూడా మ్యూజిక్ కంపోజ్ చేసాడు. ఈ సినిమా ఆడియో ఈ ఆదివారం విడుదలైంది. హరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలున్నాయి. ఇంతకీ అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

1. పాట : వాలే వాలే

గాయకుడు : టిప్పు

సాహిత్యం : సాహితి

‘వాలే వాలే’ కాస్త టిపికల్ గా ఉండే మాస్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్. ఈ పాటలో అదిరిపోయే బీట్స్, సౌండింగ్ గట్టిగా ఉండే లిరిక్స్ ఉన్నాయి. హీరో పాత్రని హై రేంజ్ లో ఎలివేట్ చేసే విధంగా సాహితి ఈ పాటని రాసారు. టిప్పు ఈ పాటకి తన గాత్రంతో న్యాయం చేసాడు. ఈ పాటలో మ్యూజిక్ స్పీడుగా ఉంది అలాగే దేవీశ్రీ అందించిన మ్యూజిక్ ఈ పాటకి పర్ఫెక్ట్ గా సరిపోయింది. మొత్తంగా మాస్ బీట్స్ తో సాగే డీసెంట్ సాంగ్, ఈ పాటకి సరైన విజువల్స్ తోడైతే చూడటానికి బాగుంటుంది.

 

2. పాట : తెలియదులే

గాయని : శ్వేత మోహన్

సాహిత్యం : అనంత్ శ్రీరామ్

‘తెలియదులే’ పాట ఆల్బం లోని మెలోడియస్ సాంగ్. వినసొంపుగా ఉన్న శ్వేత మోహన్ వాయిస్ ఈ పాటకి ప్రత్యేక బలాన్ని చేకూర్చింది. ఆమె ఈ పాటకి తన వంతు న్యాయం చేసింది. అనంత్ శ్రీ రామ్ సాహిత్యం చాలా బాగుంది అలాగే ఒక కావ్యంలా ఉన్నాయి. ఈ పాటలో హీరోయిన్ హీరో పై ఉన్న ఫీలింగ్ ని వ్యక్తపరిచే విధంగా ఉంది. దేవీ శ్రీ మ్యూజిక్ చాలా మెలోడియస్ గా ఉంది. దేవీశ్రీ ఇండియన్ – వెస్ట్రన్ వాయిద్యాలను వాడి ఈ సౌండ్ ట్రాక్ ని కంపోజ్ చేసాడు. మొత్తంగా ఇది వినడానికి హాయిగా ఉండే సోలోమెలోడియస్ సాంగ్.

3. పాట : సింగం డాన్స్

గాయనీ గాయకులు : సుచిత్ సురేసన్, షర్మిల

సాహిత్యం : అనంత్ శ్రీరామ్

సుచిత్ సురేసన్, షర్మిల కలిసి పాడిన రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్ ‘సింగం డాన్స్’. పబ్ లో సాగే ఈ పాట టీజర్ చూస్తుంటే సూర్య, అనుష్క ఈ పాటలో స్టెప్పులేసి కనువిందు చేయనున్నారనే విషయం తెలుస్తుంది. సుచిత్ సురేసన్, షర్మిల వాయిస్ విషయంలో జాగ్రత్తలు తీసుకొని చక్కగా పాటని పాడారు. అనంత్ శ్రీరామ్ అందించిన సాహిత్యం చాలా ఆర్డినరీగా ఉంది. దేవీశ్రీ మ్యూజిక్ జస్ట్ ఓకే. మొత్తంగా ఆల్బం లో యావరేజ్ గా అనిపించే సాంగ్.

 

4. పాట : సూరీడు సూరీడు

గాయకుడు : ఎంఎల్ఆర్ కార్తికేయన్

సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి

ఎంతో ఎమోషనల్ గా, పవర్ఫుల్ గా సాగే ‘సూరీడు సూరీడు’ పాటని ఎంఎల్ఆర్ కార్తికేయన్ ఎంతో ఎఫ్ఫెక్టివ్ గా పాడాడు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటని సినిమాలో సూర్య రివెంజ్ తీర్చుకునే కీలకమైన ఎపిసోడ్స్ బ్యాక్ గ్రౌండ్ లో వాడుకునే అవకాశం ఎక్కువ ఉంది. ఈ పాటకి బాగా రౌద్రంగా ఫీలయ్యే మ్యూజిక్ ని దేవీశ్రీ అందించాడు. ఈ పాటలో ట్రెడిషనల్ వాయిద్యాల సౌండ్స్ ఎక్కువగా వినిపిస్తాయి. ఈ పాట వినడానికి బాగుంది దీనికి మంచి విజువల్స్ తోడైతే ఆన్ స్క్రీన్ పై సూపర్బ్ గా ఉంటుంది.

5. పాట : సింహం సింహం

గాయకుడు : దేవీశ్రీ ప్రసాద్

సాహిత్యం : సాహితి

ఈ పాటలో ‘యముడు’ సినిమాలో బాగా ఫేమస్ అయిన ‘సింహం సింహం హీ ఈజ్ నరసింహం’ అనే పల్లవిని ఉపయోగించుకున్నారు. ఫుల్ ఎనర్జీ తో దేవీశ్రీ ప్రసాద్ ఈ పాటని పాడాడు. ఈ పాటని కూడా ఎక్కువగా కొన్ని కీలక సన్నివేశాల్లో ఉపయోగించుకునే అవకాశం ఉంది. సాహితి సాహిత్యం బాగుంది. ఈ పాటలో ఆయన పోలీస్ కర్తవ్యం ఏమిటనేది చెప్పాడు. దేవీశ్రీ మ్యూజిక్ పుల్ బీట్స్ తో మనల్ని రెచ్చగొట్టేలా ఉంటుంది. ‘సూరీడు సూరీడు’ పాటలాగే ఈ పాటకి మంచి విజువల్స్ కుదిరితే తెరపై అదిరిపొద్ది.

 

6. పాట : నీ కన్నే గన్నై

గాయనీ గాయకులు : సాగర్, ప్రియ హేమేష్

సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి

ముందు బెంచ్ మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి చేసిన మాస్ డ్యూయెట్ సాంగ్ ‘నీ కన్నే గన్నై’. సాగర్, ప్రియ హేమేష్ తమ గాత్రం విషయంలో జాగ్రత్త తీసుకొని బాగా పాడారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ఓకే. దేవీశ్రీ మ్యూజిక్ చాలా ఎనర్జీ గా ఉంది, అలాగే పెప్పీగా సాగడంతో పాత తొందరగానే నచ్చేస్తుంది. ఈ పాటకి మాస్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వస్తుంది.

తీర్పు :

యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ రొటీన్ గా అనిపించే ట్యూన్స్ తో సేఫ్ గా చేసిన ఆల్బం ‘సింగం’. ఈ ఆల్బంలో కొని మంచి ట్యూన్స్ ఉన్నాయి కానీ మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో ఏమీ లేవు. ‘తెలియదులే’, ‘సూరీడు సూరీడు’, ‘నీ కన్నే గన్నై’ పాటలు ఆల్బంలోని బెస్ట్ సాంగ్స్. ఈ సినిమా కమర్షియల్ మాస్ మసాలా ఎంటర్టైనర్ గా ఉంటుందని భావిస్తున్నారు, దానిని ప్రతిబింబించేలానే ఆడియో ఉంది. ఈ ఆల్బంలో దేవీశ్రీ బెస్ట్ అని చెప్పుకోవడానికి ఏమీలేదు కానీ మీరు కచ్చితంగా వినొచ్చు.

రివ్యూ – మహేష్ ఎస్ కోనేరు

అనువాదం – రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version