ఆడియో సమీక్ష : ఉయ్యాలా జంపాలా – వినసొంపైన పాటలు..

ఆడియో సమీక్ష : ఉయ్యాలా జంపాలా – వినసొంపైన పాటలు..

Published on Dec 18, 2013 5:00 PM IST

Uyyala-Jampala
గతంలో ‘అష్టా చమ్మా’, ‘గోల్కొండ హై స్కూల్’ లాంటి సినిమాలను అందించిన రామ్ మోహన్ నాగార్జునతో కలిసి డి. సురేష్ బాబు సమర్పణలో నిర్మించిన సినిమా ‘ఉయ్యాలా జంపాలా’. ఇలా పెద్ద పెద్ద వాళ్ళంతా కలిసి చేసిన ఈ సినిమా ద్వారా రాజ్ తరుణ్ హీరోగా, అవిక గోర్ హీరోయిన్ గా పరిచయవుతున్నారు. ఎంఆర్ సన్నీ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలైంది. ఈ చిత్ర ఆడియో సినీ అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. పల్లె టూరిలో సాగే ఈ సినిమాకి సన్నీ అందించిన మెలోడియస్ సంగీతం అందరినీ మెప్పించింది. సినిమాపై మంచి అంచనాలున్న ఈ ఆల్బంలోని పాటలు ఎలా ఉన్నాయో చూద్దాం…

1. పాట : ఉయ్యాలైన జంపాలైన

గాయనీ గాయకులు : హర్షిక గుడి, అనుదీప్ దేవ్

సాహిత్యం : వాసు వలబోజు

7
ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ అయిన ‘ఉయ్యాలైనా జంపాలైనా’ వినడానికి ఎంతో సాఫ్ట్ గా, చాలా మెలోడియస్ గా ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే లాలి పాట ఉన్నట్టు ఉంటుంది. హర్షిక గుడి వాయిస్ వినడానికి చాలా ఫ్రెష్ గా ఉంది, అలాగే తనకి సరిపోయేలా అనుదీప్ దేవ్ వాయిస్ కూడా ఉంది. ముఖ్యంగా ఈ పాటలో గాయకుల వాయిస్ లోని ఫీల్ ఏ మాత్రం చెడి పోకుండా బ్యాక్ గ్రౌండ్ లో అంట మంచి మ్యూజిక్ ఇచ్చిన సన్నీకి 100కి 100 మార్కులు వేయచ్చు. పాటలో ఎక్కువ భాగం గిటార్ సౌండ్ చాలా చిన్నగా వినిపిస్తూ ఉంటుంది. వాసు వలబోజు సాహిత్యం బాగుంది. మీరు వినే కొద్దీ వినాలని పించేలా ఈ పాట ఉంటుంది.

 

2. పాట : లపక్ లపక్ అయిపోతుంది

గాయనీ గాయకులు : హర్షిక గుడి, బిందు, దీపు

సాహిత్యం : వాసు వలబోజు

1
కళ్ళముందు జరుగుతున్నట్టు సాగే ఈ పాటకి హర్షిక, బిందు, దీపు కలిసి మంచి వాయిస్ ని అందించారు. ఈ పాటలోని సాహిత్యం మాములుగానే ఉన్నప్పటికీ సింగర్స్ మాత్రం తమ ఎనర్జిటిక్ వాయిస్ లతో పాటని బాగా పాడారు. సన్నీ ఈ పాటలో రాక్ మ్యూజిక్ ని చాలా సాఫ్ట్ గా గా కొట్టాడు. ఈ పాటలో మనకు ఎక్కువగా సాక్సో ఫోన్, ట్రంపెట్ వాయిద్యాల సౌండ్ తో పాటు సింపుల్ డ్రమ్ బీట్స్ మనకు వినిపిస్తాయి. మొత్తంగా ఈ పాట చేలా డీసెంట్ గా ఉంటుంది. ఈ పాటకి డాన్స్ కంపోజింగ్ చేయకుండా సీన్స్ లా తీసి ఉంటే తెరపై చూడటానికి చాలా బాగా ఉంటుంది.

 

3. పాట : నిజంగా ఇది నేనేనా

గాయనీ గాయకులు : హర్షిక గుడి, సన్నీ ఎంఆర్

సాహిత్యం : రాంబాబు గోసల, వాసు వలబోజు

6
‘నిజంగా ఇది నేనేనా’ అనే పాట వినసొంపుగా ఉండే వయొలిన్ సౌండ్స్ తో మొదలవుతుంది. ఆ తర్వాత దానికి పెర్క్యూషణ్, గిటార్ వాయిద్యాల సౌండ్ ని జత చేసారు. వాసు – రాంబాబు అందించిన మంచి సాహిత్యానికి హర్షిక తన గాత్రంతో న్యాయం చేసింది. మన చెవులకు వినడానికి ప్రశాంతంగా అనిపించే ఈ పాటలో గిటార్ సౌండ్స్ బాగున్నాయి. ఈ పాట కూడా వినగా వినగా మీకు బాగా నచ్చేస్తుంది.

 

4. పాట : మన బంధం

గాయకుడు : సన్నీ ఎంఆర్

సాహిత్యం : వాసు వలబోజు

5

మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ ఎంఆర్ ఈ పాటని ఆలపించాడు. అతని వాయిస్ ఓకే అనేలా ఉంది, ఒకవేళ ఇదే పాటని వేరే ఎవరన్నా ప్రొఫెషనల్ సింగర్ పాడి ఉంటే ఇంకా బాగుండేది. వాసు వలబోజు అందించిన సాహిత్యం మనలోని భావాలను కదిలించేలా ఉన్నాయి. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ఈ పాటలో అన్నిటికంటే గిటార్ సౌండ్స్ ఎక్కువగా వినిపిస్తుంది, మధ్య మధ్యలో ఫ్లూట్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా ఇది కూడా ఆల్బంలోని మరో డీసెంట్ సాంగ్.

 

5. పాట : దేర్ తక్ చలా (హిందీ)

గాయకుడు : అరిజిత్ సింగ్

సాహిత్యం : ఆశిష్ పండిట్

2
ఈ పాట ఆల్బంలోని మన బంధం సాంగ్ కి హిందీ వెర్షన్. అరిజిత్ సింగ్ ఈ పాటలోని ఫీల్ పాకుండా బాగా ఆలపించాడు. ఈ పాట తెలుగు వెర్షన్ ని కూడా ఇతనే పాడి ఉంటే బాగుండేది.

 

 

తీర్పు :

‘స్వామి రారా’ సినిమాకి మంచి మ్యూజిక్ అందించి సన్నీ ఎంఆర్ మంచి పేరే తెచ్చుకున్నాడు. అతను కంపోజ్ చేసే ఫ్రెష్ ట్యూన్స్ మరియు సంగీత వాయిద్యాలను కొత్తగా వాడటం అతనికి గుర్తింపు నిచ్చింది. ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాకి సన్నీ ఎంఆర్ మరోసారి మంచి ఆల్బంని అందించాడు. ఉయ్యాలా జంపాలాకి అందించిన మ్యూజిక్ చాలా మెలోడియస్ గా, వినసొంపుగా ఉన్నాయి. ఈ ఆల్బంలో ఎలాంటి మాస్ సాంగ్స్ లేవు, చెప్పాలంటే ఈ సినిమాకి అది అవసరం లేదు. ఈ ఆల్బం వినడానికి కాస్త సమయాన్ని కేటాయించండి మీరు ఫ్రెష్ గా ఫీలవుతారు.

మహేష్ ఎస్ కోనేరు

అనువాదం : రాఘవ

 

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు