గౌతం మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఎటో వెళ్లిపోయింది మనసు” చిత్రానికి ‘మేస్ట్రో’ ఇళయరాజా స్వర సారధ్యం వహించారు. సమంత కథానాయికగా నటించిన ఈ చిత్రంలో నాని హీరోగా నటించారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు కనుక ఈ చిత్రంలో పాటల మీద అభిమానుల అంచనాలు ఆకాశాన్ని అంటాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఈ చిత్రంలో పాటలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ చిత్రంలో పాటలన్నీ అనంత శ్రీ రామ్ రచించారు.
1. పాట : ఏది ఏది
గాయకులు : రమ్య ఎన్ ఎస్ కే, షాన్
ఈ డ్యూయెట్ మంచి గిటార్ బీట్ తో మొదలవుతుంది షాన్ గాత్రంతో మొదలయిన ఈ పాటలో రమ్య మరియు షాన్ ల ప్రదర్శన చాలా బాగుంది. సాఫ్ట్ మరియు మెలోడియస్ గా సాగే ఈ పాట మంచి రొమాంటిక్ ఫీల్ ని కలిగేలా చేస్తుంది. సాహిత్యం ఈ పాటకి ప్రాణం పోసింది. కాస్త సమయం తీసుకున్నా, ఈ పాట పోను పోను అందరి మనసులో నిలిచిపోయే పాటగా మిగిలిపోనుంది.
2. పాట : కోటి కోటి
గాయకులు : కార్తీక్
3. పాట : అటు ఇటు
గాయకులు : సునిధి చౌహాన్
4. పాట : లాయి లాయి
గాయకులు : ఇళయరాజా, బేల శేండే
5. పాట : నచ్చలేదు మావా
గాయకులు : కార్తీక్, సురాజ్ జగన్
ఈ పాట ఈ అల్బంలోనిది లా అనిపించదు. ఇలా జరగడానికి ప్రధాన కారణం సాహిత్యం చాలా పేలవంగా అనిపించడం. సాహిత్యం ర్హితమిక్ గా లేదు ఇందులో పెర్కుషన్ వాయిద్యాలు వాడటం మూలాన వెస్ట్రన్ ఫీల్ వస్తుంది. కార్తిక్ మరియు సురాజ్ ల ప్రదర్శన కూడా పరవాలేదు అనిపించింది. మొత్తానికి ఈ ఆల్బంలో వీక్ పాట ఇదే.
6. పాట :ఎంతెంత దూరం
గాయకులు : కార్తీక్
ఇది మరో అద్భుతమయిన ఇళయరాజా శైలి సోలో పాట. కార్తీక్ ఈ పాటను చాల అద్భుతమయిన ఫీల్ తో అందించాడు. ఈ పాటలో హీరో తనకు హీరోయిన్ మీద ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటాడు అనంత శ్రీ రామ్ ఈ పాటకు చాలా మంచి సాహిత్యం అందించారు. ఇళయరాజా సంగీతం చాలా ఆహ్లాదంగా ఉంది మనకి రొమాంటిక్ ఫీల్ కలిగేలా చేస్తుంది. కాస్త సమయం తీసుకున్నాక ఈ పాట నచ్చడం మొదలు పెడుతుంది. మొత్తానికి చాలా మంచి పాట.
7. పాట : అర్ధమయ్యింది ఇంతే ఇంతేనా
గాయకులు : యువన్ శంకర్ రాజ
ఈ సోలో పాట కూడా సాహిత్యం బలంగా లేకపోవడం వలన పేలవంగా అయిపోయిన మరో పాట. ఈ పాటలో మ్యూజిక్ లో ఫీల్ ఉన్న కూడా సాహిత్యం ఆ ఫీల్ ని తీసుకురాలేకపోయింది. యువన్ అందించిన గాత్రం కూడా పెద్దగా మెప్పించలేకపోయింది. వెస్ట్రన్ బీట్స్ తో నిండిపోయిన ఈ పాట మిగిలిన పాటలలో ఉన్న మాధుర్యం లేక ఈ పాటలో ప్రత్యేకత లేక ఒక మాములు పాటలాగా మిగిలిపోయింది.
8. పాట : ఇంతకాలం
గాయకులు : రమ్య
ఈ విషాద గీతంకి కావలసినంత ఫీల్ ని రమ్య తన గాత్రంతో అందించింది. తన గాత్రం సమంతకి బాగా నప్పుతుంది. ఈ పాట కల కరిగిపోయిన హీరోయిన్ భావాలను తెలిపేలా ఉంది. ఇళయరాజా సంగీతం ఈ పాటలో ఉన్న ఫీల్ ని బాగా వ్యక్తపరిచేలా చేసింది. ఈ పాటకి అందించిన సాహిత్యం చాలా బాగుంది. ప్రేమికులకు మరియు పెద్దలకు ఈ పాట భావోద్వేగాలను చేరేలా ఉంటుంది.
తీర్పు : “ఎటో వెళ్లిపోయింది మనసు” ఆల్బంలో కొన్ని వినసోంపయిన పాటలు ఉన్నాయి ఇవి ఇళయరాజా 80 మరియు 90లో విన్న ఇళయరాజా పాతలంత పాటలంత మధురంగా ఉన్నాయి. ఇది అయన అత్యత్తమ ప్రదర్శన కాకపోయినా “లాయి లాయి” మరియు “ఎంతెంత దూరం” వంటి పాటలు ఆయన శైలిని తలపిస్తాయి. ” కోటి కోటి” పాట కూడా బాగుంది కొన్ని పాటలు మాత్రం ఇళయరాజా పాటల్లా అనిపించవు.మొత్తానికి తీసుకుంటే “ఎటో వెళ్లిపోయింది మనసు” ఇళయరాజా శైలి ఆల్బం. వినగా వినగా ఈ పాటలు మనస్సుని చేరుకుంటాయి. గౌతం మీనన్ చిత్రీకరణ తోడయితే పాటలు ప్రాముఖ్యత పొందుతాయి.