సమీక్ష : ఆలోచింపజేసే ‘అయ్యారే’

సమీక్ష : ఆలోచింపజేసే ‘అయ్యారే’

Published on Jan 21, 2012 2:05 AM IST
 
విడుదల తేది :20 జనవరి 2012
123తెలుగు.కాం రేటింగ్: 3/5
దర్శకుడు : సాగర్ చంద్ర
నిర్మాత : సుధాకర్ బాబు
సంగిత డైరెక్టర్ : సునీల్ కశ్యప్
తారాగణం : రాజేంద్ర ప్రసాద్ ,సాయి కుమార్ ,శివాజీ .అనిశ సింగ్

సాగర్ చంద్ర డైరెక్షన్లో రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలో శివాజీ-అనీషా సింగ్ జంటగా నటించిన చిత్రం ‘అయ్యారే’. ఈ చిత్రం నిత్యానంద స్వామి జీవిత చరిత్ర పై తీసారంటూ ఎన్నో వివాదాలు సృష్టించింది. ఎట్టకేలకు అన్ని విఘ్నాలు దాటుకొని అయ్యారే చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ:

వెంకటేశం (శివాజీ) తనకంటూ సొంతంగా ఒక మెకానిక్ షెడ్ పెట్టుకుని సరదాగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. అంజలి (అనీషా సింగ్)ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. కొన్ని సంఘటనల తరువాత అంజలి కూడా వెంకటేశం ని ప్రేమిస్తుంది. వీరి ప్రేమ విషయం తెలుసుకున్న అంజలి తండ్రి శివప్రసాద్ (శివప్రసాద్) ఏం చేయాలో పాలుపోక ‘పరకాయ బాబా’ (రాజేంద్రప్రసాద్) అనుమతి అడుగుతాడు. మొదటగా వారిద్దరకీ పెళ్లి చేయమని చెప్పిన పరకాయ బాబా తరువాత పెళ్లి చేయొద్దు అంటాడు. బాబా అలా ఎందుకు అన్నాడు? ఈ వెంకటేశం కి పరకాయ బాబాకి అసలు సంబంధం ఏంటి? అసలు ఇంతకు ఈ పరకాయ బాబా ఎవరు ఆయన గతం ఏమిటి? ఈ చిక్కుముడులన్ని వీడాలంటే అయ్యారే చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

పరకాయ బాబా అవతారంలో రాజేంద్రప్రసాద్ గారు అధ్బుతంగా నటించారు. బాబా అవతారంలో ఆయన నిజమైన బాబాలను తలపించారు. బాబాగా అవతరించే సన్నివేశంలో రాజేంద్రప్రసాద్ కాకుండా ఆ పాత్ర మాత్రమే కనిపిస్తుంది. భక్తులకు అయన చెప్పే సూక్తులు ప్రతి ఒక్కరినీ నవ్విస్తాయి. కూతురి కోసం ఆయన పడే తాపత్రయం కంటతడి పెట్టిస్తుంది. వెంకటేశం పాత్రలో శివాజీ బాగా చేసాడు. కొన్ని కామెడి సన్నివేశాల్లో మాత్రం బాగా నవ్వించాడు. ఫైట్స్ కూడా బాగానే చేసాడు. గజపతి పాత్రలో విలన్ గా నటించిన సాయి కుమార్ బాగా చేసాడు. ఆయనకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. అనీషా సింగ్ మొదటి చిత్రమైనా పర్వాలేదనిపించింది. కొన్ని సన్నివేశాలకు తగ్గట్లుగా ఎక్స్ప్రెషన్స్ మాత్రం సరిగా ఇవ్వలేకపోయింది. ‘తెలుసునా’ అనే పాట బావుంది. అదితి అగర్వాల్ ఐటెం గర్ల్ గా నర్తించిన ‘ఎట్టాగో వచ్చేది 2012’ బావున్నప్పటికీ సరైన టైమింగ్ లేక వృధా ఐపోయింది. మిగిలిన నటీనటులందరు పరవలేధనిపించారు.

మైనస్ పాయింట్స్:

చిత్ర మొదటి భాగంలో కథ పెద్దగా లేకపోవడం, శ్రీనివాస్ రెడ్డి కామెడి పర్వలేదనిపించినా వేణుమాధవ్ మరియు అలీల కామెడీ కామెడి నవ్వించకపోగా కొంచెం బోర్ కొట్టిస్తుంది. తెలుసునా పాట ఒక్కటి తప్ప మిగతా పాటలు కూడా సరైన టైమింగ్ లేక ఇబ్బంది కలిగిస్తాయి. ఎమ్మెస్ నారాయణ్ కామెడి చిరాకు తెప్పిస్తుంది. అసలు ఆయన పాత్ర అనవసరం. హీరోయిన్ అంజలి ఇంట్రడక్షన్ సీన్ కూడా ఎబ్బెట్టుగా ఉంది.

సాంకేతిక విభాగం:

నివాస్ రాసిన డైలాగులు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఎడిటింగ్ మాత్రం అంతా బాగాలేదు. మొదటి భాగంలో కొన్ని సన్నివేశాలకు కత్తెర వేయాల్సింది. భాస్కర్ అందించిన సినిమాటోగ్రఫీ పర్వాలేదు. లైటింగ్ లేక సినిమా అంతా డల్ గా ఉన్నట్లు అనిపిస్తుంది. సునీల్ కశ్యప్ సంగీతంలో రెండు పాటలు బావున్నాయి. సన్నివేశాలకు తగ్గట్లుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. ఇతను భవిష్యత్తులో మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. డైరెక్టర్ సాగర్ చంద్ర తను అనుకున్న సబ్జెక్ట్ కి న్యాయం చేసారనే చెప్పుకోవాలి. పరకాయ బాబా ఎపిసోడ్ కి తీసుకున్నంత శ్రద్ధ చిత్ర మొదటి భాగం మీద కూడా తీసుకుని ఉంటే ఇంకా బావుండేది.

తీర్పు:

ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రజలు ఈ రోజుల్లో దొంగ బాబాలను ఎంత గుడ్డిగా నమ్ముతున్నారు అనే సబ్జెక్ట్ తో రూపొందిన చిత్రం అయ్యారే. దాని చట్టూ కొన్ని పాత్రలు అల్లుకొని కథ రాసుకున్నారు. ఈ చిత్రం మిమ్మల్ని తప్పక అలరిస్తుంది.

అశోక్ రెడ్డి. ఎమ్

123తెలుగు.కాం రేటింగ్: 3/5

Clicke Here For Ayyare English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు