విడుదల తేదీ : ఆగస్టు 20,2021
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
తారాగణం: సంపూర్ణేష్ బాబు, సాయాజి షిండే, 30 ఇయర్స్ పృథ్వి, కత్తి మహేష్ తదితరులు..
దర్శకత్వం: వసంత నాగేశ్వరరావు
నిర్మాత : సంధిరెడ్డి శ్రీనివాసరావు
సంగీతం : ఎస్ఎస్ ఫ్యాక్టరీ
ఎడిటింగ్ : గౌతం రాజు
సినిమాటోగ్రాఫర్ : ఏ విజయ్ కుమార్
తక్కువ బడ్జెట్ చిత్రాల ధోరణి ను కొనసాగిస్తూ, నేటి ఎంపిక అయిన సంపూర్ణేష్ బాబు బజార్ రౌడీ, ఎలా ఉందో చూద్దాం రండి.
కథ :
కాళీ ( సంపూర్ణేష్ బాబు ) చిన్నప్పటి నుండే సమస్యలు ఎదుర్కొంటాడు. అతని తండ్రి ( నాగినీడు ) కలత చెందుతూ, కాళీ ను కొడుతూ ఉండేవాడు. తన స్నేహితులలో ఒకరిను గాయ పరిచిన తర్వాత, కాళీ తన తండ్రి దెబ్బకు భయపడి ఇంటి నుండి పారిపోతాడు. ఒక బస్తీ వాళ్లు అతన్ని పెంచి, బజార్ రౌడీ గా మారుస్తారు. కాళీ అంకుల్స్ అతని ఆస్తి ను దోచుకోవడానికి పతకం వేస్తారు. కాళీ ను డూప్ గా తీసుకెళ్తారు. కానీ, కాళీ తనంతట తాను గా వెళ్తున్నాడు అని, మరియు తన తల్లిదండ్రులను ఎలా చూసుకుంటాడు అనేది సినిమా స్టోరీ.
ప్లస్ పాయింట్స్ :
సంపూర్ణేష్ బాబు ఎప్పటిలాగానే ఈ సినిమా కోసం చాలా బాగా పని చేశారు. విభిన్న అవతారాల లో ఉత్తమ నటన కన బరిచాడు. షియాజి శిండే, పృథ్వీ, దివంగత కత్తి మహేష్ ల నటన బావుంది. వారి మధ్యన వచ్చే సన్నివేశాలు చాలా బావున్నాయి.
ఫస్ట్ హాఫ్ తో పోల్చినప్పుడు సెకండ్ హాఫ్ కొంచెం అర్థ వంతం గా ఉంటుంది. కొన్ని హాస్య సన్నివేశాలు అక్కడక్కడ బావున్నాయి. సంపూర్ణేష్ ధనవంతుడు గా ఎలివెట్ చేసే విధానం చాలా బావుంది.
మైనస్ పాయింట్స్ :
మనం అందరం కూడా సంపూర్ణేష్ బాబు కామెడీ సన్నివేశాలను మరియు స్పూఫ్ లని ఆస్వాదించడానికి వెళ్తాం, కానీ సినిమా లో ఇవి అన్ని ఉన్నప్పటికీ 80 వ దశకం లో కథ మరియు కథనం ఉన్నందన అంత అర్థవంతంగా అనిపించదు.
ఫస్ట్ హాఫ్ కేవలం సంపూర్ణేష్ బాబు ఎలివేషన్ సన్నివేశాలతో నిండి ఉంది, హాస్య నటుడు గా కూడా కనిపించడు, అక్కడక్కడా హంగామా చేయడం చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఈ సెకండ్ హాఫ్ లో రౌడీ అల్లుడు స్పూఫ్ అనే విధంగా ఉంటుంది, ఎవరైనా ఇట్టే చెప్పగలరు. చాలా చీప్ గా అనిపిస్తుంది.
ఈ సినిమా లో చాలా చీప్ సన్నివేశాలు ఉన్నాయి. హీరోయిన్ కి సంబంధించిన సన్నివేశాల్లో కామెడీ జనరేట్ అయ్యే విధానం బాగా లేదని చెప్పాలి.కథలో కొత్త దనం లేదని చెప్పాలి. అంతేకాక ప్రతిదీ ఫోర్స్ చేసినట్లు గా ఉంటుంది.
సాంకేతిక విభాగం :
సినిమా నిర్మాణ విలువలు పర్వాలేదు అని చెప్పాలి. సంగీతం చాలా అధ్వాన్నంగా ఉంది, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సైతం అదే విధంగా ఉంది. సన్నివేశాలు పర్వాలేదు అనిపించినా, సంపూ కోసం తయారు చేసిన కాస్ట్యూమ్స్ భయంకరం గా ఉన్నాయి. చాలా సన్నివేశాలు ఎడిట్ చేయాల్సి ఉన్నా చేయలేకపోవడం తో ఎడిటింగ్ చాలా అధ్వాన్నంగా ఉందని చెప్పాలి.
ఇక దర్శకుడు వసంత నాగేశ్వర రావు విషయానికి వస్తే, సినిమా తో నిరాశ పరిచారు అని చెప్పాలి. సంపూ వంటి నటుడు ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదు అని చెప్పాలి. ఫన్ యాంగిల్ మిస్ అవ్వడం మాత్రమే కాకుండా,అతని లో ఉన్న నటుడిని సరిగ్గా ఉపయోగించుకోలేదు.
తీర్పు :
మొత్తం మీద బజార్ రౌడీ సినిమా పూర్ కామెడీ డ్రామా. సంపూర్ణేష్ బాబు ఎంతగా ప్రయత్నించినా ఎగ్జిక్యూశన్ లో లోపం మరియు సిల్లీ గా ఉండటం వలన అంతగా ఆకట్టుకోదు. ప్రేక్షకుల మానసిక స్థితిని కచ్చితంగా పాడు చేస్తుంది అని చెప్పాలి. ఇది చాలా డల్ గా మరియు సిల్లీ కామెడి సినిమాగా ఉంటుంది.
123telugu.com Rating : 2/5
Reviewed by 123telugu Team