పాటల సమీక్ష : భరత్ అనే నేను – అంచనాలను అందుకున్నాయి

పాటల సమీక్ష : భరత్ అనే నేను – అంచనాలను అందుకున్నాయి

Published on Apr 8, 2018 2:31 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివల కలయికలో రూపొందిన రెండవ చిత్రం ‘భరత్ అనే నేను’. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం యొక్క పూర్తి పాటలు విడుదలయ్యాయి. మరి ఈ పాటలు ఏ స్థాయిలో అలరించాయో ఇప్పుడు చూద్దాం…

1. పాట : భరత్ అనే నేను Pedda Pulli

గాయనీ గాయకులు : డేవిడ్ సిమోన్
సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి

ఈ ‘భరత్ అనే నేను’ టైటిల్ సాంగ్ వింటే సినిమా తత్త్వం, కథలో మహేష్ బాబు పాత్ర యొక్క వ్యక్తిత్వం ఏమిటనేది వివరంగా తెలిసిపోతోంది. రామ జోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం ‘భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను, మాటిచ్చా నేనీ పుడమికి.. పాటిస్తా ప్రాణం చివరికి’ వంటి లిరిక్స్ పాట యొక్క ఔన్నత్యాన్ని పెంచగా, దేవి శ్రీ ప్రసాద్ అందించిన అద్భుతమైన సంగీతం పాటను మళ్ళీ మళ్ళీ వినాలనేలా చేసింది. ఇక సింగర్ డేవిడ్ సిమోన్ అద్భుతమైన గాత్రం పాటను ఆడియోని ఉత్తమైన పాటల్లో ఒకటిగా నిలబెట్టింది.

Ga Gha Megha2. పాట : ఐ డోంట్ నో 
గాయనీ గాయకులు : ఫర్హాన్ అక్తర్ 
సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి 

ఆల్బమ్ మొత్తంలోకి ప్రత్యేకంగా అనిపించే ఈ పాట వినడానికి కొంత భిన్నంగా, కొత్తగా అనిపిస్తోంది.  ఈ పాటలో దేవి శ్రీ ప్రసాద్ స్వరాలతో ప్రయోగం చేయగా రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ లో కొత్తదనాన్ని చూపారు.  ఇక బాలీవుడ్ నటుడు, సింగర్ ఫర్హాన్ అక్తర్ కూడ పాటను కొత్త రీతిలో ఆలపించారు.  ఇలా అందరూ కలిసి కొత్తగా ట్రై చేసిన ఈ పాట శ్రోతలకు కూడ కొత్త అనుభూతిని కలిగిస్తుందనడంలో సందేహం లేదు.

3. పాట : వచ్చాడయ్యో సామిVery Very Sad
గాయనీ గాయకులు : కైలాష్ ఖేర్, దివ్య కుమార్
సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి

తన ప్రతి సినిమాలోను తన హీరోపై ప్రత్యేకమైన పాట ఉండేలా చూసుకునే దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రంలో కూడ ‘వచ్చాడయ్యో సామి’ రూపంలో ఒక పాటను ఏర్పాటు చేసుకున్నారు. పాటలో హీరో గొప్పదనాన్ని, అతని మంచి పనుల్ని వివరిస్తూ రామ జోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, కైలాష్ ఖేర్, దివ్య కుమార్ పాడిన విధానం అన్నీ కలిసి ఈ పాట మాస్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Varam4. పాట : ఇదే కలలా ఉన్నదే
గాయనీ గాయకులు : ఆండ్రియా
సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి

‘అరెరె ఇది కలలా ఉన్నదే’ అంటూ మొదలయ్యే ఈ పాట కొంత రెగ్యులర్ గానే అనిపిస్తోంది. చాలా సినిమాల్లో రొమాంటిక్ సందర్భంలో హీరో హీరోయిన్ల మధ్యన వాడే పాటలానే ఉంది. అయినా పాట వినడానికి అంత గొప్పగా కాకపోయినా బాగానే ఉంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఎంటర్టైన్ చేయగా హీరోయిన్ ఆండ్రియా గాత్రం ఆకట్టుకుంది.

5. పాట : ఓ వసుమతి side
గాయనీ గాయకులు : యాజిన్ నిజర్, రిత
సాహిత్యం :రామ జోగయ్య శాస్త్రి

‘దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాల’ అంటూ రొమాంటిక్ నోట్ లో మొదలయ్యే ఈ పాట హీరో హీరోయిన్ ను ఇంప్రెస్ చేసే సమయంలో పాడే పాటలా ఉంది. ఈ పాటకు దేవీ శ్రీ ప్రసాద్ భిన్నమైన సంగీతాన్ని అందించారు. అలాగే రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ ఆకట్టుకోగా యాజిన్ నిజర్, రితల గాత్రం పాటను వినసొంపుగా మార్చింది. ఇక పాటలోని విజువల్స్ కూడ గొప్పగా ఉంటాయనిపిస్తోంది.

తీర్పు:

ఎన్నో రోజుల నుండి మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ‘భరత్ అనే నేను’ పాటల్లోని దేవి శ్రీ ప్రసాద్ భిన్నమైన సంగీతం, రామ జోగయ్య శాస్త్రి ప్రయోగాత్మకమైన ట్రెండీ సాహిత్యం కలిసి ఆడియోను ఆకట్టుకునేలా చేశాయి. ‘భరత్ అనే నేను, వచ్చాడయ్యో సామి, ఐ డోంట్ నో’ పాటలు అమితంగా అలరించగా ‘ఇదే కలలా ఉన్నదే, ఓ వసుమతి’ పాటలు ఆకట్టుకున్నాయి. మొత్తం మీద ఈ పాటలు అభిమానులు, ప్రేక్షకుల అంచనాలను అందుకున్నాయని చెప్పొచ్చు.

Click here for English Music Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు