సమీక్ష : భారీ తారాగణం – స్లోగా సాగే లవ్ డ్రామా !

సమీక్ష : భారీ తారాగణం – స్లోగా సాగే లవ్ డ్రామా !

Published on Jun 24, 2023 3:00 AM IST
Bhari Taraganam Movie Review In Telugu

విడుదల తేదీ : జూన్ 23, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: సదన్, దీపికా రెడ్డి, రేఖ నిరోష, తదితరులు

దర్శకుడు : శేఖర్‌ ముత్యాల

నిర్మాత: బి.వి.రెడ్డి

కెమెరా: ఎం.వి గోపి

సంగీతం: సుక్కు

నేపథ్య సంగీతం: సాహిత్య సాగర్‌

ఎడిటర్: మార్తండ్‌ కె. వెంకటేశ్‌

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

సదన్‌, దీపికా రెడ్డి, రేఖ నిరోషి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు శేఖర్‌ ముత్యాల దర్శకత్వం వహించగా బివిఆర్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై బి.వి రెడ్డి దీనిని నిర్మించారు. ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

రఘు (తోటమల్లి మధు) తన కూతురు ధనలక్ష్మి,(రేఖ నిరోషా)కి పెళ్లి చేయాలని ఎన్ని సంబంధాలు చూసినా ఆమె రిజెక్ట్ చేస్తుంది. మరోవైపు తార (దీపిక రెడ్డి)తో లవ్ లో ఫెయిల్ అయిన సదన్ (సదన్) తాగుతూ ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల అనంతరం సదన్‌ ను పెళ్లి చేసుకోవడానికి ధనలక్ష్మి ఒప్పుకుంటుంది. ఐతే, ఉన్నత చదువుల కోసం సదన్ సిటీకి వెళ్తాడు. ఇంతకీ, తార సదన్‌ కు ఎందుకు దూరంగా ఉంటుంది ? , మరో వైపు చిట్టెమ్మ (సరయు) కథ ఏమిటి ?, అలాగే తారతో కలిపి ఐదుగురు అమ్మాయిలకు హీరో ఎలాంటి సహాయం చేశాడు?, అసలు సదన్ కు ఈ ఐదుగురు అమ్మాయిలతో ఉన్న లింకేమిటి ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో హీరోగా నటించిన సదన్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కామెడీ సీన్స్ లో మరియు కొన్ని ఎమోషనల్ సీన్స్ లో సదన్ తన హావభావాలతో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ గా నటించిన రేఖ నిరోష తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. బోల్డ్ లుక్ లో కూడా ఆమె చాలా సహజంగా నటించింది. అలాగే మరో హీరోయిన్ దీపికా రెడ్డి కూడా చాలా బాగా నటించింది.

ప్రేమించిన అమ్మాయి కోసం సదన్ పడిన తపన, అలాగే తోటి ఆడవాళ్ళ బాధను అర్థం చేసుకునే క్రమంలో వచ్చే సీన్స్ బాగున్నాయి. ఇక ఇతర కీలక పాత్రల్లో నటించిన పోసాని, రఘు వంటి నటీనటులు కూడా తమ ఎక్స్ ప్రెషన్స్ తో, తమ శైలి మాడ్యులేషన్స్ తో నవ్వించే ప్రయత్నం చేశారు. అదే విధంగా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఓ సాంగ్ లో అలీ గెస్ట్ గా కనిపించి సర్ ప్రైజ్ ఇచ్చారు.

 

మైనస్ పాయింట్స్ :

ఆడవారు వారి వారి జీవితాల్లో ఎటువంటి ప్రాబ్లెమ్ తో ఇబ్బంది పడుతుంటారనే కోణంలో సాగే సీన్స్ ఆకట్టుకున్నా… తీసుకున్న గుడ్ పాయింట్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కూడా కథాకథనాలను రాసుకోలేదు. దీనికి తోడు భారీ తారాగణం సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు కూడా సినిమాటిక్ గా అనిపిస్తాయి తప్ప, ఇన్ వాల్వ్ అయ్యే విధంగా అనిపించవు. పైగా కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువవడంతో కథలో సహజత్వం లోపించింది. నిజానికి సినిమాలో దర్శకుడు శేఖర్‌ ముత్యాల చెప్పాలనుకున్న కథాంశం బాగుంది.

కథాంశం బాగున్నా ఓవరాల్ గా ఈ చిత్రం నెమ్మదిగా సాగుతుంది. కథ పరంగా ఇంటర్నల్ లింక్స్ తో సాగే స్క్రీన్ ప్లేలోని డెప్త్ అండ్ ఇంట్రెస్ట్ ను దర్శకుడు పట్టుకోలేకపోయాడు. ఇక సినిమాలో సెకండాఫ్ కూడా స్లోగా సాగింది. ప్రధానంగా కొన్ని సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయింది. కొన్ని చోట్ల క్యారెక్టర్స్ కొత్తగా అనిపించినా… కొన్ని సన్నివేశాలు రొటీన్ గానే సాగాయి. నిజానికి సినిమాలో బలమైన ఎమోషన్ ఉన్నా.. సరైన ట్రీట్మెంట్ లేకపోవడంతో ఆ ఎమోషన్ కొన్ని చోట్ల ఎలివేట్ కాలేదు.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం గురించి ముందు చెప్పుకున్నట్లుగా సినిమాలో సంగీత దర్శకుడు సుక్కు అందించిన పాటలు జస్ట్ ఓకే అనిపించాయి. ఇక ఎడిటర్ మార్తండ్‌ కె. వెంకటేశ్‌ ఎడిటింగ్ పర్వాలేదు. అలాగే దర్శకుడు శేఖర్‌ ముత్యాల సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ బాగుంది, కానీ స్క్రీన్ ప్లే చాలా స్లోగా సాగింది. సినిమాలోని నిర్మాత బి.వి.రెడ్డి పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.

 

తీర్పు :

‘భారీ తారాగణం’ అంటూ వచ్చిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సీన్స్, రొమాంటిక్ అండ్ ప్రేమ సన్నివేశాలు బాగానే ఉన్నాయి. కానీ, కథాకథనాలు ఆకట్టుకునే విధంగా లేకపోవడం, అలాగే లాజిక్ లెస్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే లవర్స్ కి కనెక్ట్ అవుతాయి.

 

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు