విడుదల తేదీ : మే 12, 2023
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు: సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, ధనరాజ్, గోపరాజు రమణ, వైవా హర్ష, సోనియా చౌదరి, స్నేహల్ కామత్, రాజ్ తిరందాసు, వాసంతి కృష్ణన్, సత్తిపండు
దర్శకులు : యలమంద చరణ్
నిర్మాతలు: ఉదయ్ కిరణ్, శ్రీకాంత్
సంగీతం: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ: సాయి
ఎడిటర్: చోటా కె. ప్రసాద్
సంబంధిత లింక్స్: ట్రైలర్
సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు యలమంద చరణ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా భువన విజయమ్. కాగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో సమీక్ష చూద్దాం…
కథ :
ఆటో డ్రైవర్ యాదగిరి(ధనరాజ్) చనిపోవడంతో అతని ఆత్మని తీసుకెళ్లడానికి ఇద్దరు యమదూతలు భూమ్మీదకు వస్తారు. అయితే, అంతలో మరికొద్ది గంటల్లో నిర్మాత చలపతి (గోపరాజు రమణ) ఆఫీస్ లో మరో వ్యక్తి కూడా చనిపోతాడు అని చిత్రగుప్తుని నుంచి ఆజ్ఞ వస్తోంది. మరోపక్క నిర్మాత చలపతి, ఫీలింగ్ స్టార్ ప్రీతమ్ కుమార్(సునీల్)తో మరో సినిమాని ప్లాన్ చేసే ఏర్పాట్లలో ఉంటాడు. దాంతో కథలు వినడానికి రచయితలను పిలుస్తారు. మొత్తం ఏడుగురు రైటర్స్ కథలు చెప్తారు. అయితే ఆ కథా రచయితలంతా అదే ఆఫీస్ లోని ఒక గదిలోకి ప్రవేశించి ఒక కథను ఫైనల్ చేయాలి. ఈ ఏడుగురు రైటర్స్ లో ఒకరు చనిపోతారని, ఆ ఆత్మని మనతో పాటు తీసుకెళ్ళాడనికి యమదూతలు రెడీ అవుతారు. ఇంతకీ చనిపోయే ఆ రెండో వ్యక్తి ఎవరు?, చివరకు ఈ కథ ఎలా ముగిసింది? అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్ :
శ్రీ కృష్ణదేవ రాయలు ఆస్థానం భువనవిజయంలో ఎనిమిది మంది కవులు ఉండేవారు. అలాగే ఈ ‘భువన విజయమ్’లో కూడా ఏడుగురు రచయితలు ఉన్నారు. వారి కథలు, వారంతా గేమ్ ఆడి.. తమలో ఒకరి కథను ఫైనల్ చేయడం, మధ్యలో డ్రైవర్ ఎమోషనల్ స్టోరీ, సెకండ్ హాఫ్ లో సునీల్ – ఆఫీస్ బాయ్ ట్రాక్.. ఇలా కొన్ని ఎలిమెంట్స్ పర్వాలేదు. ఇక కీలక పాత్రలో మతిస్థిమితం లేని స్టార్ హీరోగా నటించిన సునీల్ బాగా నటించాడు.
అలాగే మిగిలిన ప్రధాన పాత్రల్లో నటించిన శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, ధనరాజ్, గోపరాజు రమణ, వైవా హర్ష, సోనియా చౌదరి, స్నేహల్ కామత్ లు కూడా చాలా బాగా నటించారు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ తన నటనతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అలాగే ధనరాజ్, గోపరాజు రమణలు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజ్ తిరందాసు, వాసంతి కృష్ణన్, సత్తిపండులతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు.
మైనస్ పాయింట్స్ :
ఈ ‘భువన విజయం’లో మెయిన్ పాయింట్ బాగున్నా.. కథ వీక్ గా ఉంది. దీనికి తోడు స్క్రీన్ ప్లే పరంగా కూడా సినిమా ఆకట్టుకునే విధంగా సాగలేదు. ముఖ్యంగా కథకు అవసరం లేని సీన్స్ ఎక్కువైపోయాయి. పైగా ఆ సీన్స్ కూడా లాజిక్ లేకుండా సాగడం.. అలాగే కామెడీ కోసమని అనవసరమైన సీన్స్ ను ఇరికించడం కూడా సినిమాకి మైనస్ అయ్యింది. దీనికితోడు దర్శకుడు యలమంద చరణ్ తాను అనుకున్న కంటెంట్ ను కూడా స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేయలేకపోయారు.
సినిమాను ఇంట్రెస్టింగ్ ఎలెమెంట్స్ తో ఆసక్తికరంగా మలచలేకపోయారు. నిజానికి కంటెంట్ పరంగా మంచి ఎంటర్ టైన్మెంట్ మరియు ఫుల్ కామెడీని పండించే సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నా, యలమంద చరణ్ మాత్రం సినిమాని ఆ దిశగా నడిపలేకపోయారు. పైగా కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువవడంతో కథలో సహజత్వం లోపించింది. ఇక సినిమాలో చాలామంది కమెడియన్లు ఉండటంతో కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అయినా.. ఆ కామెడీ కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. దర్శకుడిగా యలమంద చరణ్ ఫెయిల్ అయ్యారు. కెమెరామెన్ గా చేసిన సాయి సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. కొన్ని సన్నివేశాల్లో సాయి పనితనం చాలా బాగుంది. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర అందించిన సంగీతం పర్వాలేదు. ఎడిటర్ వర్క్ సినిమాకి తగ్గట్లు ఉంది. సినిమాలోని నిర్మాతలు ఉదయ్ కిరణ్, శ్రీకాంత్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. .
తీర్పు :
మొత్తంమ్మీద, ఈ భువన విజయమ్ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు, మరియు అక్కడక్కడా సునీల్ – వెన్నెల కిషోర్ కామెడీ బాగున్నాయి. ఐతే, కథనం ఆసక్తి కరంగా సాగకపోవడం, సినిమాలో సరైన ప్లో మిస్ అవ్వడం, ఫస్ట్ హాఫ్ స్లోగా సాగుతూ బోర్ కొట్టించడం.. వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. అయితే చాలామంది స్టార్ కమెడియన్స్ తమ పాత్రల్లో ఒదిగిపోవడం ఆకట్టుకుంది. మొత్తమ్మీద ఈ సినిమాలో కొన్ని కామెడీ సీన్స్ మరియు కొన్ని ఎమోషన్స్ బాగున్నా.. సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team