సమీక్ష : “బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్” – జస్ట్ ఓకే రోమ్ కామ్ డ్రామా

సమీక్ష : “బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్” – జస్ట్ ఓకే రోమ్ కామ్ డ్రామా

Published on Oct 15, 2022 3:05 AM IST
Crazy-Fellow-Movie-Review-In-Telugu

విడుదల తేదీ : అక్టోబర్ 14, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: విశ్వంత్, మాళవిక సతీశన్, పూజా రామచంద్రన్, హర్షవర్ధన్, తదితరులు

దర్శకత్వం : సంతోష్ కంభంపాటి

నిర్మాతలు: కె నిరంజన్ రెడ్డి, వేణు మాధవ్ పెద్ది

సంగీతం: గోపీ సుందర్

సినిమాటోగ్రఫీ: బాల సరస్వతి

ఎడిటర్: విజయ్ వర్ధన్ కె

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

లేటెస్ట్ గా ఈ వారంలో థియేటర్స్ లోకి వచ్చిన తాజాగా చిత్రాల్లో యంగ్ హీరో విశ్వంత్, మాళవిక సతీషన్ అలాగే పూజా రామచంద్రన్ లు నటించిన యూత్ ఫుల్ చిత్రం “బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్” కూడా వచ్చింది. మరి ఈ చిత్రం అయితే ఎంతవరకు ఆకట్టుకుందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథ లోకి వస్తే.. అర్జున్(విశ్వంత్) అనే కుర్రాడు తనని తాను ఒక బాయ్ ఫ్రెండ్ లా అద్దెకు వెళ్తూ ఉంటాడు. తనని చూసి నచ్చి చాలా మంది అమ్మాయిలు కూడా బే ఫ్రెండ్ లా తనని బుక్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే నటాషా(పూజా రామచంద్రన్) అనే అమ్మాయి కూడా అతన్ని బుక్ చేసుకుని ఒక రోజు నైట్ బాయ్ ఫ్రెండ్ లా తీసుకుంటుంది. అయితే ఆ రోజు రాత్రి ఆమె అతనితో శారీరకంగా కలిసే ప్రయత్నం చేయగా అర్జున్ అందుకు నో చెప్తాడు. మరి తాను ఎందుకు ఆమెకి నో చెప్తాడు? అసలు తాను ఇలా బాయ్ ఫ్రెండ్ లా వెళ్తుండడానికి కారణం ఏంటి? తన స్టోరీ లోకి దివ్య(మాళవిక) అనే అమ్మాయికి ఉన్న సంబంధం ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని తెరపై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో మెయిన్ లీడ్ మధ్య కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ పై చూడ్డానికి బాగుంటుందని చెప్పొచ్చు. అలాగే ఇద్దరి మధ్య కొన్ని సన్నివేశాలు వారి మధ్య లవ్ ట్రాక్ వంటివి అయితే ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఇక నటీనటుల్లో హీరో విశ్వంత్ మంచి నటనను కనబరిచాడు. తన ఏజ్ కి తగ్గ రోల్స్ ని ఎంచుకుంటూ చేసిన ఈ రోల్ లో కూడా తాను డీసెంట్ లుక్స్ మరియు నటనతో ఆకట్టుకున్నాడు.

అలాగే నటి మాళవిక కూడా తన లుక్స్ సహా నటనతో మెప్పిస్తుంది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన బాగుంది. ఇంకా సినిమాలో మెయిన్ ప్లస్ సినిమా ఫస్టాప్ అని చెప్పాలి. మంచి ఎంగేజింగ్ నరేషన్ తో కనిపిస్తుంది. అలాగే పలు చోట్ల కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయ్యింది. ఇంకా సినిమా ముగింపు కూడా డీసెంట్ గా అనిపిస్తుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో ఆడియెన్స్ కి కాస్త అసంపూర్ణంగా అనిపించేది ఏదన్నా ఉంది అంటే అది హీరో రోల్ అని చెప్పాలి. చాలా వరకు తన రోల్ అనేది ఓ క్లారిటీ లేని పాత్రగా కనిపిస్తుంది. ఇంకా సినిమాలో చిన్న అంశం బాగానే అనిపించినా దానిని కొత్తగా నరేట్ చెయ్యడంలో అయితే వైఫల్యం కనిపిస్తుంది.

ఇంకా సినిమాకి సెకండాఫ్ బాగా ల్యాగ్ అనిపిస్తుంది. కొన్ని సీన్స్ తో ఓ సందర్భం అయిపోయినప్పటికీ ఇంకా దానికి అనవసర సన్నివేశాలు పెట్టి సినిమాపై ఆసక్తిని తగ్గిస్తారు. అలాగే సినిమాలో విలక్షణ నటుడు హర్షవర్ధన్ లాంటి వారిని కూడా పెట్టుకొని సరిగ్గా వినియోగించినట్టుగా అనిపించదు.

అలాగే కొన్ని ఇతర అంశాలు ఆశించే వారికి కూడా ఈ చిత్రం నిరాశ పరుస్తుంది. సెకండాఫ్ ని అయితే ఇంకా బెటర్ గా డిజైన్ చేసి ఉంటే మరింత బెటర్ ఫీలింగ్ సినిమా చూసే ఆడియెన్ కి కలిగి ఉండొచ్చు.

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే గోపి సందర్ సంగీతం పర్వాలేదు. అలాగే బాల సరస్వతి సినిమాటోగ్రఫీ బావుంది. ఇంకా డైలాగ్స్ కూడా బాగున్నాయి. అలాగే ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. కొన్ని సీన్స్ ని ట్రిమ్ చెయ్యాల్సి ఉంది.

ఇక దర్శకుడు సంతోష్ కంభంపాటి విషయానికి వస్తే తాను తన వర్క్ పర్వాలేదని చెప్పవచ్చు. కథలో పెద్దగా కొత్తదనం లేకపోయినా నరేషన్ పరంగా ఇంకా బెటర్ గా తాను తెరకెక్కించి ఉంటే సినిమా మరింత ఎంగేజింగ్ గా వచ్చి ఉండేది. ఫస్టాఫ్ వరకు ఓకే కానీ సెకండాఫ్ లో పలు సన్నివేశాల్లో మరింత కేర్ తీసుకోవాల్సి ఉంది.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్” అనే రోమ్ కామ్ డ్రామా లో నటీనటుల ప్రామిసింగ్ పెర్ఫామెన్స్ లు బాగుంటాయి. అలాగే అక్కడక్కడా కొన్ని అంశాలు పర్వాలేదనిపిస్తాయి కానీ సెకండాఫ్ లో నరేషన్ అంతగా మెప్పించదు. ఇది పక్కన పెడితే సినిమాలో కొన్ని అంశాలు మాత్రం ఆకట్టుకుంటాయి. వాటి కోసం అయితే స్ట్రిక్ట్ గా ఒక్కసారికి మాత్రం వారాంతంలో ట్రై చేయాలి అనుకుంటే చూడొచ్చు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు