సమీక్ష : “బుజ్జి ఇలా రా” – అక్కడక్కడా మెప్పించే థ్రిల్లర్

Bujji-Ila-Raa Movie Review

విడుదల తేదీ : సెప్టెంబర్ 02, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: సునీల్, ధనరాజ్, చాందిని తమిళరసన్, శ్రీకాంత్ అయ్యంగార్, తదితరులు

దర్శకత్వం : గరుడవేగ అంజి

నిర్మాతలు: అగ్రహారం నాగి రెడ్డి, ఎన్. సంజీవ రెడ్డి

సంగీత దర్శకుడు: సాయి కార్తీక్

సినిమాటోగ్రఫీ: గరుడవేగ అంజి

ఎడిటర్: ఛోటా కె. ప్రసాద్

లేటెస్ట్ గా థియేటర్స్ లోకి వచ్చిన చిత్రాల్లో “బుజ్జి ఇలా రా” కూడా ఒకటి. నటులు సునీల్ మరియు ధనరాజ్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ థ్రిల్లర్ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వస్తే.. వరంగల్ లో సీరియల్ గా కొన్ని షాకింగ్ మర్డర్ కిడ్నాప్ లు జరుగుతూ ఉంటాయి. అలా ఓ ఎనిమిదేళ్ల పాప కి సంబంధించిన కేసు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక పెద్ద తలనొప్పిగా మారుతుంది. అలాగే ఇంకో పక్క ఈ కిడ్నప్ మర్డర్ కాబడిన దేహాల్లో గుండె మిస్సవ్వడం అనేది మరింత మిస్టరీగా కనిపిస్తుంది. మరి ఈ కేసులో కేశవ(ధనరాజ్) అప్పుడే సీఐ అయ్యిన వెంటనే ఈ కేసు వస్తుంది. మరి తాను ఈ కేసును సాల్వ్ చేశాడా? ఇంతకీ ఈ దారుణాలు వెనుక ఉంది ఎవరు? ఈ చిత్రంలో ఖయ్యుమ్(సునీల్) కి ఉన్న పాత్ర ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ తరహా బ్యాక్ డ్రాప్ ఉన్న చిత్రాల్లో కొంతమందికి చిన్న సినిమాలు పట్ల ఎక్కడో నెగిటివ్ థింకింగ్ ఉండొచ్చు కానీ ఈ సినిమా మాత్రం అలాంటి వారికీ మంచి ఆన్సర్ అని చెప్పొచ్చు. థ్రిల్లింగ్ అంశాలు అలాగే సినిమాలో నోవాల్టీ ఆకట్టుకుంటుంది. అలాగే పలు సీన్స్ లో డీటెయిల్స్ మరియు విజువల్స్ ఆకట్టుకుంటాయి. ఇక అలాగే మెయిన్ కాస్ట్ లో కనిపించిన సునీల్ ధనరాజ్ లు నుంచి మంచి పెర్ఫామెన్స్ ని మనం చూస్తాం. సునీల్ ని ఇది వరకు ఇలాంటి సీరియస్ రోల్స్ లో చూసాం అలాగే ఈ సినిమాలో పాత్రకి కూడ తాను సంపూర్ణ న్యాయం చేకూర్చాడు.

కానీ ధనరాజ్ నుంచి నటుడుగా చాలా వరకు కమెడియన్ గానే తెలుసు కానీ.. ఈ సినిమాలో తాను మంచి రోల్ మంచి నటనతో ఇంప్రెస్ చేస్తాడు. ఇక చెప్పుకోవాల్సిన మరో ఆర్టిస్ట్ చాందిని తమిళసారన్ తన పాత్రలో డెఫినిట్ గా ఆశ్చర్యపరుస్తుంది. తన ఎమోషన్స్ కానీ ఇంటెన్స్ నటన కానీ థ్రిల్ చేస్తాయి. ఇంకా సెకండాఫ్ లో కనిపించే కొన్ని అంశాలు ట్విస్ట్ లు ఆకట్టుకుంటాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో కొన్ని డ్రా బ్యాక్ లు అయితే బాగున్నా అంశాలపై గట్టి ప్రభావం చూపిస్తాయి. చాలా వరకు సీన్స్ చాలా పేలవంగా కనిపిస్తాయి. అలాగే సినిమా మెయిన్ పాయింట్ లోకి తీసుకెళ్ళేవరకు బోర్ ఫీల్ ఆడియెన్స్ కి తప్పదు. ఇంకా కొన్ని సీన్స్ లో నాటకీయతగా బాగా ఎక్కువగా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాయి.

వాటితో పాటుగా సినిమాలో చూపించే వైలెన్స్ కూడా కాస్త ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది అందరికీ అంత నచ్చకపోవచ్చు. ఇంకా కొందరు ఆర్టిస్ట్స్ విషయంలో మేకర్స్ బాగా జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. ఇంకా కొన్ని సీన్స్ లో అయితే లాజిక్స్ కొన్ని పాత్రలు పేలవంగా కనిపిస్తాయి.

 

సాంకేతిక వర్గం :

 

సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు ఇంకా కొన్ని సీన్స్ లో చెయ్యాల్సింది. అలాగే టెక్నీకల్ విభాగంలో సాయి కార్తీక్ సంగీతం ఇంప్రెస్ చేస్తుంది. చాలా సన్నివేశాల్లో తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలివేట్ చేస్తుంది. అంజి సినిమాటోగ్రఫీ జస్ట్ యావరేజ్ గా ఉంది. డైలాగ్స్, ఎడిటింగ్ పర్వాలేదు.

ఇక దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి విషయానికి వస్తే తాను కథ, పలు చోట్ల పరంగా మెప్పిస్తాడు. కానీ పూర్తి స్థాయిలో సినిమాకి జాగ్రత్తలు తాను తీసుకోలేదు. మెయిన్ కాస్ట్ మినహా ఇతర నటీనటుల్లో లోపాలు బాగా కనిపిస్తాయి. అలాగే ఫస్టాఫ్ లో మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమాకి మంచి బూస్టప్ లా ఉండేది.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “బుజ్జి ఇలా రా” చిత్రం ఒక డీసెంట్ సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. నటీనటుల ఫైనెస్ట్ పెర్ఫామెన్స్ లు అలాగే పలు చోట్ల థ్రిల్ చేసే అంశాలు ఆకట్టుకుంటాయి. అయితే ఫస్ట్ హాఫ్ లో నెమ్మదిగా సాగడం కొన్ని సీన్స్ లో పట్టు లేకపోవడం పేలమైన ఇతర కాస్టింగ్ వంటివి మాత్రం ఆడియెన్స్ లో ఆసక్తిని తగ్గిస్తాయి. వీటిని పక్కన పెట్టి ఒక థ్రిల్లర్ చూడాలి అనుకుంటే ఒకసారి ఈ చిత్రం మొస్తరుగా పర్వాలేదు అనిపిస్తుంది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version