విడుదల తేది :13 జనవరి 2012 |
123తెలుగు.కాం రేటింగ్: 3.5/5 |
దర్శకుడు : పూరి జగన్నాధ్ |
నిర్మాత : వెంకట్ |
సంగిత డైరెక్టర్ : తమన్ .ఎస్ |
తారాగణం : మహేష్ బాబు , కాజల్ , నాజర్ ,ప్రకాష్ రాజ్ |
ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘బిజినెస్ మేన్’ చిత్రం భారీ అంచనాల మధ్య ఈ రోజే విడుదలైంది. పోకిరి హిట్ కాంబినేషన్ మహేష్ మరియు పూరి జగన్నాధ్ కలిసి మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కాజల్ హీరోయిన్ గా నటించగా ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.
కథ:
సూర్య (మహేష్ బాబు) తెలివైన మరియు తనకంటూ ఒక లక్ష్యం కలిగిన యువకుడు. అతను ముంబైలో అడుగుపెట్టి పవర్ఫుల్ ముంబై మాఫియా కి భాయ్ గా ఎధగాలనుకుంటాడు. అతను ముంబై పోలీసు కమీషనర్ భరద్వాజ్ (నాజర్) ని కలిసినపుడు ఈ విషయం చెప్తాడు. కొన్ని సంఘటనల తరువాత లోకల్ పొలిటీషియన్ లాలూ (షాయాజీ షిండే) సూర్యని కలిసి తనని గెలిపించామని కోరతాడు. తను గెలిపిస్తే ఇండియాలో పెద్ద డాన్ చేస్తా అంటాడు. అదే సమయంలో చిత్ర (కాజల్) భరద్వాజ కూతురిని ప్రేమిస్తాడు. సూర్య వ్యతిరేక వర్గ రాజకీయ నాయకుడు ప్రకాష్ రాజ్ కి వ్యతిరేకంగా పనిచేస్తాడు. సూర్య కి గతంలో ప్రకాష్ రాజ్ తో సంబంధం ఉంటుంది. ఏంటి ఆ సంబంధం అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్:
మహేష్ బాబు సూర్య పాత్రలో ఒదిగిపోయాడు. అతని డైలాగ్ డెలివరీ మరియు ఎక్స్ప్రెషన్స్ అధ్బుతం. అతను తన వ్యతిరేక గ్యాంగ్ ‘ధమ్కి’ ఇచ్చే సన్నివేశాల్లో చాలా బాగా చేసాడు. తన అందం మరియు ట్రేడ్ మార్క్ నటన తో ప్రేక్షకులను అలరించాడు. సినిమా మొత్తం తానై నడిపించాడు. కాజల్ అగర్వాల్ చాలా బావుంది. మహేష్ తో రొమాంటిక్ సన్నివేశాలలో బాగా నటించింది. కాని తనకి పెద్దగా పాత్ర లేకపోవడం బాధాకరం. పూరీ జగన్నాధ్ తెర వెనుక హీరో. అతను రాసిన డైలాగులు ఈ మధ్య కాలంలో ది బెస్ట్ అని చెప్పుకోవాలి. ప్రతి డైలాగు మశేష్ బాబు చెబుతుంటే బుల్లెట్ లా దూసుకుపోయాయి. సినిమాలో బోర్ కొట్టే సన్నివేశాలు లేకపోవడం విశేషం. అన్ని పాటలు బాగా చిత్రీకరించారు. సారోస్తారా మరియు చందమ పాటలు ఇంకా బాగా చిత్రీకరించారు. కాజల్ తో ముద్దు సన్నివేశం కూడా బాగా చిత్రీకరించారు. శ్వేత భరద్వాజ్ ఐటెం సాంగ్ లో ప్రేక్షకులను అలరిస్తుంది. ఆమెకు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు రావొచ్చు. ప్రకాష్ రాజ్ మరియు షాయాజీ షిండే పర్వాలేదనిపించారు.
మైనస్ పాయింట్స్:
కొన్ని అంశాలు లాజిక్ కి అందకుండా ఉన్నాయి. బ్యాంకు దొంగతనం చేసే సన్నివేశం పాత చింతకాయ పచ్చడిలా ఉంది. పతాక సన్నివేశాలు ఇంకా బాగా తీసి ఉంటే బావుండేది. ఎలక్షన్ సన్నివేశాలు కూడా బాగా తీసి ఉంటే ఇంకా బావుండేది. కాజల్ మహేష్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు పోకిరి సన్నివేశాల్ని గుర్తు తెస్తాయి. కాజల్ స్నేహితురాలు తెలుగులో మాట్లాడి చిరాకు తెప్పిస్తుంది.
సాంకేతిక విభాగం:
డైలాగ్స్ డైలాగ్స్ డైలాగ్స్ సినిమాకి మెయిన్ ప్లస్ డైలాగ్స్. టైమింగ్ మరియు పంచ్ బాగా కలిసి వచ్చాయి. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఎడిటింగ్ కూడా బావుంది. ఫైట్స్ మరియు పాటలు కూడా చాలా బాగా తీసారు. స్క్రీన్ప్లే ఎంటర్టైన్ చేస్తూ వేగంగా సాగుతుంది.
తీర్పు:
బిజినెస్ మేన్ మహేష్ బాబు ఒన్ మాన్ షో. మహేష్ తనదైన శైలి నటన పూరీ మార్కు అధ్బుతమైన డైలాగులతో అలరిస్తుంది. కొన్ని లాజిక్ అందని అంశాలు ఉన్నప్పటికీ ఎంటర్టైన్ చేసే అంశాలు ఎక్కువ ఉన్నాయి. మీ స్నేహితులతో కలిసి ఈ వారాంతంలో చూసి ఎంజాయ్ చేయండి.
అశోక్ రెడ్డి. ఎమ్
123తెలుగు.కాం రేటింగ్: 3.5/5