ఓటిటి సమీక్ష : “కడవర్” – తెలుగు చిత్రం డిస్నీ+ హాట్ స్టార్ లో

ఓటిటి సమీక్ష : “కడవర్” – తెలుగు చిత్రం డిస్నీ+ హాట్ స్టార్ లో

Published on Aug 18, 2022 3:01 AM IST
 Cadaver  Movie Review

విడుదల తేదీ : ఆగష్టు 12, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: అమలా పాల్, అదిత్ అరుణ్, అతుల్య రవి, హరీష్ ఉత్తమన్

దర్శకత్వం : అనూప్ ఎస్ పనికర్

నిర్మాత: అమలా పాల్

సంగీత దర్శకుడు: రంజిన్ రాజ్

సినిమాటోగ్రఫీ: అరవింద్ సింగ్

ఎడిటర్: శాన్ లోకేష్

 

ఇప్పటికీ కూడా పలు సినిమాలు నేరుగా ఓటిటిలో రిలీజ్ అవుతూ వస్తున్నాయి. అలా లేటెస్ట్ గా ప్రముఖ హీరోయిన్ అమలా పాల్ నటించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం “కడవర్” ప్రముఖ ఓటిటి యాప్ డిస్నీ+ హాట్ స్టార్ లో రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

ఇక కథలోకి వచ్చినట్టు అయితే..భద్ర(అమలా పాల్) ఒక ప్రముఖ పాథాలజిస్ట్.. అయితే ఎన్నో మిస్టరీగా ఉండే ఇంట్రెస్టింగ్ కేసుల్ని ఆమె చాలా తెలివిగా సాల్వ్ చేస్తూ ఉంటుంది. దీనితో పోలీసులు నుంచి కూడా పలు కేసులు ఈమెకి వాస్తు ఉంటాయి. అయితే ఓరోజు అనుకోని రీతిలో ఓ ప్రముఖ సర్జన్ సలీమ్ రెహమాన్(రవి ప్రకాష్) మరణానికి సంబంధించిన మిస్టరీ కేసు ఆమె దగ్గరకి వస్తుంది.. అయితే అతన్ని చంపుతానని చెప్పిన వాసు(ఆదిత్ అరుణ్) ఆల్రెడీ జైల్లో ఖైదీగా ఉంటాడు. తాను జైల్లో ఉండగానే ఈ మర్డర్ తో పాటుగా సీరియల్ గా మరిన్ని మర్డర్స్ జరుగుతూ ఉండడం అందరికీ షాకింగ్ గా మారుతుంది. మరి ఇలాంటి ఓ ఛాలెంజింగ్ కేసుని భద్ర ఛేదిస్తుందా? ఇంతకీ మర్డర్స్ చేస్తుంది ఎవరు? ఎలా చేస్తున్నారు అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

జెనరల్ గా ఈ తరహా చిత్రాల్లో ఎక్కువగా ఆడియెన్స్ ఎప్పుడు మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కోసమే చూస్తుంటారు. అలా వారిని ఆకట్టుకునే విధంగా సినిమా నడిస్తేనే మరింత మైలేజ్ వస్తుంది. అయితే ఈ తరహా ట్రీట్మెంట్ ఈ చిత్రంలో బాగా కనిపిస్తుందని చెప్పాలి.

చాలా సన్నివేశాలు మంచి ఆసక్తికరంగా సస్పెన్స్ గా కొనసాగుతూ ఆసక్తి రేకెత్తిస్తాయి. ఇక హీరోయిన్ మెయిన్ లీడ్ అమలా పాల్ తన రోల్ కి కంప్లీట్ జస్టిస్ చేసింది. చాలా సెటిల్డ్ పెర్ఫామెన్స్ తో క్లీన్ గా ఇంటెన్స్ పెర్ఫామెన్స్ తో తన రోల్ ని చేసుకుంటూ వెళ్ళిపోయింది.

అలాగే ఈ చిత్రంలో రివీల్ అయ్యే ట్విస్ట్ కూడా చాలా థ్రిల్ చేస్తుంది. ఇంకా నాలుగేళ్లుగా పాడవ్వకుండా ఓ శవం కనిపించడం దానిపై సన్నివేశాలు మంచి థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి. ఇక అమలా పాల్ తో పాటు ఇతర నటీనటులు అతుల్య రవి, హరీష్ ఉత్తమన్, ఆదిత్ అరుణ్ తదితరులు తమ రోల్స్ కి పూర్తి న్యాయం చేకూరుస్తారు.

 

మైనస్ పాయింట్స్ :

ఈ తరహా చిత్రాల్లో మంచి కథనం చాలా కీలకం. థ్రిల్ చేసే అంశాలతో నరేషన్ కూడా మంచి గ్రిప్పింగ్ గా ఎప్పటికప్పుడు ఆకట్టుకునేలా ఉంటే సక్సెస్ నుంచి ఎవరూ ఆపలేరు కానీ ఈ చిత్రంలో అక్కడక్కడా కొన్ని సీన్స్ బాగుంటాయి కానీ మిగతా సందర్భాల్లో సినిమా చాలా స్లో గా సాగుతున్నట్టు అనిపిస్తుంది.

స్టార్టింగ్ లోనే మంచి థ్రిల్లింగ్ గా సాగినా తర్వాత సినిమా మాత్రం నెమ్మదించి ఆసక్తి తగ్గిస్తుంది. అలాగే మరో పెద్ద డ్రా బ్యాక్ ఏదన్నా ఉంది అంటే నరేషన్ లో చాలా వరకు సన్నివేశాలు ముందే అంచనా వేసే విధంగా ఉంటాయి. దీనితో అయితే కొంతమేర ఆసక్తి తగ్గొచ్చు.

ఇంకా పలు మెయిన్ పాత్రలకు సంబంధించి కూడా డీటెయిల్స్ బాగా మిస్సవుతాయి. వాటిని కాస్త మెరుగ్గా డిజైన్ చేసి ఉండాల్సింది. అలాగే సినిమాలో చూపించే కొన్ని ఇతర స్టోరీ లైన్స్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది.

 

సాంకేతిక వర్గం :

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు టెక్నీకల్ టీం లో అయితే మ్యూజిక్ వర్క్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ ఇంప్రెస్ చేస్తుంది. అలాగే తెలుగు డబ్ మిక్సింగ్ కూడా బాగుంది. ఎడిటింగ్ మాత్రం చాలా చోట్ల బెటర్ గా చేయాల్సింది. ఇక దర్శకుడు అనూప్ పానికెర్ విషయానికి వస్తే కొన్ని చోట్ల ఆకట్టుకున్నా అదే విధంగా కొన్ని చోట్ల బాగా తడబడ్డారని చెప్పాలి. బాలెన్స్డ్ నరేషన్ బాగా మిస్సయ్యింది. పలు సీన్స్ మంచి ఆసక్తిగా రాసుకున్నా కొన్ని సీన్స్ మాత్రం బాగా రొటీన్ గా చూపించేసారు. దీనితో ఓవరాల్ గా సినిమాపై అయితే ఆ ప్రభావం పడింది. వీటితో అయితే తన వర్క్ మాత్రం అంతగా మెప్పించదు.

 

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “కడవర్” లో అమలా పాల్ నటన అక్కడక్కడా బాగా థ్రిల్ చేసే ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. కానీ సినిమా మొత్తంలో ఇలాంటి ఎలిమెంట్స్ ని దర్శకుడు చొప్పించలేకపోయాడు. దీనితో అయితే పూర్తి స్థాయి థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్ ని అయితే ఈ చిత్రం అందించలేదు. కానీ కొన్ని థ్రిల్లింగ్ అంశాలు కోసం అయితే ఒకసారి స్లో సీన్స్ లో స్కిప్ చేస్తూ చూడొచ్చు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు