సమీక్ష : “కాలింగ్ సహస్ర” – బోరింగ్ థ్రిల్లర్

సమీక్ష : “కాలింగ్ సహస్ర” – బోరింగ్ థ్రిల్లర్

Published on Dec 2, 2023 9:40 AM IST
Calling Sahasra Movie Review in Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 01, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: సుడిగాలి సుధీర్, డాలీషా, స్పందన పల్లి, శివబాలాజీ తదితరులు

దర్శకుడు : అరుణ్ విక్కిరాల

నిర్మాణం: షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్

సంగీతం: మోహిత్ రహ్మానిక్, మార్క్ కె రాబిన్(బ్యాక్గ్రౌండ్ స్కోర్)

సినిమాటోగ్రఫీ: డి శశి కిరణ్

ఎడిటర్: గ్యారీ బి హెచ్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

స్మాల్ స్క్రీన్ సెన్సేషనల్ సుడిగాలి సుధీర్ హీరోగా మారాక వచ్చిన మరో లేటెస్ట్ చిత్రం “కాలింగ్ సహస్ర” కూడా ఒకటి. ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ గా ప్లాన్ చేసిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

ఇక కథలోకి వస్తే..సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఓ యాప్ డెవలెప్మెంట్ పై అజయ్ శ్రీవాస్తవ్(సుధీర్ ఆనంద్) హైదరాబాద్ కి వస్తాడు. ఈ క్రమంలో తన కజిన్ ఇంటికి వచ్చిన స్వాతి(డాలీషా) అజయ్ ని ఇష్టపడుతుంది. అయితే అజయ్ తాను ఒక కొత్త నెంబర్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ నెంబర్ తీసుకున్నాక తనకి కొన్ని అనుమానాస్పద కాల్స్ వస్తూ ఉంటాయి. అలాగే స్వాతి అజయ్ లు దగ్గరయ్యే సమయంలో కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. మరో పక్క లూసిఫర్ యాప్ అనే ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ రాకెట్ కొందరు అమాయకులని కిడ్నాప్ చేసి హింసిస్తూ ఉంటారు. మరి ఆ లూసిఫర్ ఏంటి? దాని వెనుక ఉన్నది ఎవరు అజయ్ కి సహస్ర పేరిట కాల్స్ ఎందుకు వస్తున్నాయి? వీరందరికీ అలాగే ఆ లూసిఫర్ నుంచి తప్పించుకున్న శివ(శివబాలాజీ) కి అంతర్గతంగా ఏమన్నా కనెక్షన్ ఉందా ఉంటే చివరికి ఏమైంది అనేది అసలు కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో ఒకానొక చోట కాన్సెప్ట్ ఓకే అనిపిస్తుంది. ఈ రకమైన ట్రాఫికింగ్ చేసి కొందరు సైకోలు ఇలాంటివి కూడా చేస్తారా అనేది కొత్తగా ఉంటుంది. ఇక హీరోగా సుధీర్ డీసెంట్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటాడు. కొన్ని ఎమోషన్స్ ని తాను బాగా చేసాడు. ఇంకా డాలీషాతో తనకి సీన్స్ బాగున్నాయి.

అలాగే ఇద్దరి కెమిస్ట్రీ కూడా బాగుంది. ఆమె కూడా నీట్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఇక నటుడు శివ బాలాజీ ఈ సినిమాలో ఇంప్రెస్ చేస్తాడు. తన నటన తనపై ట్విస్ట్ డీసెంట్ గా ఉంటాయి. అలాగే కొన్ని అంశాల్లో దర్శకుడు ఇచ్చిన చిన్న కనెక్షన్ లు ఓకే అనిపిస్తాయి.

 

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో బాగా డిజప్పాయింట్ చేసే అంశాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి. స్టార్టింగ్ లో కాన్సెప్ట్ బాగానే అనిపించినా తరువాత తరువాత మాత్రం ఒక బోరింగ్ స్క్రీన్ ప్లే తో సినిమా నడుస్తుంది. ఇంటర్వెల్ వరకు కూడా కథనం సో సో గానే సాగుతుంది. అలాగే చాలా సీన్స్ ఓవర్ డ్రమాటిక్ గా అనిపిస్తాయి. వీటితో చూసే ఆడియెన్స్ కి అసలు ఒక నాచురల్ నరేషన్ ని చూస్తున్నట్టుగా అనిపించదు.

అలాగే కథనం కూడా హారర్ ఎలిమెంట్స్ కూడా చాలా బోర్ కొట్టిస్తాయి. ఆల్రెడీ కొన్ని థ్రిల్లర్స్ లో చూసిన విధంగానే ఈ చిత్రంలో కూడా కథనం నడుస్తుంది. అలాగే సహస్ర పాత్రలో కనిపించిన నటి స్పందన పాత్ర కూడా అంత ఇంపాక్ట్ కలిగించదు. అలాగే ఆమె పెర్ఫామెన్స్ కూడా అంతగా బాగాలేదు.

ఇక సుధీర్ కూడా ఇలాంటి డ్రమాటిక్ యాక్షన్ లాంటి వాటి నుంచి బయటకి రావాల్సి ఉంది. ఎమోషన్స్ లో బాగానే ఉన్నా యాక్షన్ ఎపిసోడ్స్ లో మాత్రం తాను మరింత నాచురల్ గా మరింత బెటర్ పెర్ఫామెన్స్ అందిస్తే తనకోసం వచ్చే వారిని మరింత ఎంటర్టైన్ చేస్తాడు.

అలాగే తన నుంచి కామెడీ లాంటివి ఆశించి చూసేవారికి కూడా ఇది డిజప్పాయింట్ చేస్తుంది. వీటితో పాటుగా అసలు సినిమాలో మిక్స్ చేసిన హారర్ ఎలిమెంట్ లాజిక్ లెస్ అని చెప్పాలి. ఒక దయ్యం సెల్ ఫోన్ ని ఆపరేట్ చేయడం లాస్ట్ లో దానంత అదే బ్లాస్ట్ అయిపోవడం లాంటివి బాగా సిల్లీగా ఉంటాయి.

 

సాంకేతిక వర్గం :

సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు. టెక్నీకల్ టీంలో మోహిత్ రహ్మానిక్ సాంగ్స్ బాగున్నాయి. ఫస్టాఫ్ లో ఓ సాంగ్ ఆకట్టుకుంటుంది. అలాగే మార్క్ కె రాబిన్ మ్యూజిక్ పర్వాలేదు. అలాగే సినిమాటోగ్రఫీ ఓకే, ఇంకా గ్యారీ బి హెచ్ ఎడిటింగ్ కొంతవరకు ఓకే కానీ కొన్ని సీన్స్ ని కట్ చేయాల్సింది.

ఇక దర్శకుడు అరుణ్ విక్కిరాల విషయానికి వస్తే..తాను ఈ చిత్రానికి బోరింగ్ వర్క్ అందించాడు అని చెప్పాలి. ఓకే ఎవరికీ తెలియని ఓ కాన్సెప్ట్ ని చూపించే ప్రయత్నం చేసాడు కానీ అందులో చాలా లాజిక్ లు వదిలేసి ఆల్రెడీ చూసిన థ్రిల్లర్ నరేషన్ నే చూపించాడు. అలాగే నటీనటుల నుంచి మరింత బెటర్ పెర్ఫామెన్స్ ని తాను రాబట్టాల్సింది. ఇంట్రెస్టింగ్ గా సుధీర్, సహస్ర పాత్రధారిణి విషయంలో బాగా డిజప్పాయింట్ చేస్తాడు. కొన్ని కనెక్షన్స్ ఎమోషన్స్ బాగానే రాసుకున్నారు కానీ మిగతా సినిమా అంతా చాలా బోర్ గా ఓవర్ డ్రమాటిక్ గా తాను తెరకెక్కించారు.

 

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టుగా అయితే ఈ “కాలింగ్ సహస్ర” ఒక బోరింగ్ థ్రిలర్ అని చెప్పాలి. సుధీర్ కొంతవరకు ఓకే అనిపిస్తాడు అలాగే డాలీసాతో కొన్ని సీన్స్ బాగున్నాయి. కానీ సినిమాలో బలహీనమైన కథనం బాగా దెబ్బ తీసింది. ఒక బోరింగ్ స్క్రీన్ ప్లే ఆకట్టుకోని సిల్లీ థ్రిల్ ఎలిమెంట్స్ ఏమాత్రం మెప్పించవు. ఎంత సుధీర్ ఫ్యాన్స్ అయినా ఈ సినిమాని ఎంజాయ్ చేయలేరు. వీటితో ఈ వారాంతానికి ఈ చిత్రాన్ని స్కిప్ చేసేయడమే బెటర్.

 

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు