సమీక్ష : చంద్రముఖి-2 – కొన్నిచోట్ల మెప్పించే హారర్ థ్రిల్లర్ !

సమీక్ష : చంద్రముఖి-2 – కొన్నిచోట్ల మెప్పించే హారర్ థ్రిల్లర్ !

Published on Sep 29, 2023 3:01 AM IST
Chandramukhi 2 Review in Telugu

విడుదల తేదీ :సెప్టెంబర్ 28, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: రాఘవ లారెన్స్‌, కంగనా రనౌత్, వడివేలు, లక్ష్మీ మీనన్‌, మహిమా నంబియార్, రావు రమేష్ తదితరులు.

దర్శకుడు : పి. వాసు

నిర్మాత: సుభాస్కరన్‌

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సినిమాటోగ్రఫీ: ఆర్.డి.రాజశేఖర్

ఎడిటర్: ఆంథోనీ

సంబంధిత లింక్స్: ట్రైలర్

రాఘవ లారెన్స్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్​ లీడ్​ రోల్​లో తెరకెక్కిన సినిమా ‘చంద్రముఖి-2’. ప్రముఖ దర్శకుడు పి. వాసు ఈ సినిమాను తెరకెక్కించారు. నిర్మాత సుభాస్కరణ్ ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్​ బ్యానర్​పై రూపొందించారు. మరి ఈ సీక్వెల్ తో రాఘవ లారెన్స్ హిట్ కొట్టాడా ? లేదా ? అన్నది సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

 

కథ :

మధన్ (రాఘవ లారెన్స్) ఇద్దరి పిల్లలకు గార్డియన్. ఐతే, ఆ పిల్లలతో కలిసి మధన్ వేటయ్య కోటకు రాధిక ఫ్యామిలీతో రావాల్సి వస్తోంది. ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఆ కోటలో దెయ్యంగా ఉన్న చంద్రముఖి (కంగనా రనౌత్) రాధిక కూతురు దివ్య (లక్ష్మీ మీనన్‌) లోకి ప్రవేశిస్తుంది. అలాగే మరోవైపు వేటయ్య అలియాస్ సింగోటయ్య (రాఘవ లారెన్స్) ఆత్మ మధన్ మీదకు ఆవహిస్తోంది. ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఏమిటి ?, ఇంతకీ చంద్రముఖి వేటయ్య మీద తన పగను ఎలా తీర్చుకుంది ?, చివరికీ దివ్యని చంద్రముఖి వదిలి పెట్టిందా ? లేదా ?, ఫైనల్ గా మధన్, రాధిక ఫ్యామిలీని ఎలా సేవ్ చేశాడు ? లాంటి విషయాలు తెలియాలంటే వెండి తెర పై ఈ సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్. :

మొత్తానికి భయంతో కూడుకున్న కామెడీనే సక్సెస్ ఫార్మాట్ గా తీసుకోని దర్శకుడు పి. వాసు చంద్రముఖి కి సీక్వెల్ గా ఈ సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఇక ఈ జోనర్ లో సినిమా అంటేనే.. కామెడీ, భయం లాంటి అంశాలతో అల్లుకొని రాసుకున్న సీన్స్ తోనే ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమా కూడా అలాగే సాగింది. ముఖ్యంగా లారెన్స్ ఇటు ఎంటర్టైన్మెంట్ తో పాటు అటు భయాన్ని, ఎమోషన్ని కూడా బాగానే పండించాడు. ఇక నటీనటుల పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే.. ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ రాఘవ లారెన్స్ నటనే హైలైట్ గా నిలుస్తోంది.

కంగనా రనౌత్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా కంగనా కొన్ని హర్రర్ సన్నివేశాల్లో తన నటనతో మెప్పించింది. ‌ఇక ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించిన లక్ష్మీ మీనన్‌, మహిమా నంబియార్, రావు రమేష్ తమ నటనతో ఆకట్టుకున్నారు. అలాగే తల్లి పాత్రలో నటించిన రాధిక కూడా ఎప్పటిలాగే తనదైన శైలిలో అద్భుతంగా నటించింది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేసారు. దర్శకుడిగా పి వాసు హర్రర్ అండ్ కామెడీ కాంబినేషన్ లో వచ్చే కొన్ని సీన్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు.

 

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు పి. వాసు తెరకెక్కించిన కొన్ని హర్రర్ అండ్ కామెడీ సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ.. కథనంలో కొన్ని సీక్వెన్స్ లో ఫ్లో మిస్ అయింది. ఏ సీన్ కి ఆ సీన్ బాగుందనిపించినా, ఓవరాల్ గా కథలో మిళితమయ్యి ఉండవు. ఇకపోతే కథనం మరియు నేరేషన్ లో ఇంతకు ముందు వచ్చిన చంద్రముఖి పార్ట్ 1లో ఫాలో అయిన స్క్రీన్ ప్లే ఫార్మాట్ నే ఈ రెండో పార్ట్ లో కూడా ఫాలో అయ్యారు. దాంతో కొన్ని సీన్స్ ఇంతకు ముందు చూసినవే కదా అన్న ఫీలింగ్ కలుగుతుంది.

పైగా కొన్ని కామెడీ సీన్స్ కోసమని సినిమా లెంగ్త్ ని పెంచేయడం సినిమాకి మరో మైనస్ పాయింట్. సెకండాఫ్ మొదలైన 10 నిమిషాల తర్వాత గాని ఆడియన్ అసలు కథలోకి వెళ్ళడు. దీనికి తోడు అక్కడక్కడ తమిళ్ నేటివిటీ సినిమాలో ఎక్కువుగా కనిపిస్తోంది. అలాగే వడివేలు కామెడీ కూడా బాగా విసిగించింది. అసలు అనవసరమైన వర్కౌట్ కానీ కామెడీ ట్రాక్స్ ను తీసేసి ఉంటే.. సినిమాకు బాగా ప్లస్ అయ్యేది. ఓవరాల్ గా హర్రర్ సీన్స్, సెకండ్ హాఫ్ లో ప్లాష్ బ్యాగ్ ఎలిమెంట్స్ బాగున్నా.. మిగతా కంటెంట్ అంతా తేలిపోయింది.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది దర్శకుడు పి. వాసు దర్శకత్వ పనితనం గురించే.. కొన్ని విసిగించే సీన్స్ ను కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక సినిమాటోగ్రఫీ ఈ హర్రర్ కామెడీ సినిమాకి బాగా సెట్ అయ్యింది. అలాగే సినిమాలో చేసిన గ్రాఫిక్స్ కూడా బాగానే ఉన్నాయి. ఎం. ఎం. కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ పరంగా కొంచెం స్లోగా సాగిన, సెకెండ్ హాఫ్ ను కట్ చేసిన విధానం బాగుంది. నిర్మాత సుభాస్కరన్‌ నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

తీర్పు :

‘చంద్రముఖి 2’ అంటూ వచ్చిన ఈ హారర్ రివెంజ్ డ్రామా.. కొన్ని హారర్ ఎలిమెంట్స్ తో పాటు కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ తో కొన్ని చోట్ల బాగానే ఆకట్టుకుంది. లారెన్స్ – కంగనా రనౌత్ తమ నటనతో సినిమా స్థాయిని పెంచే ప్రయత్నం చేశారు. కాకపోతే వర్కౌట్ కానీ కామెడీ ట్రాక్స్, అండ్ రొటీన్ హర్రర్ ఎలిమెంట్స్ మరియు ఇంట్రెస్ట్ గా సాగని ఫస్ట్ హాఫ్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. మొత్తమ్మీద ఎక్కువ అంచనాలు లేకుండా వెళ్తే.. ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అవుతాయి.

 

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు