విడుదల తేదీ : మే 12, 2023
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు: శ్రీనివాస్ బెల్లంకొండ, నుష్రత్ భరూచా, భాగ్య శ్రీ, శరద్ కేల్కర్, కరణ్ సింగ్ ఛబ్రా, ఫ్రెడ్డీ దారువాలా, రాజదేంద్ర గుప్తా, మరియు రాజేష్ శర్మ
దర్శకులు : వివి వినాయక్
నిర్మాతలు: ధవల్ జయంతిలాల్ గదా, అక్షయ్ జయంతిలాల్ గదా
సంగీత దర్శకులు: తనిష్క్ బాగ్చి
సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ
ఎడిటర్: నిరంజన్ దేవరమానె
సంబంధిత లింక్స్: ట్రైలర్
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బాలీవుడ్ హీరోయిన్ నుష్రత్ భరూచా హీరోయిన్ గా దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన చిత్రం “ఛత్రపతి”. తెలుగు సెన్సేషనల్ హిట్ కి రీమేక్ గా హిందీలో చేసిన ఈ సినిమాతో అయితే బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ డెబ్యూ ఇచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ :
ఇక కథలోకి వస్తే..శివ(బెల్లంకొండ శ్రీనివాస్) తన తల్లి (భాగ్య శ్రీ) తన తమ్ముడు అలోక్(కారం సింగ్) తో కలిసి పాకిస్తాన్ లో ఉంటారు. అలోక్ కి శివ తన సొంత అన్న కాదు అని పైగా తన తల్లికి శివ అంటేనే ఎక్కువ ప్రేమ అని అతడిపై అసూయ ఉంటుంది. అయితే వారు నివాసం ఉండే ప్రాంతంలో ఓ ఊహించని సంఘటనతో శివ తన కుటుంబం నుంచి వేరయిపోయి గుజరాత్ కి చేరుకుంటాడు. అక్కడ నుంచి తన జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి? ఏ కారణాల చేత తాను “ఛత్రపతి” గా మారాల్సి వస్తుంది. తన తల్లిని మళ్ళీ తాను చేరుకోగలిగాడా లేదా ఈ మధ్యలో తన తమ్ముడు ఏం చేస్తాడో అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనే చెప్పాలి. తన మొదటి బాలీవుడ్ సినిమా కోసం తన వల్ల అయ్యింది అంతా తాను పెట్టేసాడు. ఇంట్రెస్టింగ్ గా తన నటనలో కూడా గత సినిమాలతో పోలిస్తే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అలాగే ఇక యాక్షన్ సీక్వెన్స్ లలో తన పర్శనాలిటీకి తగ్గట్టుగా చేసే సీక్వెన్స్ లలో అదరగొట్టాడు.
అలాగే సినిమాలో సెకండాఫ్ కాస్త బెటర్ గా అనిపిస్తుంది. సెకండాఫ్ లో సీన్స్ ఎమోషన్స్ పలు చోట్ల బాగున్నాయి. ఇక నటుడు కరణ్ సింగ్ చాబ్రా తన రోల్ లో మంచి నటన కనబరిచాడు. అలాగే ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ లలో ఓ లాంగ్ లెంగ్త్ సీన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీటిని మాత్రం సినిమాలో భారీగా డిజైన్ చేశారు. ఇక సినిమాలో ఎలివేషన్స్ గాని డైలాగ్స్ గాని మాస్ ఆడియెన్స్ ని అయితే మెప్పించేలా ఉన్నాయని చెప్పొచ్చు.
మైనస్ పాయింట్స్ :
ఈ చిత్రంలో అతి పెద్ద డ్రా బ్యాక్ ఏమన్నా ఉంది అంటే అది సరైన ఎమోషన్స్ లేకపోవడం అని చెప్పాలి. ఒరిజినల్ లో ఎలివేషన్స్, మాస్ సీన్స్, అన్ని ఎలిమెంట్స్ తో పాటుగా అమ్మ సెంటిమెంట్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. కానీ ఈ చిత్రంలో మాత్రం ఇది కనిపించదు.
కేవలం శ్రీను ని బాలీవుడ్ లో మాసివ్ లెవెల్లో పరిచయం చేయాలి అనే స్కోప్ లో తన మీద ఎక్కవ శ్రద్ధ పెట్టినట్టు ఉంటుంది కానీ సినిమాలో సోల్ అయితే మిస్ అయ్యింది. పైగా ఈ యాక్షన్ సీక్వెన్స్ లు అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉండడం కూడా బోర్ అనిపించవచ్చు. అలాగే హీరోయిన్ నుష్రత్ భరూచా నటి భాగ్య శ్రీ లకు కూడా పెద్ద స్కోప్ ఉన్న పాత్రలు కనిపించవు.
ఇక సినిమాలో పాటలు ప్లేస్ మెంట్ కూడా కరెక్ట్ గా లేదు. సినిమా నిడివి తక్కువే అయినప్పటికీ నరేషన్ ని ఇంకాస్త బెటర్ గా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది. ఇక మరో నటుడు శరద్ కేల్కర్ లాంటి నటునికి కూడా పెద్దగా ఇంపార్టెన్స్ ఈ చిత్రంలో కనిపించలేదు.
సాంకేతిక వర్గం :
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు మాత్రం స్టన్నింగ్ గా ఉన్నాయి. భారీ విజువల్స్ యాక్షన్ సీక్వెన్స్ లలో ఆ ఖర్చు కనిపిస్తుంది. ఇక టెక్నికల్ టీం లో రవి బసృర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు కానీ బాగా ఓవర్ డెసిబుల్స్ లో ఉంటుంది. తనిష్క్ బాగ్చి పాటలు పర్వాలేదు. నైజర్ షఫీ సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్ సీక్వెన్స్ లు తాను బాగా చిత్రీకరించారు. డైలాగ్స్, యాక్షన్ పార్ట్స్ టీం వర్క్ బాగుంది. ఎడిటింగ్ ఇంకా బెటర్ చేయాల్సింది.
ఇక దర్శకుడు వివి వినాయక్ విషయానికి వస్తే ఈ రీమేక్ ని హ్యాండిల్ చేయడంలో మాత్రం తాను ఇంకాస్త బెటర్ గా చేయాల్సింది అని చెప్పాలి. కొన్ని ఇంట్రెస్టింగ్ మార్పులు చేర్పులు చేసారు కానీ సినిమాలో సోల్ ని పక్కన పెట్టేయడం బాధాకరం. ఈ విషయంలో స్క్రీన్ ప్లే ని మార్చిన మహాదేవ్ మాత్రం ఇందుకు కారణం అని చెప్పాలి. ముఖ్య పాత్రలకి మంచి స్పేస్ ఇవ్వలేదు. ఎక్కువగా హీరో మీద మాత్రమే స్కోప్ ఉండడంతో అంతగా రుచించదు.
తీర్పు :
ఇక మొత్తంగా చూసినట్టుగా అయితే హిందీలో “ఛత్రపతి” తో హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సాలిడ్ ఎంట్రీ ఇచ్చాడని చెప్పవచ్చు. తన వరకు అంతా న్యాయం చేసాడు కానీ ఒరిజినల్ కోసం తెలిసిన వారిని ఈ చిత్రం మెప్పించదు. సరైన క్యారక్టరైజేషన్ లేదు. సినిమాలో సోల్ మిస్ అయ్యింది. కొన్ని మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ సీన్స్ వరకు మాత్రం ఈ సినిమా హిందీ మాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకోవచ్చు.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team