సమీక్ష : చీమ ప్రేమ మధ్యలో భామ – బోర్ గా సాగే సిల్లీ లవ్ డ్రామా !

సమీక్ష : చీమ ప్రేమ మధ్యలో భామ – బోర్ గా సాగే సిల్లీ లవ్ డ్రామా !

Published on Feb 22, 2020 3:02 AM IST
Cheema Prema Madhyalo Bhaama movie review

విడుదల తేదీ : ఫిబ్రవరి 21, 2020

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

నటీనటులు :  అమిత్, ఇందు

దర్శకత్వం : శ్రీకాంత్ “శ్రీ” అప్పల రాజు

నిర్మాత‌లు : ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ

సంగీతం :  రవి వర్మ

సినిమాటోగ్రఫర్ : ఆరిఫ్ లలాని

ఎడిటర్ : హరి శంకర్

శ్రీకాంత్ “శ్రీ” అప్పలరాజు దర్శకత్వంలో అమిత్ మరియు ఇందు హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం “చీమ – ప్రేమ మధ్యలో భామ”. సుమన్, హరిత, పురంధర్ , వెంకట్ నిమ్మగడ్డ,రమ్య చౌదరి తదితరులు నటించిన ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…

 

కథ:

 

శివుని వరం చేత ఓ చీమ ధీర(అమిత్) అనే ఓ యువకునిగా మారుతుంది. ధీరకు కాలేజీలో మీరా(ఇందు)తో పరిచయం ఏర్పడుతుంది. కొద్దిరోజుల తరువాత వీరి పరిచయం ప్రేమగా మారుతుంది. మరి మనిషి అవతారంలో ఉన్న చీమ ప్రేమ వలన ఆ జంటకు ఎదురైన ఇబ్బందులు ఏమిటీ? ధీర మళ్ళీ చీమగా మారతాడా? చీమకు అమ్మాయికి మధ్య చిగురించిన ఈ అసహజమైన ప్రేమ కథ ఎలా ముగుస్తుంది? అనేది మిగతా కథ.

 

ప్లస్ పాయింట్స్:

 

సినిమాలో మెయిన్ లీడ్ మధ్య వచ్చే కొన్ని సీన్స్ లో వారి కెమిస్ట్రీ అలాగే కొన్ని మూమెంట్స్ ఒకే అనిపిస్తాయి. అలాగే అమిత్ మరియు ఇందు ఇద్దరూ నిజమైన వివాహిత జంటగా చాలా సహజంగా కనిపించారు. వారి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ పర్వాలేదు. ఈ సినిమాలో హీరోగా నటించిన అమిత్ ఎలాంటి తడబాటు, బెఱుకు లేకుండా కాన్ఫిడెంట్ గా నటించే ప్రయత్నం అయితే చేశాడు గాని, అతను నటన పరంగా అతను రాబోయే సినిమాల్లో ఇంకా మెరుగుపడాలి.

ఇక హీరోయిన్ గా నటించిన ఇందు కూడా తన నటనతో ఆకట్టుకున్నే ప్రయత్నం చేసింది. తన గ్లామర్ తో ఆమె సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు. దర్శకుడు కొన్ని సీన్స్ లో నవ్వించాడనికి బాగానే ప్రయత్నం చేశారు.

 

మైనస్ పాయింట్స్:

 

అసలు సినిమాలో చెప్పుకోవడానికి బలమైన స్టోరీ అంటూ ఏం ఉండదు. దర్శకుడు తనకు తోచినట్లు రాసుకుంటూ తీసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో చాలా భాగం కథకు సంబంధం లేని సీన్లతో ఇంట్రస్ట్ కలిగించలేని స్క్రీన్ ప్లేతో సాగితే, సెకెండ్ హాఫ్ సాగతీత సన్నివేశాలతో నిరుత్సాహ పరుస్తోంది.

అసలు సినిమా మొదలైన పది నిముషాలకే ఈ సినిమా ఏ స్థాయి సినిమానే అర్థమయిపోతుంది. పాత కాలపు ట్రీట్మెంట్ తో, కాలం చెల్లిన సన్నివేశాలతో దర్శకుడు ఆడియన్స్ ను మెప్పించాలని శతవిధాలా ప్రయత్నం చేసినప్పటికీ.. ప్రేక్షకులు మాత్రం ఒక్క సీన్ లో కూడా ఇన్ వాల్వ్ కారు. మొత్తంగా దర్శకుడు అనవసరమైన ట్రాక్స్ పెట్టి సినిమాని డైవర్ట్ చేశారు.

దీనికి తోడు దర్శకుడు ఉన్న కంటెంట్ ను కూడా పూర్తిగా వాడుకోలేదు. ఆయన కథ కథనాన్ని ఆసక్తికరంగా మలచకపోగా.. ఉన్న కనీస కంటెంట్ ను కూడా బాగా ఎలివేట్ చేయలేకపోయారు.

 

సాంకేతిక విభాగం:

 

దర్శకుడు శ్రీకాంత్ “శ్రీ” అప్పలరాజు పేపర్ మీద రాసిన స్క్రిప్ట్ ను స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. పైగా ఆయన రాసుకున్న కథకథనాలు కూడా ఇంట్రస్ట్ గా లేవు. అలాగే సహజత్వంతో పాటు కనీస విషయం కూడా లేదు. కెమెరామెన్ కెమెరా పనితనం కొన్ని సన్నివేశాలల్లో పర్వాలేదనిపిస్తుంది. రవి వర్మ అందించిన పాటల్లో ఒక పాట ఆకట్టుకుంటుంది. ఆయన అందించిన నేపధ్య సంగీతం సినిమాకి తగ్గట్లు సాగదు. హరి శంకర్ ఎడిటర్ దర్శకుడు అభిరుచికి తగ్గట్లే ఎడిటింగ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. కథకు తగ్గట్లుగానే ఈ చిత్ర నిర్మాత ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ నిర్మాణ విలువలు ఉన్నాయి.

 

తీర్పు:

మొత్తంగా చెప్పాలంటే చీమ ప్రేమ మధ్యలో భామ పాత కాలపు, బోరింగ్ లవ్ డ్రామా అని చెప్పాలి. ఈ ఫాంటసీ లవ్ డ్రామాలో మనకు కొత్త అనుభూతిని పంచే అంశాలేవీ లేవు. ఫ్యామిలీ నేపథ్యంలో లీడ్ పెయిర్ మధ్య వచ్చే సన్నివేశాలు మినహాయించి ఈ చిత్రంలో ప్రత్యేకత ఏమి లేదు. చీమ ప్రేమ మధ్యలో భామ సినిమా నిరాశపరిచే చిత్రం.

123telugu.com Rating : 1.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు