ఓటీటీ సమీక్ష: “చిన్ని” – తెలుగు చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం

ఓటీటీ సమీక్ష: “చిన్ని” – తెలుగు చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం

Published on May 8, 2022 3:01 AM IST
Chinni Movie Review

విడుదల తేదీ : మే 06,2022

123telugu.com Rating : 2.75/5

నటీనటులు : కీర్తి సురేశ్, సెల్వ రాఘవన్ తదితరులు

దర్శకత్వం : అరున్ మాతేశ్వరన్

నిర్మాతలు : స్క్రీన్ సీన్ మీడియా ఎంటర్‌టైన్ ప్రైవేట్ లిమిటెడ్

Mసంగీత దర్శకుడు : సామ్ సీఎస్

సినిమాటోగ్రఫీ : యామిని యఘ్నమూర్తి

ఎడిటర్ : నాగూరన్

కీర్తి సురేష్ ఓ రివేంజ్ డ్రామాతో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఇప్పుడు ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది మరియు అది ఎలా ఉందో చూద్దాం.

 

కథ:

పొన్ని(కీర్తి సురేష్), తన భర్త మారి (కన్న రవి) మరియు కూతురి మరణానికి ప్రతీకారం తీర్చుకునే పోలీసు మహిళ. దీని మీద పొన్ని కూడా అగ్రవర్ణాల వారిచే లైంగిక వేధింపులకు గురవుతుంది మరియు ఆమె జీవితం పట్ల నిరాశ చెందుతుంది. ఈ సమయంలో ఆమె ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఆమె తన సవతి సోదరుడు సాంగైయ్య (సెల్వరాఘవన్)తో ఆమె చేదు గతాన్ని పంచుకుంటుంది. మరీ పొన్ని సాంగైయ్యతో విభేదాలను ఎలా తొలగించుకుని పగ తీర్చుకుంటుందన్నదే మిగతా కథ.

 

ప్లస్ పాయింట్స్:

కీర్తి సురేశ్‌ ఇలాంటి పాత్రలో కనిపించడం ఇదే తొలిసారి. ఆమె కెరీర్‌ బెస్ట్ పెర్ఫార్మెన్స్‌లలో ఇదొకటి అని చెప్పవచ్చు. ఓ పల్లెటూరి అమ్మయిగా మరియు చక్కటి భావోద్వేగాలను చూపుతూ నేరం చేసే విధానం తెరపై కాస్తంత క్రూరంగానే కనిపిస్తాయి.

సాంగైయ్యగా స్లేవరాఘవన్ కూడా పర్ఫెక్ట్ ఛాయిస్. అతను స్థిరమైన నటనను కనబరిచాడు. పెద్దగా ఎక్కువ ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వకపోయినా, అతని కళ్ళు చాలా బాగా మాట్లాడినట్టు అనిపిస్తాయి. దర్శకుడు అతడిని చూపించిన విధానం కూడా అద్భుతంగా ఉంది. ఈ చిత్రానికి మరో అదనపు ప్రయోజనం ఏమిటంటే సామ్ సిఎస్ అందించిన అద్భుతమైన బీజీఎం, అతడు తన మ్యూజిక్‌తో సినిమాని బాగా ఎలివేట్ చేశాడు.

 

మైనస్ పాయింట్స్:

హింస క్రూరంగా కనిపించినా, పెర్‌ఫార్మెన్స్‌ సముచితంగా ఉన్నప్పటికీ, సినిమాలో ఎమోషనల్ డెప్త్ కొంచెం తక్కువయ్యింది. కీలక పాత్రలు మరియు వారి కెమిస్ట్రీ మధ్య బంధం మరింత పట్టుదలతో ఉంటే బాగుండేది.

సినిమా కాసేపు స్లో పేస్‌లో సాగి, చివరకి వచ్చేసరికి కాస్త హడావిడిగా సాగి ఫర్వాలేదనిపిస్తుంది. క్లైమాక్స్‌ను మరింత వివరంగా చెప్పాలని అనుకున్నారు కానీ అది జరగలేదు.

 

సాంకేతిక విభాగం :

ముందే చెప్పినట్లు సామ్ సిఎస్ సంగీతం మరియు బిజిఎమ్ చాలా బాగున్నాయి. యామిని యజ్ఞమూర్తి కెమెరా పనితనం అబ్బురపరుస్తుంది మరియు చిత్రానికి సరికొత్త రూపాన్ని తీసుకొచ్చింది. తెలుగు డబ్బింగ్ డీసెంట్ గా ఉంది, డైలాగ్స్ కూడా బాగున్నాయి. దర్శకుడు అరుణ్ విషయానికి వస్తే సినిమాను బాగానే తెరకెక్కించాడు. అతని కథనం ఆర్ట్ ఫిల్మ్ మంచి అనుభూతిని కలిగి ఉంది. స్క్రిప్ట్‌లోని తీవ్రత మరియు సారాంశం బాగుంది మరియు అది ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

 

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టేఇతే రివెంజ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో సాని కాయిదం (చిన్ని)గా కీర్తి సురేష్ తనలోని టాలెంట్‌ని చక్కగా ప్రదర్శించింది. కాస్త క్రూరమైన హింసను కలిగి ఉన్నప్పటికీ, ఉన్న కథనానికి మరియు ప్రత్యేకమైన ఆవరణకు అది ఉపయోగపడిందనే చెప్పవచ్చు. ఏది ఏమైనా రివేంజ్ డ్రామాలను కోరుకునే వారు ఈ సినిమాను పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా ఓసారి చూడవచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For Telugu Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు