లాక్ డౌన్ రివ్యూ: చాప్ స్టిక్స్ హిందీ మూవీ (నెట్ ఫ్లిక్స్)

లాక్ డౌన్ రివ్యూ: చాప్ స్టిక్స్ హిందీ మూవీ (నెట్ ఫ్లిక్స్)

Published on May 22, 2020 4:21 PM IST

నటీనటులు : అభయ్ డియోల్, మిథిలా పాల్కర్, విజయ్ రాజ్

దర్శకత్వం : సచిన్ యార్డి

నిర్మాత : అశ్విని యార్డి

సినిమాటోగ్రఫీ : కేదార్ గైక్వాడ్

 

నేటి లాక్ డౌన్ రివ్యూలో మన ఛాయిస్ హిందీ మూవీ చాప్ స్టిక్స్. సచిన్ యార్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. మరి చాప్ స్టిక్స్ ఎలా ఉందో చూద్దాం

 

కథాంశం ఏమిటీ?

ఎవరితో పెద్దగా పరిచయాలు పెంచుకోవడానికి ఇష్టపడని మాండ్రిన్ ట్రాన్స్లేటర్ నిర్మల(మిథిల పల్కర్) ఓ ఖరీదైన కారు కొనుక్కుంటుంది. ఐతే ఆమె కారును ఎవరో దొంగతనం చేస్తారు. అది తెలుసుకున్న నిర్మల తన కారును వెతకడం ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో ఆమె ఓ మోసగాడు (అభయ్ డియోల్) సాయం తీసుకుంటుంది. వారి వెతుకులలాటలో దీని వెనుక గ్యాంగ్ స్టర్ విజయ్ రాజ్ హస్తం ఉందని తెలుసుకుంటారు. మరి చివరకు ఆ మహిళ తను ఇష్టపడి కొనుక్కున్న కారు దక్కించుకుందా, లేదా అనేది మిగతా కథ..

 

ఏమి బాగుంది?

ఓ టి టి ప్లాట్ ఫార్మ్ ద్వారా ఫేమస్ అయిన నటి మిథిల పల్కర్ నటన ఆకట్టుకుంది. అలాగే మరో ప్రాధాన్యం ఉన్న రోల్ చేసిన అభయ్ డియోల్ నటన పరవాలేదు. సీరియస్ గా సాగే నిర్మల కథలో అక్కడక్కడా ఆకట్టుకొనే కామెడీ బాగుంది. ఇక గ్యాంగ్ స్టర్ రోల్ చేసిన విజయ్ రాజు ప్రత్యేక ఆకర్షణ. కారును వెతికే క్రమంలో ప్రధాన పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు కొన్ని ఆకట్టుకుంటాయి. బీజీఎమ్ మరియు కెమెరా వర్క్ అద్భుతం అని చెప్పాలి.

 

ఏమి బాగోలేదు?

ఓ సీరియస్ పాయింట్ తో మొదలైన కథలో పాత్రల జర్నీ ఏమాత్రం ఆకట్టుకోదు. చాల సన్నివేశాలు వాస్తవానికి దూరంగా సిల్లీగా అనిపిస్తాయి. అటు పూర్తిగా కామెడీ ఉండదు, అలా అని సీరియస్ డ్రామా కూడా లేదు. ప్రధాన పాత్రచేసిన అభయ్ డియోల్ నటన ఏమాత్రం ఆసక్తి కలిగించదు. ఇక కథను ముగించిన విధానం కూడా ఏమంత బాగోలేదు.

 

చివరి మాటగా
ఓ ఆసక్తికరమైన అంశం ఈ మూవీ లో ఉన్నప్పటికీ ఆకట్టుకోని నెరేషన్ ప్రేక్షకుడికి మంచి అనుభూతిని ఇవ్వదు. సిల్లీగా సాగే ఈ డ్రామాలో అటు పూర్తి స్థాయి హాస్యం ఉండదు, అలా అని ఎమోషన్స్ కూడా ఉండవు.మిథిల పల్కర్ నటన మినహాయిస్తే ఈ వెబ్ సిరీస్ లో చెప్పుకోవడానికి ఏమి లేదు.

Rating: 2/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు