సమీక్ష : చోర్ బజార్ – సిల్లీ డ్రామా!

Chor Bazar Movie Review

విడుదల తేదీ : జూన్ 24, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: ఆకాష్ పూరి, గెహ్నా సిప్పీ, సుబ్బరాజు, సునీల్, సంపూర్ణేష్ బాబు, తదితరులు

దర్శకత్వం : బి. జీవన్ రెడ్డి

నిర్మాత: వీ.ఎస్ రాజు

సంగీత దర్శకుడు: సురేష్ బొబ్బిలి

సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి

ఎడిటర్: అన్వర్ అలీ, ప్రభుదేవా


యంగ్ హీరో ఆకాష్ పూరి హీరోగా నటించిన చోర్ బజార్ చిత్రం నేడు థియేటర్ల లో విడుదల అయ్యింది. మరి సినిమా ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.

కథ:

హైదరాబాద్ రాయల్ మమ్మీస్ మ్యూజియంలో 200 కోట్ల రూపాయల విలువైన నిజాం వజ్రం అదృశ్యం అవుతుంది. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సమయంలో, బచ్చన్ సాబ్ (ఆకాష్ పూరి) 30 నిమిషాల్లో కారు టైర్లను తీసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించడానికి ప్రయత్నించే ఒక దొంగ. వజ్రం చోర్ బజార్‌లో ఉందని పోలీసులకు తెలుస్తుంది. తరువాత ఏం జరిగింది? వారు దానిని కనుగొన్నారా? ఎవరు దొంగిలించారు? సమాధానాలు తెలుసుకోవాలంటే, మీరు పెద్ద స్క్రీన్‌ పై చిత్రాన్ని చూడాలి.

ప్లస్ పాయింట్స్:

ఔట్ అండ్ ఔట్ యాక్షన్ సినిమాలు చేస్తూ మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలని ఆకాష్ పూరి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఈ సినిమాను కూడా ఒప్పుకున్నారు. ఈ చిత్రం లో అతను ఈజీగా యాక్ట్ చేశాడు. అతని వాయిస్ మరియు డైలాగ్ డెలివరీ సింప్లీ సూపర్ గా ఉన్నాయి.
దర్శకుడు చోర్ బజార్ ప్రజలను మరియు వారి ప్రవర్తనలను మంచి పద్ధతిలో చూపించడం జరిగింది. ఈ సినిమా కోసం ఆర్ట్ డిపార్ట్ మెంట్ వారు ఎంత కష్టపడ్డారు అనేది స్క్రీన్ పై క్లియర్ గా తెలుస్తోంది. ఈ చిత్రం కి కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాకు కథే పెద్ద మైనస్ అని చెప్పాలి. దానికి తోడు స్క్రీన్ ప్లే పేలవంగా ఉంది. కథను సరైన రీతిలో చెప్పడంలో దర్శకుడు సక్సెస్ సాధించలేదు అని చెప్పాలి. సినిమాలో ఏ ఒక్క పాత్రకి కూడా సరైన క్యారెక్ట‌రైజేషన్‌ లేదు. సునీల్, అర్చన, సుబ్బరాజు వంటి నటీనటులు ఉన్నప్పటికీ వారికి పవర్‌ఫుల్ పాత్రలను డైరెక్టర్ ఇవ్వాల్సి ఉంది. హీరోయిన్‌తో సహా మిగిలిన వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఆకాష్ పూరి కూడా తన యాక్షన్ తో ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో విఫలమయ్యాడు. లవ్ సీన్స్ అయినా, యాక్షన్ ఎపిసోడ్స్ అయినా అన్నీ ఆకట్టుకోలేవు. మొత్తానికి, సినిమా అనవసరమైన సన్నివేశాలు మరియు అవసరం లేని కథనంతో మీ సహనాన్ని పరీక్షిస్తుంది అని చెప్పాలి.

సాంకేతిక విభాగం:

ఇంతకుముందు జార్జి రెడ్డిని డైరెక్ట్ చేసిన దర్శకుడు జీవన్ రెడ్డి రచయితగా మరియు దర్శకుడిగా సినిమాను అంతగా తీయలేదు అని చెప్పాలి. స్క్రీన్ ప్లే లో సరైన క్లారిటీ లేదు, అంతేకాక సినిమాను కథనంలో స్పష్టత లేదు, ఈ అంశాలతో చోర్ బజార్‌ చిత్రం ప్రేక్షకుల సహనం ను పరీక్షించే విధంగా ఉంటుంది. సురేష్ బొబ్బిలి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు అని చెప్పాలి. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ బాగుంది. VFX మరియు నిర్మాణ విలువలు ఇంకా మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. అన్వర్ అలీ ఎడిటింగ్ పర్వాలేదు కానీ కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది.

తీర్పు:

మొత్తం మీద, చోర్ బజార్ చిత్రం సిల్లీ మరియు బోరింగ్ డ్రామా గా ఉంది. ఆకాష్ పూరి మరియు అతని పెర్ఫార్మెన్స్ తప్ప, సినిమాలో చూసేందుకు ఏమీ లేదు. ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోదు.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version