విడుదల తేదీ : 19 ఏప్రిల్ 2013 | ||
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5 |
||
దర్శకుడు : ఎ.కె కంభంపాటి |
||
నిర్మాత : జ్యోతి |
||
సంగీతం : ప్రవీణ్ లక్కరాజు |
||
నటీనటులు : అర్జున్ కళ్యాణ్, సుమోన చందా, కోమల్ ఘా… |
అర్జున్ కళ్యాణ్, సుమోన చందా హీరో హీరోయిన్స్ గా, ఎ.కె కంభంపాటి దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘చిన్న సినిమా’. అమెరికా వెళ్లి డాలర్లు సంపాదించి తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకునే ఓ కుర్రాడి కథతో తెరకెక్కిన ఈ సినిమాలో 1950 లో జరిగిన ఓ ఎపిసోడ్ ని చూపించడం అందరినీ ఆసక్తికి గురిచేస్తోంది. జెర్సీ ప్లాట్స్ బ్యానర్ పై శేఖర్ నిర్మించిన ఈ సినిమాకి ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ డైరెక్టర్. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ‘చిన్న సినిమా’ పెద్ద విజయాన్ని అందుకునే రేంజ్ లో ఉందో లేదో ఇప్పుడు చూద్దాం..
కథ :
ఇండస్ట్రీలో డైరెక్టర్ కావాలని కసితో ఉన్న యంగ్ డైరెక్టర్(ఆర్.జె గజిని) రెండు కోట్ల బడ్జెట్ తో ‘చిన్న సినిమా’ తీయాలనుకుంటాడు. సినీ నిర్మాత అయిన డాంగీ(30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి) గజినిని ఫేమస్ సినీ విమర్శకుడైన శ్రీ(వెన్నెల కిషోర్) కి చెప్పమంటాడు. అతను చెప్పిన స్టొరీ ఏంటంటే ..
తొందరగా డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో రాముడు(అర్జున్ కళ్యాణ్) విసా సంపాదించుకొని అమెరికా వెళ్తాడు. అక్కడ మహేష్ అనే అతని షాప్ లోపనిచేస్తూ నెలనెలా ఇంటింకి డబ్బులు పంపుతూ ఉంటాడు. ఖాళీ టైములో అతను అనుకోకుండా జానకి(సుమోన చందా) కలుస్తాడు. వీరిద్దరి మధ్యా ప్రేమ పుడుతుంది. కథ ఇండియా కొస్తే వృద్దుడైన బాపిరాజు(ఎం. బాలయ్య) ‘రామాలయం’ అనే ఒక ఆనాడ శరణాలయాన్ని నడుపుతుంటాడు. ఎవరి దగ్గరా విరాళాలు తీసుకోకుండా ఉన్న అతను చివరి రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. రాముడు వాళ్ళ నాన్న బాపిరాజుకి చాలా నమ్మకస్తుడైన శిష్యుడు కావున తనకి ఎలాగైనా చేతనైన సాయం చెయ్యాలనుకుంటాడు.
లోకల్ గా పొలిటీషియన్ తన కెరీర్ కోసం రామాలయం పేరుని మార్చలనుకుంటాడు. అతని అరాచకత్వం వల్ల చాలా మంది గాయాల పాలవుతారు. అలాంటి సమయంలో జానకి ఎంటర్ అవ్వడం, తనకి – పొలిటీషియన్ కి మధ్య రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ ఏంటి? చివరిగా రామాలయంకి ఏం జరిగింది? అనేదే మిగిలిన కథ..
ప్లస్ పాయింట్స్ :
ఏమీ ఆశించకుండా నిశ్వార్ధంగా డొనేషన్స్ ఇవ్వడం, ఎలాంటి విరాళాలు ఆశించకుండా చారిటీని రన్ చెయ్యడం లాంటివి బాగా చూపించారు. విలక్షణ నటుడు ఎం. బాలయ్య బాపిరాజు పాత్రలో మంచి నటనను కనబరిచి ప్రేక్షకులను మెప్పించాడు. మనిషికి అన్నీ ఫ్రీగా ఇచ్చి బద్దకస్తుల్లా తయారు చేస్తే ఎలాంటి దారుణాలు జరుగుతాయి అనేదాన్ని చాలా బాగా చూపించారు. హీరోగా చేసిన అర్జున్ కళ్యాణ్ నటన ఓకే. కెమెరా ముందు ఇంకా తడబడుతున్నాడు కాస్త రిలాక్స్ గా చెయ్యగలగాలి. అతను చాలా వరకు నాగ చైతన్యని ఇమిటేట్ చేసాడు(చాలా మంది కూడా ఇలానే ఫీలవుతున్నారు). అతను అది మార్చుకుంటే చాలా బాగుంటుంది.
వెన్నెల కిషోర్ సినీ విమర్శకుడు శ్రీ పాత్రలో బాగానే నవ్వించారు. డైరెక్టర్ కావాలనుకున్న ఆర్.జె గజినీ తన పాత్రలో బాగా నటించాడు. సినిమా ఫస్ట్ హాఫ్ లో వచ్చే సీన్స్ బాగున్నాయి ముఖ్యంగా ఫ్రెండ్స్ మధ్య వచ్చే కామెడీ సీన్స్. ‘పుత్తడి బొమ్మ’ సాంగ్ ని చాలా బాగా షూట్ చేసారు.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమా కోసం ఎంచుకున్న హీరోయిన్ సుమోన చందా పాత్రకి అస్సలు సెట్ అవ్వలేదు. అలాగే తెలుగు ప్రేక్షకులు మెచ్చుకునే ఫేస్ కూడా ఆమెలో లేదు. గౌతం రాజు, అతని ఓల్డ్ ఏజ్ గ్యాంగ్ ప్రేక్షకులని చిరాకు పెడతారు. వారి మధ్య వచ్చే కామెడీ సీన్స్ చాలా పూర్ గా ఉన్నాయి. విలన్ పాత్ర పోషించిన మహేష్ లుక్ బాగుంది కానీ అతని నటనే చాలా గోరంగా ఉంది. అతను వాయిస్ మోడ్యులేషన్ ని చాలా మార్చుకోవాలి.
మహేష్ బావమరిది గా చేసిన నటుడు ప్రేక్షకులకు చిరాకు తెప్పించడమే కాకుండా అతని జుట్టు, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పిన నటిలో అంత చార్మ్ లేదు. కౌ బాయ్ కృష్ణ గా రవి వర్మ పాత్ర వృధా అయిపొయింది. రవి వర్మ అతని అసిస్టెంట్ తో కలిసి చేసిన కామెడీ ట్రాక్ బోరింగ్ గా ఉండడమే కాకుండా సినిమా ఫ్లో ని దెబ్బ తీస్తుంది. ఇది సినిమాకి మేజర్ మైనస్ పాయింట్.
సెకండాఫ్ లో సినిమా ఫ్లో మొత్తం ఒక్క సారిగా పడిపోయి చాలా నిదానంగా సాగుతుంది. అర్జున్ కళ్యాణ్ – సుమోన చందా మధ్య ఉన్న రొమాంటిక్ ట్రాక్ ఇంకాస్త బాగుండాల్సింది. పొలిటీషియన్ – బాపిరాజు మధ్య వచ్చే గొడవ సీన్స్ అంత ఎమోషనల్ గా లేవు. దానివల్ల ఆడియన్స్ ఆ సీన్ కి కనెక్ట్ అవ్వరు. డైరెక్టర్ ఫస్ట్ ఫిల్మ్ కావడం వల్ల సినిమాలో చాలా తప్పులు కనిపిస్తాయి.
సాంకేతిక విభాగం :
సినిమాకి పెట్టిన బడ్జెట్ ప్రకారం సినిమాటోగ్రఫీ ఓకే అనేలా ఉంది. ఎడిటింగ్ చాలా చెత్తగా ఉంది. కొన్ని సీన్స్ లో డైలాగ్స్ ఓకే అనేలా ఉన్నాయి కానీ కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఉండాల్సినంత డెప్త్ లేదు. ఎ.కె కంభంపాటి ఇంకా బేసిక్స్ నేర్చుకునే దగ్గరే ఉన్నాడు అతను డైరెక్టర్ అవ్వాలనుకుంటే స్క్రీన్ ప్లే, కథని ఎలా ప్రెజెంట్ చెయ్యాలి అనే విషయాల మీద అవగాహన పెంచుకోవాలి. అలాగే సినిమాలోని పాత్రల కోసం ఎలాంటి నటీనటులను ఎంచుకోవాలి అనే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.
తీర్పు :
‘చిన్న సినిమా’ కోసం ఎంచుకున్న కాన్సెప్ట్ చాలా బాగుంది. కానీ తెరపై చూపించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఈ సినిమాలో చూపించిన మెసేజ్ చాలా మందికి నచ్చుతుంది కానీ చాలా స్లోగా ఉండడం వల్ల దానికి చాలా మంది కనెక్ట్ అవ్వరు. డైరెక్టర్ ఎ.కె కంభంపాటి తొలి చిత్రంతో టెక్నికల్ విభాగంలో మాత్రం ఓకే అనిపించుకోగలిగాడు
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
రివ్యూ – మహేష్ ఎస్ కోనేరు
అనువాదం – రాఘవ