విడుదల తేదీ : మార్చి 11, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు: ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్, కృష్ణ కురుప్, నాజర్, బ్రహ్మాజీ, మైమ్ గోపి, మునిష్కాంత్
దర్శకత్వం : పృద్వి ఆదిత్య
నిర్మాత: రామాంజనేయులు జవ్వాజి, రాజ శేఖర్ రెడ్డి
సంగీత దర్శకుడు: ఇళయరాజా
సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కుమార్
ఎడిటర్ : రగుల్
ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం రీసెంట్ గా ఓటిటి రిలీజ్ కి ఎంట్రీ ఇస్తూ వచ్చింది. ఓటిటి సంస్థ సోనీ లివ్ లో ఈరోజే ఎక్స్ క్లూజివ్ గా రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.
కథ :
ఇక కథలోకి వచ్చినట్టు అయితే.. విష్ణు (ఆది పినిశెట్టి) రన్నింగ్ రేస్ లో ఒక తిరుగులేని ఛాంపియన్. కానీ ఓరోజు దురదృష్టవశాత్తు ఒక రోడ్డు ప్రమాదంలో తన కాలిని కోల్పోతాడు. ఇక ఆ తర్వాత వైవాహిక జీవితంలో ఏమాత్రం ఆసక్తి లేకుండా ఓ ఉద్యోగం చేస్తూ బతుకుతాడు. మరి ఈ క్రమంలో తనకి ఓ స్టేట్ లెవెల్ మహిళా రన్నర్ భాగ్యలక్ష్మి(కృష్ణ కురూప్) అనే అమ్మాయికి కోచ్ గా మారే పరిస్థితి ఏర్పడుతుంది. మరి తన జీవితంలో వచ్చిన ఈ మలుపుతో విష్ణు ఎలాంటి సవాళ్ళను ఎవరి నుంచి ఎదుర్కొంటాడు. తన కలల సౌధాన్ని తన ప్లేయర్ తో నెరవేర్చుకుంటాడా లేదా? భాగ్యలక్ష్మి ని ఈ గేమ్ లో ఎంతవరకు తీసుకెళ్లాడు అనేది తెలియాలి అంటే ఈ సినిమాని సోనీ లివ్ లో చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
మన ఇది వరకు చూసిన పలు స్పోర్ట్స్ డ్రామాస్ తరహాలోనే ఈ సినిమా కూడా కొన్ని ఇంప్రెసివ్ ఎలిమెంట్స్ మరియు ఎమోషన్స్ తో ఉంటుంది అని చెప్పాలి. అందుకు తగ్గట్టుగా ఆది తనకి వచ్చిన ఈ సరికొత్త పాత్రని చాలా బాగా చేసాడు. అథ్లెట్ గా తర్వాత తన లైఫ్ మారిపోయిన యువకుడిగా మంచి షేడ్స్ లో మంచి నటనని కనబరిచాడు. అలాగే తనపై చూపే కొన్ని సన్నివేశాలు బాగుంటాయి.
ఇంకా నటి భాగ్యలక్ష్మి గా కనిపించిన కృష్ణ మంచి నటనను కనబరిచింది అలాగే తనపై చూపించిన కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. ఇక ఈ సినిమాలో మరో హైలైట్ సీనియర్ నటుడు నాజర్ అని చెప్పాలి. మళ్ళీ చాలా కాలం తర్వాత తనలోని విలనిజాన్ని తాను సాలిడ్ గా చూపించారు. ఇంకా ఈ సినిమాలో ఒక స్పోర్ట్ కి సంబంధించి ఎలాంటి పాలిటిక్స్ ఉంటాయి, ప్లేయర్స్ పరంగా ఎదురయ్యే ఇబ్బందులను చూపించిన విధానం బాగుంది. ఇంకా ఆకాంక్ష సింగ్, మైమ్ గోపి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ ఏమిటంటే ఈ సినిమా సాగే తీరు అని చెప్పాలి. చాలా వరకు ఈ సినిమా చాలా సింపుల్ గా డల్ గా సాగదీతగా కొనసాగుతుంది. దీనితో చూసే ఆడియెన్స్ కి అంత ఆసక్తి పెద్దగా కలగదు. పైగా ఒక స్పోర్ట్స్ డ్రామా అంటే ఎలా చూసుకున్నా మంచి ఇన్ స్పైర్ చేసే సన్నివేశాలు సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ ఉంటాయి.
కానీ అవేవి ఈ సినిమాలో కనపడకపోవడం గమనార్హం. దీనితో ఈ సినిమా మరింత ఫ్లాట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే కథనంలో మరింత మంచి డ్రామా ప్లేస్ చెయ్యడానికి అవకాశం ఉన్నా దర్శకుడు ఎందుకో ఆ వైపుగా మలచలేదు. అలాగే బ్రహ్మాజీ, ఆకాంక్ష సింగ్ సహా మరికొంతమంది నటుల పాత్రలు కూడా ఏమంత ఆకట్టుకునే విధంగా అనిపించవు. అలాగే ఇలాంటి డ్రామాస్ కి ఎంతో కీలకం అయిన సాలిడ్ ఎమోషన్స్ కూడా మిస్ అయ్యాయి.
సాంకేతిక వర్గం :
మొదటగా ఈ సినిమాలో టెక్నికల్ టీం పనితీరుకి వస్తే సినిమాటోగ్రఫీ సినిమా నేపథ్యానికి తగ్గట్టు బాగుంది. అలాగే ఇళయరాజా గారి సంగీతం పలు సన్నివేశాల్లో మంచి ఎఫెక్టివ్ గా ఉందని చెప్పాలి. అలాగే ఎడిటింగ్ ఇంకా బాగా చెయ్యాల్సింది. ఇంకా సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఇక దర్శకుడు పృద్వి ఆదిత్య విషయానికి వస్తే తెలుగులో రన్నింగ్ బ్యాక్ డ్రాప్ సినిమాగా మంచి లైన్ లో పట్టుకున్నాడు కానీ ఓవరాల్ గా అంత మెప్పించే స్థాయిలో తీయలేకపోయారని చెప్పాలి. సినిమాని మరింత ఆసక్తిగా మలచడానికి చాలా స్కోప్ ఉన్నా తాను ఎందుకో కాస్త ఫ్లాట్ నరేషన్ నే ఎంచుకోవడం అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. దీనితో అక్కడక్కడ మాత్రమే సినిమా బాగున్నట్టు అనిపిస్తుంది.
తీర్పు :
ఇక మొత్తంగా చూసుకున్నట్టయతే స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ “క్లాప్” చిత్రం లో ఆది సహా కొన్ని సన్నివేశాలు బేసిక్ గా ఇలాంటి సినిమాకి కావాల్సిన కొన్ని మంచి ఎలిమెంట్స్ చూపించడం ఆకట్టుకుంటాయి. అలాగే కొన్ని ఎమోషన్స్ పర్వాలేదనిపిస్తాయి. కానీ సినిమా కాస్త సాగదీతగా ఉండడం చెప్పుకోదగ్గ ఎలివేషన్స్ లాంటివి లేకుండా ఫ్లాట్ గా ఉండడం మూలాన కాస్త ఆసక్తిని దెబ్బ తీస్తాయి. ఒకవేళ మీరు స్పోర్ట్స్ మూవీ లవర్స్ అయితే ఓసారి ఈ సినిమాని చూడొచ్చు.
123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team
Click Here For English Version