సమీక్ష : కోబ్రా – కన్ ఫ్యూజ్డ్ గా సాగే యాక్షన్ థ్రిల్లర్!

సమీక్ష : కోబ్రా – కన్ ఫ్యూజ్డ్ గా సాగే యాక్షన్ థ్రిల్లర్!

Published on Sep 1, 2022 2:00 AM IST
Cobra Movie Review

విడుదల తేదీ : ఆగస్టు 31, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: విక్రమ్, శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, మియా జార్జ్, రోషన్ మాథ్యూ, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి తదితరులు

దర్శకత్వం : ఆర్ అజయ్ జ్ఞానముత్తు

నిర్మాతలు: ఎస్ఎస్ లలిత్ కుమార్

సంగీత దర్శకుడు: ఏఆర్ రెహమాన్

సినిమాటోగ్రఫీ: హరీష్ కన్నన్

ఎడిటర్: భువన్ శ్రీనివాసన్

చియాన్ విక్రమ్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన కొత్త మూవీ కోబ్రా. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీకి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. కాగా ఈ రోజు రిలీజ్ అయిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

 

క‌థ‌:

 

మది (విక్రమ్) ఒక మ్యాథ్స్ టీచర్. అయితే, తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా మానసికంగా ఇబ్బంది పడుతూ సీరియస్ క్రైమ్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఇంటర్ నేషనల్ రేంజ్ లో మది కొన్ని హత్యలు చేస్తాడు. మరో వైపు భావన (శ్రీనిధి శెట్టి) మదిని ప్రేమిస్తూ ఉంటుంది. తనను పెళ్లి చేసుకోమని మదిని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత ఖదీర్ (మరో విక్రమ్), మది పై పగ బట్టి అతన్ని అంతం చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇంతకీ ఈ ఖదీర్ ఎవరు ?, ఎందుకు మది పై పగ బట్టాడు ?, వీరి మధ్య జరిగిన కథ ఏమిటి ?, చివరకు మది కథ ఎలా టర్న్ అయ్యింది ? ఈ మొత్తం వ్యవహారంలో అసలు మది, ఖదీర్ లను చంపడానికి ట్రై చేస్తోంది? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్:

 

చియాన్ విక్రమ్ వన్ మ్యాన్ షోతో నడిచిన ఈ సినిమాలో.. మది మరియు ఖదీర్ పాత్రల్లో విక్రమ్ అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని ఎమోషనల్ అండ్ సప్సెన్స్ సీక్వెన్స్ స్ లో విక్రమ్ నటన సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఇక హీరోయిన్ గా నటించిన శ్రీనిధి శెట్టి కూడా తన క్యూట్ లుక్స్ తో అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన మృణాళిని రవికి పెద్దగా నటించే స్కోప్ లేదు. అయితే ఉన్నంతలో ఆమె తన నటనతో ఆకట్టుకుంది.

ఇక మిగిలిన కీలక పాత్రల్లో నటించిన ఇర్ఫాన్ పఠాన్, మియా జార్జ్, కేఎస్ రవికుమార్, బాగానే నటించారు. ఈ సినిమాలో ఇర్ఫాన్ పఠాన్ కి మంచి క్యారెక్టర్ దొరికింది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. దర్శకుడు ఆర్ అజయ్ జ్ఞానముత్తు తీసుకున్న స్టోరీ లైన్, రాసుకున్న కొన్ని సస్పెన్స్ సీక్వెన్సెస్ బాగున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లోని చాలా సీన్స్, మరియు సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్నాయి.

 

మైనస్ పాయింట్స్:

 

కోబ్రా కథలో డెప్త్ ఉన్నా.. కొన్ని సీన్స్ కన్ ఫ్యూజ్డ్ గా సాగాయి. పైగా మెయిన్ ప్లాట్ లోని మెయిన్ క్యారెక్టర్స్ మధ్య ప్రధాన కాన్ ఫ్లిక్ట్ సరిగ్గా కనెక్ట్ కాలేదు. అలాగే ఎమోషన్ కూడా ఇన్ వాల్వ్ అయ్యేలా లేదు. అసలు ఇలాంటి సస్పెన్స్ ఎమోషనల్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తీసుకున్నపుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి కట్టేలా సినిమా సాగితేనే.. ఆడియన్స్ ను ఆకట్టుకోగలం. అయితే, ఈ సినిమాలో అలాంటి అంశాలు మిస్ అయ్యాయి.

అలాగే కొన్ని ఇన్సిడెంట్స్ మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి. అలాగే సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు కూడా అంతగా ఆకట్టుకోవు. పైగా ఖదీర్ పాత్రను పెంచడానికి మది పాత్రను తగ్గించడం బాగాలేదు.దీనికి తోడు సినిమాలో ఇంట్రసింగ్ ప్లేను బిల్డ్ చేయలేకపోయారు. హీరో డబుల్ క్యారెక్టైజేషన్స్ ఇంకా ఎఫెక్టివ్ రాసుకోవాల్సింది. ముఖ్యంగా మది క్యారెక్టర్ తాలూకు యాక్టివిటీస్ కూడా సినిమాకి మైనస్ అయ్యాయి.

పైగా కొన్ని సీన్స్ లో నాటకీయత ఎక్కువడంతో ఆ సీన్స్ సహజత్వం లోపించింది. అయితే, దర్శకుడు సెకెండాఫ్ ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రస్ట్ గా నడుపుదామని మంచి ప్రయత్నం అయితే చేశారు గాని, ఓవరాల్ కొన్ని చోట్ల లాజిక్స్ వదిలేశారు.

 

సాంకేతిక విభాగం:

 

టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు ప్లస్ ఆయింది. అదే విధంగా సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. సినిమాలోని నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అయితే దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు అందరికీ అర్థం అయ్యేలా, అదే విధంగా ఆకట్టుకునేలా ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకుని ఉండి ఉంటే ఇంకా బాగుండేది.

 

తీర్పు:

 

యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ కోబ్రా మూవీ కొన్ని చోట్ల ఆకట్టుకుంది. అలాగే ఈ సస్పెన్స్ క్రైమ్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు కొన్ని సస్పెన్స్ సీన్స్ కూడా బాగున్నాయి. అయితే, చాలా సీన్స్ కన్ ఫ్యూజ్డ్ గా సాగడం, స్క్రీన్ ప్లేలో ఇంట్రెస్ట్ మిస్ అవ్వడం, అలాగే కొన్ని సీన్స్ లో ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. కాకపోతే, సినిమాలో విక్రమ్ నటన అద్భుతంగా ఉంది. కొన్ని ఎమోషన్స్ కూడా బాగున్నాయి. ఓవరాల్ గా ఈ చిత్రం విక్రమ్ ఫ్యాన్స్ కి కనెక్ట్ అవుతుంది. అయితే, మిగిలిన వర్గాల ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా ఆకట్టుకోదు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు