సమీక్ష : కనెక్ట్ – ఇంట్రస్ట్ గా సాగని సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ !

Connect Movie-Review-In-Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 22, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: నయనతార, అనుపమ్‌ ఖేర్, సత్యరాజ్‌, వినయ్‌ రాయ్‌, హనియా నఫిసా తదితరులు

దర్శకుడు : అశ్విన్ శరవణన్

నిర్మాత: విఘ్నేష్ శివన్

సంగీత దర్శకులు: పృథ్వీ చంద్రశేఖర్

సినిమాటోగ్రఫీ: మణికంఠన్ కృష్ణమాచారి

ఎడిటర్: రిచర్డ్ కెవిన్

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

నయనతార ప్రధాన పాత్రలో దర్శకుడు విఘ్నేష్ శివన్ నిర్మించిన సినిమా ‘కనెక్ట్’. ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. మరి ప్రేక్షకులును ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

సుసాన్ (నయనతార) తన భర్త జోసెఫ్ బెనాయ్ (వినయ్ రాయ్), కుమార్తె అమ్ము అలియాస్ అనా జోసెఫ్ (హనియా నఫీసా), అలాగే తండ్రి ఆర్థర్ (సత్యరాజ్)తో సంతోషంగా లైఫ్ ను లీడ్ చేస్తూ ఉంటుంది. ఐతే, కోవిడ్ సుసాన్ (నయనతార) ఫ్యామిలీని పూర్తిగా డిస్ట్రబ్ చేస్తోంది. ఆమె భర్త జోసెఫ్ బెనాయ్ (వినయ్ రాయ్) ఒక డాక్టర్. కోవిడ్ పేషంట్స్ కు చికిత్స అందిస్తున్న సమయంలో అతను కూడా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతాడు. మరణించిన తండ్రితో మాట్లాడాలని జోసెఫ్ కుమార్తె అమ్ము అలియాస్ అనా జోసెఫ్ (హనియా నఫీసా) వుయ్ జా బోర్డుతో ట్రై చేస్తుంది. అది వికటించి ఆమెను దుష్ట ఆత్మ ఆవహిస్తుంది. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో తన కూతురికి దెయ్యం పట్టిందని సుసాన్ (నయనతార)కి ఎప్పుడు తెలుసుకుంది ?, ఆ దెయ్యం నుంచి తన కూతుర్ని కాపాడుకోవడానికి సుసాన్ ఏం చేసింది ?, ఈ క్రమంలో ఆమె తండ్రి ఆర్థర్ (సత్యరాజ్), అలాగే ఫాదర్ అగస్టీన్ (అనుపమ్ ఖేర్) ఆమెకు ఎలాంటి సాయం చేశారు?, చివరకు ఈ కథ ఎలా ముగిసింది ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

వుయ్ జా బోర్డు (ఆత్మ లతో కనెక్ట్) అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో హారర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాలో మెయిన్ సీక్వెన్స్ లో వచ్చే కొన్ని హారర్ సీన్స్ బాగానే ఉన్నాయి. నయనతార సగటు తల్లిగా అద్భుతంగా నటించింది. ముఖ్యంగా తన కూతుర్ని దెయ్యం ఇబ్బంది పెడుతున్న క్రమంలో వచ్చే సీన్స్ లో నయనతార నటన చాలా బాగా ఆకట్టుకుంది. అలాగే సత్యరాజ్ కూడా మెప్పించారు. క్లిష్టమైన కొన్ని ముఖ్య సన్నివేశాల్లో కూడా సత్యరాజ్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అలాగే హారర్ అండ్ ఎమోషనల్ సీన్స్ లోనూ సత్యరాజ్ పలికించిన హావభావాలు చాల బాగున్నాయి.

ఇక నయనతార – కూతురికి మధ్య ఎమోషన్స్ కూడా బాగా ఎలివెట్ అయ్యాయి. సినిమాలో కీలకమైన పాత్రలో నటించిన అనుపమ్‌ ఖేర్ తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. అలాగే మరో ప్రధాన పాత్రలో నటించిన వినయ్‌ రాయ్‌ కూడా చాలా బాగా నటించారు. అదే విధంగా ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

 

సినిమాలో మెయిన్ పాయింట్ అండ్ కొన్ని హారర్ సీన్స్ పర్వాలేదు అనిపించినా.. మిగిలిన సీన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. అలాగే క్యారెక్టర్స్ ను ఎలివేట్ చేస్తూ దర్శకుడు అనుకున్న సీన్స్ లో కొన్ని చోట్ల బెటర్ గా ఉన్నా… చాలా చోట్ల బోర్ గా సాగాయి. అలాగే కొన్ని సన్నివేశాలు స్లోగా ఉండటం, మరియు కొన్ని సన్నివేశాల్లో ఇంట్రస్ట్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.

పైగా సినిమా ఎండింగ్ లో కూడా ఇంట్రస్ట్ మిస్ అవ్వడంతో పాటు హనియా నఫిసా ఆత్మ ట్రాక్ లో లాజిక్ మిస్ అవ్వడం వంటి అంశాలు బాగాలేదు. దీనికితోడు చాలా సీన్స్ మరీ సినిమాటిక్ గా సాగుతాయి. ఇలాంటి సస్పెన్స్ ఎమోషన్ థ్రిల్లర్ లో ఇలాంటి సిల్లీ ట్రీట్మెంట్ ను రాసుకోకుండా ఉండాల్సింది. పైగా కొన్ని లీడ్ సీన్స్ అన్ని కన్ ఫ్యూజ్డ్ గా సాగడంతో సినిమా కొంతవరకు నిరాశ పరుస్తోంది.

ఓవరాల్ గా ఈ సినిమా స్క్రీన్ ప్లేను ఇంకా బలంగా రాసుకుని ఉండి ఉండాల్సింది. అలాగే సినిమాలో మెయిన్ డ్రామాకి మోటివ్ అండ్ క్లారిటీ ఇంకా బెటర్ గా పెట్టి ఉంటే బాగుంది.

 

సాంకేతిక విభాగం :

 

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది.
ముఖ్యంగా హారర్ సన్నివేశాల్లో సీన్ లోని మూడ్ ని తన కెమెరా యాంగిల్స్ తో కళ్ళకు కట్టినట్టు చూపించారు కెమెరామెన్ మణికంఠన్ కృష్ణమాచారి. అలాగే పృథ్వీ చంద్రశేఖర్ అందించిన నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంది. ఇక ఎడిటింగ్ కూడా బావుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఆకట్టుకున్నాయి.

 

తీర్పు :

 

వుయ్ జా బోర్డు అంటూ విభిన్నమైన కథతో వైవిధ్యంగా తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్ లో.. కొన్ని ఆకట్టుకునే హారర్ సీన్స్ అండ్ కొన్ని ఎమోషన్స్ పర్వాలేదు. నయనతార అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. అయితే సినిమా బాగా స్లోగా బోర్ గా సాగడం, అలాగే కొన్ని కీలకమైన సన్నివేశాలు రొటీన్ గా అండ్ స్లోగా సాగడం మరియు లాజిక్ లెస్ సీక్వెన్సెస్ వంటి అంశాలు సినిమా రిజల్ట్ ను దెబ్బ తీశాయి. ఓవరాల్ గా ఈ కనెక్ట్ థిల్లర్ థ్రిల్ చేయలేక పోయింది. ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించదు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version