రివ్యూ : ‘కరోనా వైరస్’ – బాగా బోర్ గా సాగే కరోనా డ్రామా !

coronavirus Telugu Movie Review

విడుదల తేదీ : డిసెంబర్ 11th, 2020

123telugu.com Rating : 1.75/5

నటీనటులు : శ్రీకాంత్‍ అయ్యంగార్‍, వంశీ చాగంటి, సోనియా ఆకుల, కల్పలత గార్లపాటి, దక్షి గుత్తికొండ, దొర సాయితేజ తదితరులు

దర్శకత్వం : అగస్త్య మంజు

నిర్మాత : రామ్‍ గోపాల్‍ వర్మ, నన్నపురెడ్డి, ఎల్లారెడ్డి

సంగీతం : డి.ఎస్‍.ఆర్‍

సినిమాటోగ్రఫీ : వి. మల్హభట్‍ జోషి

కూర్పు : నాగేంద్ర

వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్‌ వర్మ సినిమా కంపెనీ నుంచి కరోనా వైరస్ సినిమా రిలీజ్ అయింది. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ఫేమ్‌ అగస్త్య మంజు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అయితే ఈ సినిమాలో కీలక పాత్రల్లో శ్రీకాంత్‍ అయ్యంగార్‍, వంశీ చాగంటి, సోనియా ఆకుల, కల్పలత గార్లపాటి, దక్షి గుత్తికొండ, నటించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తేలుకుందాం.

 

కథ :

 

ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అత్తా కోడలి గొడవతో మొదలవుతుంది. కోడలు రాణి (దక్షి గుత్తికొండ) అత్త లక్ష్మి తీరు పై రగిలిపోయి.. భర్తతో పుట్టింటికి వెళ్లిపోవడానికి రెడీ అవుతొంది. అంతలో మామయ్య (శ్రీకాంత్ అయ్యంగార్)కి ఫోన్ వస్తోంది. కరోనా కారణంగా లాక్ డౌన్ పెట్టారని. ఇక అప్పటి నుండి ఇంటికే పరిమితం అవుతుంది మొత్తం కుటుంబం. ఈ క్రమంలో కూతురు శాంతి ( సోనియా ఆకుల) కరోనా వచ్చిందనే అనుమానం రావడంతో కుటుంబ సభ్యుల మధ్య మొదలైన డ్రామాలో కొడుకు కార్తీక్ (వంశీ చాగంటి) పాత్ర ఏమిటి ? చివరకు కరోనా భయంతో ఈ ఫ్యామిలీ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది ? అసలు కరోనా వల్ల ఈ ఫ్యామిలీ ఏం నష్టపోయింది ? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

 

ప్లస్ పాయింట్స్ :

 

ప్రపంచ దేశాలను వణికించిన కరోనా సృష్టించిన కలకలంలో ఒకే కుటుంబంలోని వ్యక్తుల మధ్య ఏర్పడిన సంఘర్షణనే కథా వస్తువుగా తీసుకుని తీసిన ఈ సినిమాలో శ్రీకాంత్‍ అయ్యంగార్‍, వంశీ చాగంటి, సోనియా ఆకుల నటన ఆకట్టుకుంటుంది. ఇక కరోనా పై భయానికి సంబంధించిన సన్నివేశాలలో వాస్తవికతను చూపించే ప్రయత్నం చేయడం బాగుంది.

ఇక మిగిలిన నటీనటుల పర్వాలేదు. ఇక దర్శకుడు ప్రతి పాత్రకూ ప్రాధాన్యం ఇవ్వడానికి బాగానే కష్టపడ్డాడు. కెమెరా యాంగిల్స్ అండ్ అక్కడక్కడా నేపథ్య సంగీతం సినిమాలో రేర్ ప్లస్ పాయింట్స్ గా నిలుస్తాయి.

దక్షి గుత్తికొండ తన పాత్రలో అద్భుతంగా నటించింది. తన పాత్రలోని వెరీయేషన్స్ కి తగ్గట్లు ఆమె పలికించిన ఎక్స్ ప్రెషన్స్ చాలా బాగున్నాయి. ఈ చిత్రానికి ఆమె బాగా ప్లస్ అయింది. భవిష్యత్తులో ఆమె నుంచి మంచి పాత్రలను ఆశించోచ్చు.

 

మైనస్ పాయింట్స్ :

 

మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే.. ఒక్క మాటలో మొత్తం మైనసే. వివాదాస్పద అంశాలతో దర్శకుడిగా నిర్మాతగా నెట్టుకొస్తోన్న రాంగోపాల్ వర్మ, కరోనా వైరస్ మెయిన్ కంటెంట్ అంతా ట్రైలర్ లోనే చూపించేసాడు, అంతకు మించి సినిమాలో ఇంకేమి లేదు. జనం వీక్ నెస్ ను క్యాష్ చేసుకోవటానికి మళ్ళీ కరోనా అంటూ ఈ సినిమా అందించాడు గానీ, ఈ సినిమాలో ఆకట్టుకునే ఒక్క సన్నివేశం లేదు.

పైగా ప్రతి సీన్ కథలోనే ఉంటుందిగాని, ఏ సీన్ కూడా స్క్రీన్ ప్లేను మాత్రం పరుగులు పెట్టించదు. ఇక ఈ సినిమా కథాకథనాలలోని మెయిన్ కాన్ ఫ్లిట్ ను పూర్తిగా వదిలేసి, అనవసరమైన ల్యాగ్ సీన్స్ తో సినిమాని నింపడం, దీనికి తోడు బలం లేని స్క్రిప్ట్ లో బలహీన సీన్స్ ను సృష్టించి సినిమా మీద ఎలాంటి ఇంట్రస్ట్ కలగకుండా మన సహనాన్ని పూర్తిగా నీరుగార్చాడు.

అసలు.. ఇలాంటి సినిమాలను తీయాలనే ఆలోచన రామ్ గోపాల్ వర్మకు ఎందుకొస్తున్నాయో.. ఆర్జీవీ ఎలాంటి జిమ్మిక్కులు చేసినా ఇక వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే ఈ సినిమాతో ఆర్జీవీ అనే బ్రాండ్ కి పెద్ద బ్యాండ్ పడిపోయినట్టే.
సాంకేతిక విభాగం :

 

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు అగస్త్య మంజు దర్శకుడిగా ఒకటి రెండు చోట్ల పర్వాలేదనిపించినా.. పూర్తిగా విఫలం అయ్యాడు. సంగీత దర్శకుడు అందించిన పాట అండ్ నేపథ్య సంగీతం కూడా బాగాలేదు. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాలో చాల వరకు బోర్ తగ్గేది. సినిమాలో సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. కొన్ని విజువల్స్ ను చాలా సహజంగా చూపించారు. ఇక నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు గురించి మాట్లాడుకోవడం వేస్ట్.

 

తీర్పు :

 

మొత్తంమీద, కరోనా వైరస్ అంటూ ఆర్జీవీ అందించిన ఈ అత్యంత దిగువ స్థాయి చిత్రాన్ని చూడకపోవడమే ఉత్తమైన పని. అసలు ఈ సినిమాలోని కంటెంట్ కంటే… న్యూస్ ఛానెల్స్ లోని న్యూస్ ఇంకాస్త ఇంట్రస్ట్ గా ఉంటుంది. పైగా వర్మ, అలాగే అగస్త్య మంజు కలిసి అందించిన ఈ సినిమాలో కథాకథనాలతో పాటు మిగిలిన సాంకేతిక విభాగం కూడా ఏ మాత్రం ఆకట్టుకోలేదు. చివరిగా ఈ సినిమా ఏ వర్గం ప్రేక్షకులకు నచ్చదు.

123telugu.com Rating : 1.75/5
Reviewed by 123telugu Team

Click Here For English Review

 

Exit mobile version