సమీక్ష: “క్రేజీ ఫెలో” – పర్వాలేదనిపించే కామెడీ డ్రామా

సమీక్ష: “క్రేజీ ఫెలో” – పర్వాలేదనిపించే కామెడీ డ్రామా

Published on Oct 15, 2022 3:04 AM IST
Crazy-Fellow-Movie-Review-In-Telugu

విడుదల తేదీ : అక్టోబర్ 14, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: ఆది సాయి కుమార్, దిగంగన సూర్యవంశీ, మిర్నా మీనన్, సప్తగిరి

దర్శకత్వం : ఫణి కృష్ణ సిరికి

నిర్మాతలు: కె కె రాధామోహన్

సంగీతం: ఆర్ ఆర్ ధృవన్

సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల

ఎడిటర్: సత్య గిడుతూరి

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

 

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆది సాయి కుమార్ తన కెరీర్ లో డిఫెరెంట్ జోనర్ లలో, డిఫెరెంట్ చిత్రాలు చేస్తూ బిజిగా దూసుకు పోతున్నారు. ఆది హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ క్రేజీ ఫెలో నేడు థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అది ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.

 

కథ:

 

హీరో నాని (ఆది సాయి కుమార్) తన జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తూ గడుపుతాడు. డేటింగ్ యాప్ లో చేరిన నాని, చిన్ని (దిగంగన సూర్యవంశీ) అనే అమ్మాయి కి అట్రాక్ట్ అవుతాడు. చిన్ని కూడా నాని తో ప్రేమ లో పడిపోతుంది. సమయం గడుస్తున్న కొద్ది వీరిద్దరూ మీట్ అవ్వాలని అనుకుంటారు. నాని అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ చిన్ని (మిర్నా మీనన్) కి ప్రపోజ్ చేయడం జరుగుతుంది. నాని ఎందుకు తన ప్లాన్ మార్చుకున్నాడు? చిన్ని (దిగంగన సూర్యవంశీ) ఏమైంది? చివరికి నాని ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అనేది తెలియాలంటే సినిమా వెండితెర పై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

 

గత చిత్రాలతో పోల్చితే ఆది సాయి కుమార్ ఈ క్రేజీ ఫెలో చిత్రం తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో చాలా అందం గా కనిపిస్తున్నాడు. మంచి హెయిర్ స్టైల్, యంగ్ లుక్ తో స్క్రీన్ మీద చాలా బాగున్నాడు. తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ఎప్పుడూ ఆకట్టుకొనే ఆది, ఈ సినిమా లో నాని పాత్రలో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో మరింత గా ఆకట్టుకున్నాడు.

దిగంగన సూర్యవంశీ ఈ చిత్రం లో మంచి పాత్రలో నటించింది. ఎమోషనల్ సన్నివేశాల్లో దిగంగన చాలా చక్కని నటన కనబరిచి ఆకట్టుకుంది. ఈ చిత్రం లో నటించిన ఇతర నటీనటులు చాలా చక్కని నటన కనబరిచారు. హీరోకి సోదరుడు గా నటించిన అనీష్ కురువిల్లా చాలా డీసెంట్ గా కనిపించారు. సెకండ్ లేడీ లీడ్ లో నటించిన మిర్నా మీనన్ నటన పర్వాలేదు అనిపించింది.

క్రేజీ ఫెలో చిత్రం లో తమిళ నటి నందిని మరియు నర్రా శ్రీను ల పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి. వీరిద్దరూ కీలక పాత్రల్లో నటించి, చాలా బాగా ఆకట్టుకున్నారు. నర్రా శ్రీను మరియు ఆది మధ్యలో వచ్చే సన్నివేశాలు కామెడీ గా ఉండి, ఫన్ జెనరేట్ చేస్తాయి. తేజ కూడా ఈ చిత్రం లో మంచి రోల్ చేసి ఆకట్టుకున్నారు.

ఈ చిత్రం లో ఆకట్టుకునే మరొక అంశం ఏదైనా ఉంది అంటే అది కామెడీ అని చెప్పాలి. సినిమా లో ఉండే సస్పెన్స్ తో పాటుగా, ట్రయాంగిల్ లవ్ స్టొరీ ను డైరెక్ట్ చేసిన విధానం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ చాలా బాగుంది.

 

మైనస్ పాయింట్స్:

 

ఈ సినిమా స్టోరీ లైన్ ఎంటి అనేది ఊహించే విధంగా ఉండటం మాత్రమే కాకుండా, కొన్ని రిపీటెడ్ సన్నివేశాలు ఫస్ట్ హాఫ్ లో ఉన్నాయి. నాని పాత్రలో ఆది ను ఇంట్రడ్యూస్ చేసిన విధానం కాస్త ఓవర్ గా అనిపిస్తుంది.

రొమాంటిక్ సన్నివేశాలు, ఎమోషన్స్ విషయాల్లో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది. సెకండ్ హీరోయిన్, హీరోతో ప్రేమలో పడే విధానం అంతగా ఆకట్టుకోదు. అంతా చాలా ఫాస్ట్ గా జరిగిపోతుంది. సరైన డెప్త్ ఉండే విధంగా లవ్ సన్నివేశాలు లేకపోవడం వంటి అంశాలు సినిమా కథ పై ప్రభావం చూపాయి.

అంతకుముందు అనేక సినిమాల్లో చూసిన కొన్ని సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ స్లో గా సాగడం ఉంది. సెకండ్ లో అది కాస్త అర్థ వంతం గా ఉంటుంది.

 

సాంకేతిక విభాగం:

 

RR దృవన్ ఈ చిత్రానికి అందించిన సంగీతం చాలా బాగుంది. ఈ చిత్రం నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఈ చిత్రం లోని డైలాగ్స్ ఫన్ ను జెనరేట్ చేసే విధంగా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగున్నాయి.

డైరెక్టర్ ఫణి కృష్ణ విషయానికి వస్తే, ఈ చిత్రం ను డీల్ చేసిన విధానం బాగుంది. కథ ను చూపించిన విధానం, నటీనటులను ఉపయోగించుకున్న విధానం తో సినిమా ను చూసేలా చేయగలిగారు.

 

తీర్పు:

 

మొత్తమ్మీద చూసుకుంటే, క్రేజీ ఫెలో అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ట్రయాంగిల్ లవ్ స్టొరీ, ఫన్, పెర్ఫార్మెన్స్ లు పర్వాలేదు అని అనిపిస్తాయి. ఈ చిత్రం స్లో గా స్టార్ట్ అవుతుంది. అయితే ఆది గత చిత్రాలతో పోల్చితే ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లని ఇష్టపడే వారు ఈ చిత్రాన్ని ఒకసారి చూడవచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు