విడుదల తేదీ : ఆగష్టు 31, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : అరుణ్ విజయ్ , మహిమ నంబియార్ , వంశీ కృష్ణ , తంబీ రామయ్య
దర్శకత్వం : అరవగన్ వెంకటాచలం
నిర్మాత : ప్రసాద్ ధర్మి రెడ్డి
సంగీతం : విశాల్ చంద్రశేఖరన్
సినిమాటోగ్రఫర్ : భాస్కరన్
తమిళ నటుడు అరుణ్ విజయ్ నటించిన సూపర్ హిట్ చిత్రం కుట్రం 23 ని తెలుగులో ‘క్రైమ్ 23’తో పేరుతో అనువదించారు. ఈరోజు విడుదలైన ఈ చిత్రం ఎలా వుందో ఇప్పుడు చూద్దాం.
కథ :
ఈచిత్ర కథ చర్చ్ ఫాదర్ మరియు ప్రెగ్నెంట్ జెస్సికా అనుమానాస్పద హత్యలతో మొదలవుతుంది. ఈకేసు ను ఇన్వెస్టిగేట్ చేయడానికి సిటీ అసిస్టెంట్ కమిషనర్ అయినా అరుణ్ విజయ్ ను నియమిస్తారు. ఇన్వెస్టిగేట్ చేస్తున్న క్రమంలో ఈ హత్యలు మెడికల్ మాఫియా తో సంభంధం ఉందని తెలుసుకుంటాడు విజయ్. అసలు ఎవరు ఈ మెడికల్ మాఫియా ? ఎందుకుప్రెగ్నెంట్ లేడీ ని టార్గెట్ చేస్తారు ? ఈ కేసును విజయ్ ఎలా పరిష్కరించాడనేదే మిగితా కథ.
ప్లస్ పాయింట్స్ :
పోలిస్ పాత్రలో అరుణ్ విజయ్ అద్భుతంగా నటించాడు. పాత్రకు తగ్గ బాడీ లాంగ్వేజ్ తో లుక్స్ పరంగా ఆకట్టుకుంటూ ప్రేక్షకులను మెప్పించాడు. యువ హీరోయిన్ మహిమ నంబియార్ తన పాత్ర మేర చక్కగా నటించింది. ఇక ప్రముఖ నటి అభినయ తనకు లభించిన ముఖ్య పాత్రలో నటన తో మెప్పించింది. ముఖ్యంగా సినిమాలో వచ్చే ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది. దర్శకుడు మెడికల్ మాఫియా అనే పాయింట్ ను డీల్ చేసిన విధానం బాగుంది.
మైనస్ పాయింట్స్ :
ఆసక్తికరమైన పాయింట్ తో కథను రాసుకున్న దర్శకుడు దానికి తగ్గ వేగం తో కథను తెరకెక్కించలేకపోయాడు. స్లో నరేషన్ ఈచిత్రంలో ప్రధాన మైనస్ అని చెప్పొచ్చు. కథలో వేగం తగ్గకుండా ఉండి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేదే. సినిమా అంతా సీరియస్ నోట్ లో సాగడంతో ఎంటెర్టైనెర్మెంట్ కరువయ్యింది. మంచి పాయింట్ ను ఎంచుకున్న దర్శకుడు ఇంకా ఈ చిత్రాన్ని బాగా తెరకెక్కించే అవకాశం వున్నా ఆ ఛాన్స్ ను వినియోగించుకోలేక పోయాడు.
సాంకేతిక వర్గం :
ఇలాంటి ఒక మెడికల్ మాఫియా నేపథ్యంలో కథను ఎంచుకున్న దర్శకుడిని అభినదించాల్సిందే. ఆయన ఐడియాలు బాగున్నాయి కానీ వాటికీ కమర్టియల్ అంశాలు జోడిస్తేనే ప్రేక్షకులు ఇంకా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఈవిషయంలో ఆయన ఫెయిల్ అయ్యాడు. భాస్కరన్ అందించిన సినిమాటోగ్రపీ చిత్రానికి హైలైట్ గా నిలిచింది. విశాల్ చంద్రశేఖరన్ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యం గా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నారు. భువన్ శ్రీనివాస్ ఎడిటింగ్ బాగుంది. లిమిటెడ్ బడ్జెట్ లో నిర్మించిన ఈచిత్రం మంచి క్వాలిటీతో తెరకెక్కింది.
తీర్పు :
ఇన్వెస్టిగేటింగ్ థ్రిల్లర్ తో వచ్చిన ఈ క్రైమ్ 23 చిత్రం వైద్య వ్యవస్థలోని చీకటి కోణాల్ని ఆసక్తికరంగా చూపెట్టింది. కథలోని పాయింట్ బాగున్నా చాలా చోట్ల కథనం నెమ్మదించడం తో ప్రేక్షకులను చికాకు గురిచేస్తుంది. ఇక చివరగా థ్రిల్లర్ సినిమాలను ఇష్ట పడే వారికీ ఈచిత్రం నచ్చుతుంది.
123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team