సమీక్ష : కస్టడీ – అక్కడక్కడ మెప్పించే యాక్షన్ డ్రామా!

సమీక్ష : కస్టడీ – అక్కడక్కడ మెప్పించే యాక్షన్ డ్రామా!

Published on May 13, 2023 1:06 AM IST
Custody Movie Review In Telugu

విడుదల తేదీ : మే 12, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: నాగ చైతన్య అక్కినేని, కృతి శెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్ జీ అమరెన్, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్

దర్శకులు : వెంకట్ ప్రభు

నిర్మాతలు: శ్రీనివాస చిట్టూరి

సంగీత దర్శకులు: ఇళయరాజా, యువన్ శంకర్ రాజా

సినిమాటోగ్రఫీ: ఎస్ఆర్ కతీర్ ఐఎస్ సి

ఎడిటర్: వెంకట్ రాజన్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

నాగచైతన్య ‘కస్టడీ’ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో చూద్దాం..

 

కథ :

 

శివ (నాగ చైతన్య) ఒక సిన్సియర్ కానిస్టేబుల్. డ్యూటీ అంటే ప్రాణం పెడతాడు. మరోవైపు రేవతి (కృతి శెట్టి) తో ప్రేమలో ఉంటాడు. రేవతి కూడా శివని ప్రాణంగా ప్రేమిస్తోంది. అయితే, కులాలు వేరు కావడంతో రేవతి ఇంట్లో శివతో పెళ్లికి ఒప్పుకోరు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో రాజు (అరవింద్ స్వామి), సీబీఐ ఆఫీసర్ జార్జ్ (సంపత్ రాజ్)ను అరెస్ట్ చేసి స్టేషనుకు తీసుకొస్తాడు శివ. మరోవైపు రాజును చంపాడనికి పోలీస్ కమీషనర్ నటరాజన్ (శరత్ కుమార్) సహా ఏకంగా పోలీస్ ఫోర్స్, రౌడీలు రంగంలోకి దిగుతారు. అసలు ఈ రాజు ఎవరు?, రాజును ఎలాగైనా సిబిఐ కి అప్పగించాలని శివ ఎందుకు బలంగా ప్రయత్నం చేస్తాడు ?, ఈ ప్రయాణంలో శివకి ఎదురైన సవాళ్లు ఏమిటి? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

నాగచైతన్య తన కెరీర్ లో ఒక ఛాలెంజ్ గా ఈ సినిమాలోని శివ పాత్రలో నటించాడు. పైగా తన గత సినిమాల్లో కంటే ఈ సినిమాలో నాచైతన్య చాలా సెటిల్డ్ గా నటించాడు. ఇటు హీరోయిన్ కృతి శెట్టి తో ప్రేమ సన్నివేశాల్లో గాని, అటు యాక్షన్ సన్నివేశాల్లో గాని నాగచైతన్య నటన బాగుంది. హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి తన నటనతో ఆకట్టుకుంది. కొన్ని చోట్ల సందర్భానుసారంగా ఆమె పలికించిన హావభావాలు మరియు ఆమె నటన బాగుంది.

ఈ చిత్రానికి మరో ప్రధానాకర్షణ అరవింద్ స్వామి. నమ్మిందే న్యాయం అనుకుని అతని చేసే క్రైమ్ లో కూడా కామెడీ పడిస్తూ అరవింద్ స్వామి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అరవింద్ స్వామి పలికిన కొన్ని డైలాగ్స్ కూడా పేలాయి. పోలీస్ కమీషనర్ నటరాజన్ గా శరత్ కుమార్ నటన బాగుంది. అలాగే ప్రియమణి, సంపత్ రాజ్, ప్రేమ్ జీ అమరెన్, ప్రేమి విశ్వనాథ్ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

ముఖ్యంగా వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని కీలక సన్నివేశలను దర్శకుడు వెంకట్ ప్రభు చాలా బాగా తెరకెక్కించాడు. ఇంటర్వెల్ సీక్వెన్స్ తో పాటు చేజింగ్ సీన్స్ ను, మరియు పాత్రలను డిజైన్ చేసిన విధానం బాగుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

కస్టడీ లో మెయిన్ కంటెంట్ అండ్ పాయింట్ బాగున్నా.. ట్రీట్మెంట్ విషయంలో కొన్ని చోట్ల స్లో అనిపించింది. దీనికితోడు దర్శకుడు వెంకట్ ప్రభు సెకండ్ హాఫ్ కథనం విషయంలో రాజీపడకుండా ఉండి ఉంటే బాగుండేది. ముఖ్యంగా సెకండాఫ్ లో సినిమా జరుగుతున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను ఇంకా పెంచగలిగే స్కోప్ ఉన్నపటికీ దర్శకుడు వెంకట్ ప్రభు ఆ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేదు.

అలాగే సెకండ్ హాఫ్ ను కాస్త ఎమోషనల్ గా నడుపుదామని మంచి ప్రయత్నం చేశారు గాని, కొన్ని చోట్ల అది స్క్రీన్ మీద ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు. అలాగే చాలా చోట్ల లాజిక్స్ కూడా లేకుండా ప్లేను డ్రైవ్ చేశారు. దీనికి తోడు కథ కూడా సింపుల్ గా ఉండటం, చివరకు ఏం జరుగుతుంది అనేది ప్రేక్షకులకు ముందే అర్థం అయిపోతుండటంతో సినిమాలో ఇంట్రెస్ట్ మిస్ అయింది.

 

సాంకేతిక విభాగం :

 

మంచి పాయింట్ ను తీసుకున్నా.. ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోవడంలో, దాన్ని ఇంకా ఉత్కంఠభరితంగా తెరకెక్కించడంలో వెంకట్ ప్రభు పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే, ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక టీమ్ పనితనం బాగుంది. సన్నివేశాలకు అనుగుణంగా సాంకేతిక వర్క్ సాగింది. సంగీత దర్శకులు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం బాగుంది. ఎస్ఆర్ కతీర్ ఐఎస్ సి సినిమాటోగ్రఫీ కూడా మెచ్చుకునేలా సాగింది. ఎక్కడా బ్యూటీ తగ్గకుండా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దారు ఆయన. శ్రీనివాస చిట్టూరి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

 

తీర్పు :

 

కస్టడీ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో.. మెయిన్ పాయింట్ తో పాటు కొన్ని యాక్షన్ అండ్ కామెడీ సీన్స్ బాగున్నాయి. ఐతే, కథ సింపుల్ గా ఉండటం, స్క్రీన్ ప్లే కూడా స్లోగా సాగడం, అలాగే లాజిక్ లెస్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. అయితే, సినిమాలో చైతన్య యాక్టింగ్ తో పాటు మిగిలిన స్టార్ కాస్టింగ్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. ఓవరాల్ గా ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా, సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు