సమీక్ష : “దర్జా” – బోర్ గా సాగే రొటీన్ కథా చిత్రం

Darja Movie Review

విడుదల తేదీ : జులై 22, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: అనసూయ భరద్వాజ్, సునీల్, అక్సాఖాన్, షఫీ, రవి పైడిపాటి, షకలక శంకర్, షమ్ము

దర్శకత్వం : సలీమ్ మాలిక్

నిర్మాతలు: శివశంకర్ పైడిపాటి

సంగీత దర్శకుడు: రాప్ రాక్ షకీల్

సినిమాటోగ్రఫీ: నిక్సన్

ఎడిటర్: ఎంఆర్ వర్మ


ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో ప్రముఖ యాంకర్ మరియు నటి అనసూయ భరద్వాజ్ మరియు సునీల్ లు కీలక పాత్రల్లో నటించిన చిత్రం “దర్జా” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

ఇక కథలోకి వచ్చినట్టు అయితే.. కనక మహా లక్ష్మి(అనసూయ భరద్వాజ్) బందరులో అక్రమంగా గుడుంబా దందా చేస్తూ తన దారికి అడ్డొస్తే ఎవరినైనా చంపేస్తూ కనిపిస్తుంది. కాగా ఈమెకి ఇద్దరు తమ్ముళ్లు గణేష్(అరుణ్ వర్మ) అలాగే రంగా(సమ్ము) లు తమ ప్రేమలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఇద్దరిలో ఓ తమ్ముడు అనుకోని రీతిలో హత్యకి గురవుతాడు. ఇక ఈ షాకింగ్ ఇన్సిడెంట్ తో అనసూయ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఈ కేసులో ఏసీపీ గా వచ్చినటువంటి పైడి పాటి(సునీల్) ఎలా ఈ కేసు ని సాల్వ్ చేస్తాడు? ఇంతకీ ఈ మర్డర్ వెనక ఉంది ఎవరు అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.

 

ప్లస్ పాయింట్స్ :

మెయిన్ లీడ్ గా ఈ సినిమాలో కనిపించే అనసూయ తన కెరీర్ లో కొంచెం సెలెక్టెడ్ పాత్రలనే ఎందుకు ఎంచుకుంటుందో ఈ సినిమాతో కూడా చూపించింది. తనలోని గ్లామ్ ని మాత్రమే కాకుండా తనలోని నటిని కూడా ఎప్పటికప్పుడు కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నంలో ఈ సినిమాకి తీసుకున్న అటెంప్ట్ కూడా ఆమె నుంచి మెప్పిస్తుంది. ఇంకా ఈ సినిమాలో ఆమె నటన గాని స్క్రీన్ ప్రెజెన్స్ గాని బావున్నాయి.

అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండాఫ్ లో కొన్ని ఎలిమెంట్స్ బాగున్నాయి. ఇక ఈ సినిమాలో మరో పెద్ద ఎస్సెట్ ఎవరన్నా ఉన్నారు అంటే అది సునీల్ అని చెప్పాలి. పోలీస్ ఆఫీసర్ గా ఈ సినిమాలో ఎంటర్ అయ్యాక తన పెర్ఫామెన్స్ తో సినిమాకి ప్రధాన బలంగా నిలిచాడు. అలాగే తనపై యాక్షన్ సీక్వెన్స్ లు గాని కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ బాగుంటాయి.

 

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ఆడియెన్స్ కి బోర్ కొట్టించే అంశాలు మాత్రం చాలా ఎక్కువే ఉంటాయని చెప్పాలి. సినిమా కథనంలోనే చాలా వరకు లోపాలు కనిపిస్తాయి. చాలా వరకు ఏమంత ఆకట్టుకునే నేరేషన్ ఎక్కడా కనిపించదు. సినిమా మెయిన్ స్టోరీ లోకి వెళ్ళడానికి కూడా చాలా సమయం పట్టడం ఆ గ్యాప్ లో కనిపించే సీన్స్ కూడా అంత ఎంగేజింగ్ గా ఉండకపోవడం డిజప్పాయింట్ చేస్తాయి.

అలాగే సినిమాలో కనిపించే లవ్ ట్రాక్స్ మరింత బోర్ తెప్పిస్తాయి. ఇక ఎమోషనల్ సీన్స్ గాని నవ్వు తెప్పించని కామెడీ కానీ సినిమాలో ఎక్కడా ఆడియెన్స్ అటెన్షన్ ని పట్టుకోలేవు. అలాగే బోర్ తెప్పించే సన్నివేశాలు అన్నిటినీ కూడా తగ్గించేసి ఉండాల్సింది. మరి వీటన్నిటితో పాటుగా స్టార్టింగ్ లో చాలా సబ్ ప్లాట్స్ చూపించడం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. మరి వీటితో సినిమా అనుకున్న స్థాయి ఫలితాన్ని అందుకోకపోవచ్చు.

 

సాంకేతిక విభాగం :

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు పర్వాలేదని చెప్పొచ్చు. ఇక సాంకేతిక నిపుణుల పని తీరుకు వస్తే రాప్ రాక్ ఇచ్చిన సంగీతం ఓవరాల్ గా బాగుంది. ఇంకా సినిమాటోగ్రాఫర్ పని తీరు బాగుంది. ఎడిటింగ్ వర్క్ మాత్రం బాగోలేదు చాలా వరకు అనవసర సీన్స్ తగ్గించేస్తే బాగుండేది.

ఇక దర్శకుడు సలీం మాలిక్ విషయానికి వస్తే దర్శకునిగా తాను పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయారని చెప్పాలి. కొన్ని కొన్ని చోట్ల పర్వాలేదు గాని సినిమాని పూర్తి స్థాయిలో ఎంగేజింగ్ గా మలచడంలో అయితే తాను విఫలం అయ్యారని చెప్పక తప్పదు. బోరింగ్ నేరేషన్, సాగదీసే సన్నివేశాలు చాలావరకు ఆడియన్స్ సహనానికి పరీక్ష పెడతాయి.
 

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “దర్జా” చిత్రం లో అనసూయ అలాగే నటుడు సునీల్ పాత్రలు వాటిలో వారి నటన లు మెప్పిస్తాయి కానీ సినిమాలో ఏమాత్రం కొత్తదనం లేని కథ అలాగే కథనాలు ఆడియెన్స్ లో బోర్ ఫీల్ ని తెప్పిస్తాయి. ఏవో అక్కడక్కడా కొన్ని సీన్స్ తప్పితే పెద్దగా చెప్పుకోడానికి సినిమాలో ఏమీ లేదు. అవుట్ డేటెడ్ కామెడీ, డ్రామాతో దర్శకుడు పెద్దగా మెప్పించలేకపోయారు. మరి రాబోయే రోజుల్లో దర్జా మూవీ ఎంత మేర ఆడియన్స్ ని ఆకట్టుకుని ముందుకు సాగుతుందో చూడాలి.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version