విడుదల తేదీ : డిసెంబర్ 23, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు: రవితేజ, శ్రీలీల, జయరామ్, పవిత్రా లోకేష్, రావు రమేష్, తనికెళ్ళ భరణి, సచిన్ ఖేడేకర్, తులసి, అలీ, హైపర్ ఆది, ప్రవీణ్ తదితరులు
దర్శకుడు : త్రినాధరావు నక్కిన
నిర్మాత: టి.జీ. విశ్వ ప్రసాద్
సంగీత దర్శకులు: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
ఎడిటర్: ప్రవీణ్ పూడి
సంబంధిత లింక్స్: ట్రైలర్
మాస్ మహారాజా రవితేజ హీరోగా, త్రినాథ రావు నక్కిన దర్శకత్వం లో తెరకెక్కిన ధమాకా చిత్రం నేడు థియేటర్ల లో విడుదల అయ్యింది. రిలీజ్ కి ముందు ప్రచార చిత్రాలతో మంచి బజ్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.
కథ:
మాస్ మహారాజా రవితేజ (ఆనంద్) గా, (స్వామి) గా డ్యుయల్ రోల్ లో నటించారు. సచిన్ ఖేద్కర్ మరియు తులసి ల కుమారుడు రవితేజ (ఆనంద్) బిజినెస్ మ్యాన్ గా, తనికెళ్ళ భరణి మరియు తులసి ల కుమారుడు రవితేజ (స్వామీ) కామన్ మ్యాన్ గా సినిమాలో కనిపిస్తారు. శ్రీలీల (ప్రణవి) రావు రమేష్ కి కూతురు గా నటించింది. తనకు ప్రపోజ్ చేసిన స్వామి కి ఓకే చెప్పేలోగా, తన తండ్రి ఆనంద్ ను పరిచయం చేస్తాడు. జయరామ్ నెగటివ్ షేడ్స్ లో ఇతరుల బిజినెస్ ను ఆక్రమించే విలన్ గా నటించారు. జయరాం కన్ను సచిన్ ఖేద్కర్ యొక్క పీపుల్ మార్ట్ కంపెనీ పై పడుతుంది. అయితే జయరామ్ సచిన్ ఖేద్కర్ కంపెనీ ను దక్కించుకుంటారా? దాన్ని అడ్డుకోవడానికి రవితేజ ఏం చేశాడు? శ్రీ లీల ఎవరికి ఓకే చెబుతుంది లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే వెండితెర పై సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
సినిమాకి ముందుగా ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది హీరో రవితేజ నే. సినిమాను మొదటి నుండి చివరి వరకు తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ఆక్ట్టుకున్నాడు. డైరెక్టర్ తను చెప్పాలనుకున్న విషయాన్ని చాలా క్లియర్ గా చూపించారు. కథ ను మొదటి నుండి చివరి వరకు ఎలాంటి డీవియేషన్ లేకుండా చాలా బాగా హ్యాండిల్ చేశారు.
సినిమాలో శ్రీలీల కి ఫుల్ లెంగ్త్ రోల్ ఇచ్చారు. శ్రీలీల నటన సినిమాలో బాగుంది. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. అందం గా కనిపిస్తూనే, హీరో రవితేజ పక్కన అద్దిరిపొయే మాస్ స్టెప్పులు వేసింది. సినిమా కి మరొక ప్లస్ పాయింట్ మ్యూజిక్. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాలో చాలా బాగున్నాయి.
సినిమాలో కీలక పాత్రల్లో నటించిన సచిన్ ఖేద్ఖర్, జయరామ్, హైపర్ ఆది, ప్రవీణ్, పవిత్రా లోకేష్, తులసి, ఇతరుల నటన ఆకట్టుకుంది. సినిమాలో పంచ్ డైలాగులు, కామెడీ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్, ఫైట్స్ చాలా ప్లస్ అయ్యాయి.
మైనస్ పాయింట్స్:
సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగిన స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల బెడిసి కొట్టింది. సెకండ్ హాఫ్ లో కథ సీరియస్ గా సాగే టైమ్ లో లాజిక్ లేకుండా కొన్ని సన్నివేశాలు వస్తాయి. అక్కడ స్టోరీ కొంచెం ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది.
కొన్ని సన్నివేశాలకి కనెక్టివిటీ అనేది క్లియర్ గా కనిపించదు. జయరామ్ ను నెగటివ్ రోల్ లో చూపించగా, మిగతా పాత్రలు ఆ ఫ్లో లో వెళ్లిపోతాయి. ఇంకొన్ని సన్నివేశాలు చాలా సీరియస్ గా తీసే అవకాశం ఉంది.
సాంకేతిక విభాగం:
కథ ను ఏమైతే చెప్పాలని అనుకున్నారో, ఆ విషయం లో డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దాదాపుగా విజయం సాధించారు. నటీనటుల నుండి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ను రాబట్టడం లో సక్సెస్ అయ్యారు. టెక్నికల్ టీం లో సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు బాగున్నాయి. కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
ఇక మొత్తంగా చూస్తే మాస్ మహారాజా ఈ చిత్రం తో మళ్ళీ తన ట్రాక్ లోకి వచ్చారు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైన్మెంట్ తో క్లాస్ మరియు మాస్ ఆడియెన్స్ ను ధమాకా ఆకట్టుకుంటుంది. రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, శ్రీలీల గ్లామర్, అలాగే సినిమాలో కామెడీ, పంచ్ డైలాగులు, ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. సెకండాఫ్ లో కొన్ని లాజిక్ లేకుండా వచ్చే సన్నివేశాలు, ల్యాగ్ ను పట్టించుకోకపోతే ఈ వారాంతం సినిమాను థియేటర్ల లో చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team