సమీక్ష : డాన్ 2

సమీక్ష : డాన్ 2

Published on Dec 24, 2011 2:04 AM IST
విడుదల తేది : 23 డిశంబర్ 2011
123 తెలుగు .కామ్ రేటింగ్ : 3.75/5
దర్శకుడు : ఫర్హాన్ అక్తర్
నిర్మాత : ఫర్హాన్ అక్తర్, రితేష్ సిద్ద్వాని
సంగిత దర్శకుడు: శంకర్-ఎహాసన్-లాయి త్రయం
తారాగణం : షారుఖ్ ఖాన్ , ప్రియాంక చోప్రా , లారా దత్త

ఐదు సంవత్సరాల తరువాత ఫర్హాన్ అక్తర్ కథా రచయిత, గాయకుడు,నృత్యం, లాంటి వాటి నుండ తను చేయగలిగిన అత్యుతమయిన పని దర్శకత్వం లోకి తిరిగి వచ్చాడు. 2006 లో అమితాబ్ బచ్చన్ 70 ల లో భారి విజయం సాదించిన చిత్రం డాన్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నపుడు చాల మంది కన్ను ఎగేరేసి చూసారు షారుఖ్ ఖాన్ ఎలా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు అని కాని దాన చిత్రం విడుదలయ్యాక అన్ని అనుమానాలు నివృతి అయిపోయాయి ఆ చిత్రం స్టైలిష్ గ ఉండటమే కాకుండా ఫర్హాన్ అక్తర్ కథ చెప్పిన విధానం అందరిని మెప్పించింది. ఇపుడు ఈ చిత్రం కూడా అద్బుతంగా స్టైలిష్ గా తీసారు ఈ మధ్య కాలం లో వచ్చిన చిత్రాలలో ఒకానొక మంచి చిత్రం.

కథ :

డాన్ 2 మలేసియా లో మొదలవుతుంది ఆసియా మొత్తం డ్రగ్స్ వ్యాపారాన్ని డాన్ చూసుకుంటూ ఉండగా ఐరోపా దేశాలకు తన వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటాడు. దీనితో అక్కడున్న ఐరోపా దేశాల డ్రగ్ వ్యాపారుల హిట్ లిస్టు లో చేరిపోతాడు. అప్పుడు పోలీసు అయిన మాలిక్(ఓం పురి ) మరియు రోమ(ప్రియాంక) లకు లొంగిపోతాడు. జైలు లో తన పాత శత్రువు అయిన వర్ధన్ (బోమన్ ఇరాని) ని కలుసుకుంటాడు. వర్ధన్ ని తనతో కలవటానికి ఒప్పిస్తాడు.. ఇప్పుడు కథ బెర్లిన్ కి మారుతుంది. ఇక్కడే డాన్ ఎన్నో కోట్లతో కూడిన ప్రణాళిక ని అమలు పరుస్తాడు. మిగిలిన చిత్రం ఎలక పిల్లి మద్య దాగుడుమూతల లా ఐరోపా వ్యాపారాలు మరియు డాన్ మద్య సాగుతుంది ఈ ఆట చివరి వరకు మనల్ని ఉత్కంట కలిగిస్తూ ఉంటుంది.

ప్లస్ :

షారుఖ్ డాన్ పాత్రలో అద్బుతంగా నటించాడు డాన్ పాత్రలో ని స్టైల్ మరియు వ్యక్తిత్వాన్ని అద్బుతంగా చూపించాడు. ఫర్హాన్ కథనం లో మంచి సంభాషణలు ఉన్నాయి. షారుఖ్ వర్ధన్ తో గొడవపడే పాత్ర లోను రోమ ని ప్రేమించే పాత్రలో ను సహజంగా కనిపించాడు మిగిలిన పాత్రధారులు కూడా వాళ్ళ పరిధికి సరిపోయేట్టు గ బాగా చేసారు ప్రత్యేకంగా బోమన్ ఇరాని ,ప్రియాంక, లారా దత్తా, నవాబ్ షా లు బాగా నటించారు. చిత్రం లో పోరాట సన్నివేశాలు చాలానే ఉన్నాయి బెర్లిన్ వీధులలో కార్ చేజ్ సన్నివేశం అయితే అద్బుతంగా వచ్చింది ప్రతి పోరాట సన్నివేశం బాగుంది . నేరుగా జరిగే పోరాట సన్నివేశాలను చాల సహజంగా చిత్రీకరించారు. జేసన్ అందించిన సినిమాటోగ్రఫీ చాల అద్బుతంగా వుంది బెర్లిన్ మరియు ఆసియా అందాలను అద్బుతంగా చూపించారు.

మైనస్ :

ఈ చిత్రం లో చెప్పుకోడానికి పెద్దగా లోపాలు లేవు. చిత్రం లో ఐదు పాటలు ఉండాలనుకునే జనం కాస్త నిరాశ చెందుతారు ఎందుకంటే చిత్రం లో ఒకే ఒక పాట ఉంది. రెండవ అర్ధం లో చిత్రం పొడవు కాస్త తగ్గిచ్చుంటే బాగుండేది. అయిన చిత్రం ఎక్కడా బోర్ అనిపించదు.

నా అభిప్రాయం :

ఒక చిత్రానికి కొనసాగింపు తీయటం అంత సులభమయిన విషయం కాదు. మొదటి భాగంలో చిత్ర కథకి భంగం కలగకుండా కొత్తగా తీయాలి ఈ విషయం లో ఫర్హాన్ సఫలం అయ్యాడు డాన్ 2 చిత్రం మలుపుల తో నేర చరిత్ర ని చూపిస్తూ అద్బుతంగా తెరకెక్కించాడు. డాన్ 2 చిత్రానికి డాన్ 1 లాంటి ఒత్తిడి లేదు ఆ చిత్రం అమితాబ్ బచ్చన్ చిత్రానికి రీమేక్ కాబట్టి ఆ చిత్రం మీద ఒత్తిడి ఎక్కువగా ఉండేది.

చివరి మాట :

డాన్ 1 లానే ఇందులో కూడా మరో కొనసాగింపు వస్తుంది అన్నట్టుగా ముగిస్తారు. కాబట్టి మనం ఇంకొక కొనసాగింపు కోసం వేచి చూడచ్చు

ఎకేఎస్

అనువాదం – రv

123తెలుగు.కాం రేటింగ్: 3.75/5

Don 2 Review English Version

సంబంధిత సమాచారం

తాజా వార్తలు