సమీక్ష : “దొంగలున్నారు జాగ్రత్త” – స్లోగా సాగే బోరింగ్ క్రైమ్ డ్రామా !

సమీక్ష : “దొంగలున్నారు జాగ్రత్త” – స్లోగా సాగే బోరింగ్ క్రైమ్ డ్రామా !

Published on Sep 24, 2022 3:02 AM IST
Dongalunnaru Jaagratha Movie Review

విడుదల తేదీ : సెప్టెంబర్ 23, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: సింహా కోడూరి, సముద్రఖని, ప్రీతి అస్రాని

దర్శకత్వం : సతీష్ త్రిపుర

నిర్మాతలు: డి సురేష్ బాబు, సునీత తాటి

సంగీతం: కాల భైరవ

సినిమాటోగ్రఫీ: యశ్వంత్ సి

ఎడిటర్: గ్యారీ బీ హెచ్

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

యంగ్ హీరో సింహ కోడూరి హీరోగా చేసిన లేటెస్ట్ చిత్రమే “దొంగలున్నారు జాగ్రత్త”. దర్శకుడు సతీష్ త్రిపుర తెరకెక్కించిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం….

 

కథ :

 

రాజు (సింహా కోడూరి) ఒక చిల్లర దొంగ. పార్కింగ్ చేసిన కారుల్లో దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఆగి ఉన్న డాక్టర్ చక్రవర్తి (సముద్రఖని) కార్ లో కూడా దొంగ తనానికి వస్తాడు. అయితే, కారులో లాక్ అయిపోతాడు. ఇదంతా డాక్టర్ చక్రవర్తి వేసిన పక్కా స్కేచ్ అని రాజుకి అర్థం అవుతుంది. అనంతరం ఆ కార్ లో నుంచి బయట పడటానికి విశ్వ ప్రయత్నం చేస్తాడు. కానీ.. పెర్ఫెక్ట్ గా లాక్ చేయబడటంతో రాజు ఆ కారులో నుంచి బయట పడలేడు. అసలు డాక్టర్ చక్రవర్తి ఎందుకు రాజును టార్గెట్ చేశాడు?, రాజు గతంలో చేసిన దొంగతనాలు వల్ల ఎవరు నష్టపోయారు ?, ఈ మొత్తం వ్యవహారంలో రాజు భార్య (ప్రీతి అస్రాని) పాత్ర ఏమిటి ?, చివరకు రాజు కథ ఎలా ముగిసింది ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాలో సింహా కోడూరి పోషించిన ప్రధాన పాత్ర అయిన రాజు పాత్ర.. ఆ పాత్రకి సంబంధించిన ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్.. ఇలా మొత్తానికి దొంగలున్నారు జాగ్రత్త సినిమా కాన్సెప్ట్ పరంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సస్పెన్స్ టోన్ తో సాగే కొన్ని సీన్స్ అండ్ ఎమోషన్స్ వంటివి బాగానే ఉన్నాయి.

ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన సింహా కోడూరి తన లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా తన పాత్ర మేరకు బాగా మెయింటైన్ చేశాడు. అలాగే తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. అలాగే, కీలక పాత్రలో నటించిన సముద్రఖని కూడా చాలా బాగా నటించాడు. హీరోయిన్ గా చేసిన ప్రీతి అస్రాని కూడా బాగా నటించింది. ఆమె హావ భావాలు కూడా బాగానే అలరించాయి. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

 

దర్శకుడు సతీష్ త్రిపుర మంచి స్టోరీ లైన్ తీసుకున్నా.. దాన్ని ఇంట్రెస్టింగ్ ప్లే తో ఆసక్తికరంగా సినిమాని మలచలేక పోయారు. కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని క్లారిటీగా ఎలివేట్ చేయకుండా పూర్తి సస్పెన్స్ పాయింటాఫ్ వ్యూలో స్క్రీన్ ప్లేని సాగతీయడంతో.. మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కావు. దీనికి తోడు రాజు క్యారెక్టర్ ట్రాక్ కూడా చాలా సింపుల్ గా ఉండటం బాగాలేదు.

కాకపోతే, దర్శకుడు సతీష్ త్రిపుర రాసుకున్న కాన్సెప్ట్, కొన్ని సన్నివేశాలు మరియు క్లైమాక్స్ సీన్స్ బాగున్నప్పటికీ.. కథ కథనాలు మరీ స్లోగా సాగడం అస్సలు బాగాలేదు. ఇక కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా సరిగ్గా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వవు. మొత్తానికి ఈ రెగ్యులర్ ఎమోషనల్ వెరీ వెరీ స్లో క్రైమ్ స్టోరీ ఆకట్టుకో లేకపోయింది. దర్శకుడు సినిమాని ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించలేకపోయాడు.

 

సాంకేతిక విభాగం :

 

సినిమాలో చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు కాల భైరవ నేపథ్య సంగీతం బాగుంది. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. ఒక కార్ లోనే న్యాచురల్ విజువల్స్ తో కెమెరామెన్ చాలా సీన్స్ ను తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంది. ఎడిటింగ్ బాగుంది. ఈ చిత్ర నిర్మాత పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

తీర్పు:

 

‘దొంగలున్నారు జాగ్రత్త’ అంటూ వచ్చిన ఈ క్రైమ్ ఎమోషనల్ సస్పెన్స్ డ్రామాలో మెయిన్ స్టోరీ లైన్ అండ్ కొన్ని సీన్స్ ఆకట్టుకున్నాయి. కానీ, ఈ సినిమా మాత్రం మెప్పించలేకపోయింది. అయితే, సింహా నటన అండ్ కొన్ని భావోద్వేగ సన్నివేశాలు బాగున్నాయి. కానీ, కథ కథనాలు బాగా స్లోగా సాగడం, అలాగే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ పెద్దగా లేకపోవడం, ఇక సెకండ్ హాఫ్ కూడా బోర్ గా సాగడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని బాగా ల్యాగ్ చేయడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చదు.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు