సమీక్ష: ‘దృశ్యం 2’ – తెలుగు చిత్రం అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం

సమీక్ష: ‘దృశ్యం 2’ – తెలుగు చిత్రం అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం

Published on Nov 26, 2021 3:15 AM IST
Oka Chinna Family Story Movie Review In Telugu

విడుదల తేదీ : నవంబర్ 25, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు: వెంకటేశ్, మీనా తనికెళ్ల భరణి, నదియా, నరేశ్, సంపత్ రాజ్, కృతిక, జయకుమార్, ఏస్తర్ అనిల్

దర్శకత్వం : జీతూ జోసెఫ్

నిర్మాతలు: డి. సురేశ్ బాబు, అంటోనీ పెరంబవూర్, రాజ్‌కుమార్ సేతుపతి

సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్

సినిమాటోగ్రఫీ: సతీష్ కురూప్

ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేశ్

విక్టరీ వెంకటేష్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన ‘దృశ్యం’ సినిమాకు సీక్వెల్‌గా “దృశ్యం-2” సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌గా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

 

కథ:

మొదటి భాగం ముగిసిన చోటే కథ మొదలవుతుంది. రాంబాబు (వెంకటేష్), వరుణ్ (నదియా కొడుకు) మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ కింద పూడ్చి పెట్టేసి, ఆ హత్య కేసులో ఎలాంటి క్లూ లేకుండా చేస్తాడు. ఆరేళ్లు గడుస్తున్నా వరుణ్ తల్లిదండ్రులు తమ కొడుకును ఎవరు చంపారో తెలియక చస్తూ బతుకుంటారు. ఈ కేసులో రాంబాబుకు వ్యతిరేకంగా మరిన్ని సాక్ష్యాలను సేకరించి అతనిని అరెస్టు చేయడానికి పోలీస్ ఆఫీసర్ (సంపత్)ని నియమిస్తారు. మరి రాంబాబు తన కుటుంబాన్ని మరోసారి ఎలా రక్షించుకుంటాడు? ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటపడతాడు? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే ప్రైమ్ వీడియోలో ఈ సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

వెంకటేష్ మొదటి భాగంలో ఎక్కడ అయితే కథను ఆపేసాడో అక్కడి నుంచే తిరిగి స్టార్ట్ చేస్తాడు. మొదటి భాగంలో వెంకటేశ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఇందులో కూడా అదే విధంగానే ఉంది. తన కళ్లతో అద్భుతంగా ఎమోషన్స్‌ని పలికిస్తూనే, తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసాడు. మీనా ఈ సారి మంచి స్క్రీన్ స్పేస్‌ని పంచుకోవడంతో తన సపోర్టింగ్ రోల్‌ను పర్ఫెక్ట్‌గా పోషించింది.

అలాగే నరేష్ మరియు నదియా కూడా మరోసారి బాగా నటించారు. రఫ్ కాప్‌గా సంపత్ రాజ్ ఆకట్టుకున్నాడు. అతని బాడీ లాంగ్వేజ్ మరియు ఎక్స్‌ప్రెషన్స్ ఇన్వెస్టిగేటివ్ సినిమా మూడ్‌కి చాలా బాగా సరిపోయాయి. సత్యం రాజేష్‌కి పెద్ద పాత్ర వచ్చింది. అతడు కూడా బాగా ఆకట్టుకున్నాడు.

వెంకీ కూతుళ్లుగా నటించిన యువ నటులు కూడా తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు. సెకండాఫ్‌లో అన్ని యాక్షన్‌లు బాగున్నాయి. స్క్రీన్‌ప్లే మరియు ట్విస్ట్‌లను రివీల్ చేసిన విధానం అద్భుతంగా ఉన్నాయి.

మొదటి భాగం లాగానే దృశ్యం 2లో కూడా ఎమోషనల్ యాంగిల్ చాలా ఎక్కువగానే ఉంది. క్లైమాక్స్ మరియు దాని జస్టిఫికేషన్‌ని దర్శకుడు బాగా ఆలోచించి చూపించడం ఆకట్టుకుంటుంది.

 

మైనస్ పాయింట్స్:

సినిమా స్లో మోషన్‌లో ప్రారంభం కావడం, కాసేపు కథనం నెమ్మదిగా సాగడం వంటి అంశాలు కొందరికి బోరింగ్‌గా అనిపించవచ్చు కానీ ఫస్ట్ హాఫ్‌లో పరిచయం చేసిన పాత్రలకు అసలైన ప్రయోజనం ఏమిటనేది చివరలో తెలుస్తుంది.

దృశ్యం 2 ఖచ్చితంగా అంచనాలను అందుకుంటుంది కానీ మొదటి భాగం కలిగి ఉన్న థ్రిల్స్ సీక్వెల్‌లో కాస్త మిస్సయ్యాయి. వెంకటేష్ పాత్ర కాస్త అమాయకంగా కనిపిస్తుంది. సస్పెన్స్ అంశాలు కొన్ని చోట్ల ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది.

 

సాంకేతిక విభాగం:

దర్శకుడు జీతూ జోసెఫ్ విషయానికి వస్తే అతను సీక్వెల్‌ని చాలా బాగా చేసాడు. సీక్వెల్‌లో అన్ని విషయాలను చాలా సమకాలీనంగా మరియు వాస్తవికంగా చూపించాడు. ఇన్వెస్టిగేషన్‌ సినిమాలో ఎలాంటి స్వేచ్ఛను తీసుకోకుండా డీటైల్డ్‌గా చూపించిన తీరు కూడా బాగుంది. అన్నింటికంటే ఎక్కువగా ఎంతగానో ఎదురుచూస్తున్న క్లైమాక్స్‌ని ముగించిన విధానం కూడా ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది.

ఈ చిత్రంలో అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఆకట్టుకుంది, కొన్ని కీలక ఎమోషన్స్ దగ్గర తాను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచి ఎఫెక్టీవ్ గా కూడా ఉంది.. క్రైమ్ మరియు కాప్ సెటప్ లో సతీష్ కురుప్ కెమెరా పనితనం బాగుంది.. జీతూ జోసెఫ్ స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా ఉంది. ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ ట్విస్ట్‌లను బాగా హ్యాండిల్ చేయడంతో పాటు విజువల్ గా సినిమా అంతటికీ ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా ఉందనే చెప్పాలి.
 

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ‘దృశ్యం 2’ సినిమా ఖచ్చితంగా అన్ని అంచనాలను అందుకుందనే చెప్పాలి. సీక్వెల్‌లో నటీ నటుల సాలిడ్ పెర్ఫార్మెన్స్ మరియు మంచి ట్విస్టులు, ఇంట్రెస్టింగ్‌గా అనిపించే కథనం అన్ని బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదించడం మినహా, ఈ చిత్రం మంచి క్లీన్ అండ్ గ్రిప్పింగ్ ఫ్యామిలీ డ్రామాగా నిలిచింది. ఖచ్చితంగా ఈ వారాంతంలో ప్రైమ్ వీడియోలో ప్రతి ఒక్కరు ఈ సినిమాను వీక్షించవచ్చు.

 

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు