విడుదల తే3ీ : 13 డిసెంబర్ 2014 | ||
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.25/5 | ||
దర్శకత్వం : రమణ మొగిలి |
||
నిర్మాత : బి ఓబుల్ సుబ్బారెడ్డి |
||
సంగీతం : అనిల్ గోపి రెడ్డి |
||
నటీనటులు : వరుణ్ సందేశ్, హరిప్రియ |
గత కొంత కాలంగా సరైన విజయం కోసం ఎదురు చూస్తున్న యువ హీరో వరుణ్ సందేశ్. నేడు ‘ఈ వర్షం సాక్షిగా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వరుణ్ సందేశ్ కు జోడిగా హరిప్రియ నటించిన ఈ సినిమాకు రమణ మొగిలి దర్శకత్వం వహించారు. బి ఓబుల్ సుబ్బారెడ్డి నిర్మాత. మరి, వరుణ్ సందేశ్ కోరుకున్న విజయాన్ని ఈ సినిమా అందించిందా..? లేదా..? ఓ లుక్కేయండి.
కథ :
జై (వరుణ్ సందేశ్) ఎప్పుడూ అమ్మాయిల చేతిలో మోసపోయే ఓ అమాయకపు కుర్రాడు. ఒకరోజు రైలు ప్రయాణంలో మహాలక్షి (హరిప్రియ)ను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఇంటికి చేరుకున్న తర్వాత మహాలక్ష్మికి తన మనసులో ప్రేమను వ్యక్తం చేయాలనే నిర్ణయం తీసుకుంటాడు. వెంటనే మహాలక్ష్మి సొంతూరికి ప్రయాణం అవుతాడు.
మహాలక్షి ఊరికి వెళ్ళిన తర్వాత జైకు ఓ చేదు నిజం తెలుస్తుంది. పెద్ద షాక్ తగులుతుంది. మరెవరో వక్తితో ఇల్లు వదలి వెళ్ళిపోయి తన కుటుంబ సభ్యులను మనోవేదనకు గురి చేస్తుంది. ఇప్పుడు జై ఎం చేశాడు..? మహాలక్షి ఎక్కడుందో తెలుసుకున్నాడా..? జై ప్రేమకథ ఏమైంది..? వంటి ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా.
ప్లస్ పాయింట్స్ :
సినిమాకు బేసిక్ ప్లస్ పాయింట్ వరుణ్ సందేశ్ మరియు అతని నటన. అమాయకపు యువకుడి పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. తన శక్తి సామర్థ్యాలను మేరకు జై పాత్రలో అద్బుత నటన కనబరిచాడు.
సినిమాలో ఫస్ట్ హాఫ్ ఓకే, సరదా సరదా సన్నివేశాలతో ముందుకు వెళ్తుంది. సెకండ్ హాఫ్ లో జబర్దస్త్ గ్యాంగ్ వేణు, ధనరాజ్ మరియు చంద్రలు తమ కామెడీతో పేక్షకులను కాసేపు నవ్వించారు. హీరోయిన్ హరిప్రియ ఆమె పాత్రలో ఒదిగిపోయింది. చాలా అందంగా కనిపించడంతో పాటు సినిమా ఆద్యంతం హీరో వరుణ్ సందేశ్ కు మంచి సపోర్ట్ ఇచ్చింది.
మైనస్ పాయింట్స్ :
పాపం.. వరుణ్ సందేశ్ కు ‘ఈ వర్షం సాక్షిగా’ సినిమాలో ఒక్క అంశం కూడా కలసి రాలేదు. నిరాశకు గురి చేసే కథ, కథనాలతో ‘ఈ వర్షం సాక్షిగా’ సినిమా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. అసలే కాలం చెల్లిన కథ అనుకుంటే, కథనం మరింత ఘోరంగా ఉంది. అనవసరమైన ట్విస్టులు & మలుపులతో సెకండ్ హాఫ్ నిదానంగా సాగుతుంది. సినిమాలో కామెడీ అంతా ఫస్ట్ హాఫ్ కు పరిమితం చేశారు. బోరింగ్ మరియు ఊహించదగిన సన్నివేశాలతో సెకండ్ హాఫ్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
సెకండ్ హాఫ్ లో కూడా దర్శకుడు ప్రేక్షకులను నవ్వించడానికి ప్రయత్నించాడు. కాని, ఆ ప్రయత్నాలు వర్కౌట్ అవ్వలేదు. కామెడీ బిట్స్ గా అయితే చూసి నవ్వుకోవడానికి పర్వాలేదు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలలో ఎమోషన్ ను కామెడీ చెడగొట్టింది. రచయితలు కథను ఆసక్తికరంగా చెప్పడంలో ఫెయిల్ అయ్యారు.
సినిమాలో ప్రతి ట్విస్ట్ ను ప్రేక్షకులు ముందే ఊహించగలరు. ఓ కామెడీ గ్యాంగ్ చుట్టూ కథను నడిపించి గట్టేక్కేద్దాం అని దర్శకనిర్మాతలు భావించారు. అది అసలుకే ఎసరు పెట్టింది. ఆ కామెడీ కాస్త కూడా నవ్వించలేకపోయింది. జీవా ట్రాక్ అయితే ఫూలిష్ గా ఉంది.
సాంకేతిక విభాగం :
మ్యూజిక్ డీసెంట్ గా ఉంది. లిరిక్స్ కూడా బాగున్నాయి. స్క్రీన్ ప్లే అత్యంత నిరాశాజనకంగా మరియు చాలా ఊహాజనితంగా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. కాకపోతే క్లైమాక్స్ లో కొన్ని కామెడీ సన్నివేశాలను కత్తిరించి పారేయాల్సింది.
ఇక, దర్శకుడు రమణ మొగిలి తన భాద్యతను నిర్వర్తించడంలో విఫలమయ్యాడు. సినిమాను ఆసక్తికరంగా ప్రారంభించినా.. ఇంటర్వెల్ తర్వాత దారి తప్పి ఎక్కడికో వెళ్ళిపోయాడు. లాజిక్ లేని సన్నివేశాలు, అనవసర కామెడీ ట్రాక్స్ తో సెకండ్ హాఫ్ ను నింపేశారు. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే.
తీర్పు :
విజయం కోసం వరుణ్ సందేశ్ మరింత కాలం వెయిట్ చేయక తప్పదు. ‘ఈ వర్షం సాక్షిగా’ లాంటి స్క్రిప్ట్ తో సక్సెస్ అందుకోవడం కష్టమే. వరుణ్ సందేశ్ పెర్ఫార్మన్స్, ఫస్ట్ హాఫ్ మాత్రమే సినిమాకు ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. మిగతా సినిమా అంతా చాలా బోరింగ్ గా ఉంది. ఈ సినిమాను చూడాలో..? వద్దో..? మీ నిర్ణయానికే వదిలేస్తున్నాం.
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
123తెలుగు టీం