విడుదల తేదీ : మే 27, 2021
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : సంతోష్ శోభన్, కావ్య తపర్, శ్రద్ధా దాస్, బ్రహ్మజీ, సప్తగిరి, సుదర్శన్, పోసాని కృష్ణ మురళి, హర్ష వర్ధన్
దర్శకత్వం : కార్తీక్ రాపోలు
నిర్మాతలు : యూవీ కాన్సెప్ట్స్
సంగీతం : ప్రవీణ్ లక్కరాజు
సినిమాటోగ్రఫీ : గోకుల్ భారతి
ఎడిటర్: సత్య జి
గత ఏడాదిలానే కొన్నాళ్ళు పాటు థియేటర్స్ కు బ్రేక్ రావడంతో మళ్ళీ పలు చిత్రాలు నేరుగా ఓటిటి బాట పట్టాయి. మరి వాటిలో యంగ్ హీరో సంతోష్ నటించిన చిత్రం “ఏక్ మినీ కథ” డైరెక్ట్ గా దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ ప్రైమ్ వీడియోలో ఈరోజే విడుదల అయ్యింది. మంచి బజ్ సెట్ చేసుకున్న ఈ చిత్రం ఎంత మేర ఆకట్టుకుందో ఇపుడు సమీక్షలో తెలుసుకుందాం రండి.
కథ :
ఇక కథలోకి వచ్చినట్టు అయితే సినిమా టైటిల్ కి తగ్గట్టుగానే హీరో సంతోష్(సంతోష్ శోభన్) అతని చిన్నప్పటి నుంచి తన ప్రైవేట్ పార్ట్ విషయంలో డిస్టర్బ్ అయ్యి అసలు చిన్నవి అంశాలు వస్తేనే బయపడుతుంటాడు. దాని నుంచి ఎలాగైనా బయట పడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అదే సమయంలో దానిని వేరేగా అర్ధం చేసుకున్న తన తండ్రి బ్రహ్మాజీ సంతోష్ పెళ్లి చేసేయాలని సంబంధం చూస్తాడు. అలా చూసిన అమ్మాయి అమృత(కావ్య తపర్) కానీ ఆమెకి సంతోష్ కి విరుద్ధంగా అన్ని పెద్ద అంశాలే అంటే ఇష్టం మరి ఇలాంటి ఈ ఇద్దరికీ కుదిరే సంబంధం ఏమవుతుంది? అసలు సంతోష్ తన సమస్యకు పరిష్కారం తెచ్చుకోగలడా? చివరికి అసలు ఏమవుతుంది అన్నది అసలు కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ పర్టిక్యులర్ చిత్రంలో కనిపించే అంశం నిజ జీవితంలో చాలా సున్నితమైంది చెప్పుకోలేనిది అలాంటి దానిని మంచి కామెడీ యాడ్ చేసి మంచి స్టార్టప్ తో చూపిన విధానం ఆకట్టుకుంది. అలాగే యంగ్ హీరో సంతోష్ ఇది వరకు చేసిన సినిమాలతో పోలిస్తే ఈ చిత్రం మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందని చెప్పాలి.
ఒక్క నటుడిగానే కాకుండా ఇలాంటి ప్రయోగాత్మక సబ్జెక్టును ఎంచుకున్నందుకు అతన్ని హర్షించాలి. అలాగే పలు సన్నివేశాల్లో నటన కానీ కామెడీ టైమింగ్ కానీ అతన్నుంచి చాలా బాగా అనిపిస్తాయి. ఇక హీరోయిన్ కావ్య తపర్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి మంచి అందంగా కనిపిస్తూ గ్లామరస్ డోస్ కూడా కనబరిచి ఆకట్టుకుంది.
అలాగే సంతోష్ తో పలు సన్నివేశాల్లో మంచి కెమిస్ట్రీ కూడా ఆమె నుంచి కనిపించింది. అలాగే సినిమా మొదటి నుంచి కనిపించే బ్రహ్మాజీ మరియు కమెడియన్ పాత్రలు కూడా ఆద్యంతం మంచి ఫన్ ను జెనరేట్ చేస్తాయి. వీటితో పాటుగా పలు సన్నివేశాల్లో కనిపించే ఎమోషన్స్ బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :
మరి ఈ చిత్రంలో ఫస్ట్ హాఫ్ మంచి కామెడీ సహా ఎమోషన్స్ తో బాగా నడిచినా ఆ ఫ్లో అంతా సెకండాఫ్ లో కాస్త మిస్ అయ్యినట్టు అనిపిస్తుంది. అలాగే పలు సన్నివేశాలు కానీ పాత్రలు కానీ అనవసరంగా ఇరికించినట్టు అనిపిస్తుంది. వాటి మూలాన జెనరేట్ అయ్యే తాత్కాలిక కామెడీ కూడా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.
అయితే గ్లామరస్ హీరోయిన్ శ్రద్ధా దాస్ మళ్ళీ చాలా కాలం తర్వాత తెలుగు సినిమాలో కనిపించింది కానీ తన రోల్ ఈ చిత్రంలో సోసో గానే ఉంటుంది. ఇక మరో కీలక పాయింట్ ఈ చిత్రం అంతా కాస్త బోల్డ్ గా మొదటి నుంచీ అనిపిస్తుంది కావున పలు సన్నివేశాలు ఎబ్బెట్టుగా అనిపిస్తాయి.
సాంకేతిక విభాగం :
ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వారి నుంచి పలు భారీ చిత్రాలతో పాటుగా మంచి కంటెంట్ తో కూడిన సినిమాలు అందిస్తారు. వాటిలో ఇది ఒకటి అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో కూడా మంచి నిర్మాణ విలువలు ఆది నుంచి ఉంటాయి. అలాగే కెమెరా వర్క్ చాలా బాగుంది. ప్రవీణ్ లక్కరాజు ఇచ్చిన సంగీతం పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, లిరిక్స్ ఫ్రెష్ గా అనిపిస్తాయి. ఎడిటింగ్ పర్వాలేదని చెప్పొచ్చు.
ఇక ఈ చిత్రం కథ, దర్శకత్వాలకి వస్తే నోటెడ్ రచయితా దర్శకుడు మేర్లపాక గాంధీ ఎంచుకున్న కథ కాస్త బోల్డ్ గా ఉన్నా రెగ్యులర్ సినిమాల నుంచి కొత్తగా అనిపిస్తుంది. అలాగే తాను ఇచ్చిన కామెడీతో కూడిన స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు కార్తీక్ రాపోలు విషయానికి వస్తే ఈ సబ్జెక్టును ఫస్ట్ హాఫ్ వరకు డీల్ చేసిన విధానం బాగుంది కానీ ఇదే సెకండాఫ్ లో కూడా కొనసాగించి ఉంచితే ఇంకా బెటర్ అవుట్ పుట్ వచ్చి ఉండేది. అలాగే తన సాయశక్తులా ఈ బోల్డ్ అటెంప్ట్ సున్నితంగా డీల్ చేసిన విధానాన్ని కానీ దానిని ముగించిన విధానాన్ని కానీ మెచ్చుకోవచ్చు.
తీర్పు :
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే “ఈ ఏక్ మినీ కథ” రీసెంట్ టైమ్స్ లో కొత్తదనం కోరుకునే వారికి అందులోని బోల్డ్ స్టోరీ అయినా ఓకే అనుకున్న వారికి నచ్చుతుంది. యంగ్ హీరో సంతోష్ కి ఈ చిత్రం తన కెరీర్ కి మంచి స్టెప్ ని ఇస్తుంది. అలాగే ఈ డ్రామాలో నడిచే కామెడీ కూడా చాలా డీసెంట్ గా అనిపిస్తుంది. కాకపోతే సెకండాఫ్ ను కనుక ఇంకా బాగా డీల్ చేసి ఉంటే బెటర్ గా అనిపించే అవకాశం ఉండేది. ఫైనల్ గా మాత్రం కాస్త బోల్డ్ గా ఉన్నా పర్లేదు. ఫ్యామిలీతో కాకుండా ఇండివిడ్యుయల్ చూస్తాం అనుకుంటే ఈ చిత్రం మంచి ఎంటర్టైన్మెంట్ ను ఇస్తుంది.
123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team