సమీక్ష : ‘ఈటి’ – మెసేజ్ తో సాగే బోరింగ్ ఎమోషనల్ డ్రామా!

సమీక్ష : ‘ఈటి’ – మెసేజ్ తో సాగే బోరింగ్ ఎమోషనల్ డ్రామా!

Published on Mar 11, 2022 3:01 AM IST
ET Review In Telugu

విడుదల తేదీ : మార్చి 10, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: సూర్య, ప్రియాంక అరుల్ మోహన్, వినయ్ రాయ్, సూరి, సత్యరాజ్, శరణ్య, సిబి భువన చంద్రన్, ఎం ఎస్ భాస్కర్, దేవదర్శిని

దర్శకత్వం : పాండిరాజ్

నిర్మాత: కళానిధి మారన్

సంగీత దర్శకుడు: ఇమన్

సినిమాటోగ్రఫీ: ఆర్. రత్నవేలు

ఎడిటర్ : రూబెన్

సూర్య – ప్రియాంక అరుల్ మోహన్ హీరో హీరోయిన్లుగా.. వినయ్ రాజ్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన సినిమా సూర్య ఈటి. కాగా ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం

 

కథ :

 

కృష్ణ మోహన్ (సూర్య) క్రిమినల్ లాయర్. ఆడపిల్లలకు గౌరవం ఇవ్వాలనే కుటుంబంలో పుట్టిన కృష్ణ మోహన్ అదిరా (ప్రియాంక అరుల్ మోహన్)తో ప్రేమలో పడతాడు. అయితే ఆమె ఊరికి కృష్ణ మోహన్ ఊరికి మధ్య కొన్ని గొడవలు ఉంటాయి. దాంతో వీరి ప్రేమకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మరోపక్క కామేష్ (వినయ్) కృష్ణ మోహన్ గ్రామంలోని అమ్మాయిలను టార్గెట్ చేస్తాడు. మరి కామేష్ నుంచి తన గ్రామ అమ్మాయిలను కృష్ణ మోహన్ ఎలా కాపాడుకున్నాడు ? ఈ క్రమంలో కృష్ణ మోహన్ కి వచ్చిన అడ్డంకులు ఏమిటి ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

కృష్ణ మోహన్ పాత్రలో సూర్య అద్భుతంగా నటించాడు. పాత్రకు తగ్గట్టు తన లుక్ ను తన బాడీ లాంగ్వేజ్ ను మార్చుకోవడం చాలా బాగుంది. కొన్ని కీలకమైన సన్నివేశాల్లో ఆయన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో చాలా సహజంగా నటిస్తూ సినిమాకి హైలెట్ గా నిలచారు. హీరోయిన్ గా నటించిన ప్రియాంక అరుల్ మోహన్ తన గ్లామర్ తో పాటు, తన ఇన్నోసెంట్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటుంది.

హీరోకి తండ్రి పాత్రలో నటించిన సత్యరాజ్ ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకున్నారు. చనిపోయిన కూతురు కోసం తాపత్రయపడే ఓ సగటు తండ్రిలా ఆయన నటించిన విధానం ఎమోషనల్ గా ఆకట్టుకుంది. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు. కొన్ని సన్నివేశాల్లో వాళ్ళ మ్యానరిజమ్స్ తో బాగానే నవ్వించారు. సెకండాఫ్ లో కొన్ని భావోద్వేగ సన్నివేశాలను చాలా చక్కగా చూపించారు.

 

మైనస్ పాయింట్స్ :

 

దర్శకుడు పాండిరాజ్ ఆడపిల్లల పై జరుగుతున్న దారుణాలకు సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేదు. హీరో, విలన్ల మధ్యన వచ్చే ఘర్షణ తాలూకు సన్నివేశాలు సాగతీసినట్లు, కొంచెం సినిమాటిక్ గా అనిపిస్తాయి.

కుటుంబ బంధాలను బాగానే ఎలివేట్ చేసినప్పటికీ , లవ్ ట్రాక్ ను ఎలివేట్ చేసే అవకాశాలు ఉన్నా, దర్శకుడు మాత్రం ఎందుకో లవ్ ట్రాక్ ను పూర్తిగా వాడుకోలేదు. సినిమాలో ముఖ్యంగా తమిళ నేటివిటీ ఎక్కువుగా కనిపిస్తోంది. ఆర్టిస్ట్ ల దగ్గరనుంచి వారి హావాభావాలు దాకా తమిళ వాసనలు స్పష్టంగా కనిపిస్తాయి. పైగా ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు బాగా సాగతీసారు.

 

సాంకేతిక విభాగం :

 

దర్శకుడు పాండిరాజ్ మంచి స్టోరీ లైన్ తీసుకొని, దానికి ఆడపిల్లల జీవితంలో వచ్చే సమస్యలను మిక్స్ చేసి చూపించే ప్రయత్నం చేశారు. ఇమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఆయన అందించిన పాటలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఎంతో రియలిస్టిక్ గా చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఎడిటింగ్ బాగుంది. కానీ అక్కడక్కడా ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను కూడా తగ్గించి ఉంటే ఇంకా బాగుండేది. నిర్మాత కళానిధి మారన్, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

 

తీర్పు :

 

ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ తో పాటు ఫ్యూ ఎమోషనల్ సీన్స్ మరియు కొన్ని కీలక సన్నివేశాలు పర్వాలేదు. అయితే, ఇంట్రస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు బోర్ గా సాగే కథనం, అలాగే మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం, పైగా సినిమాలో ఫేక్ ఎమోషన్స్ వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఆ కారణంగా ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాదు.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు