ఓటిటి సమీక్ష : “ఫ్రెడ్డీ” – హిందీ చిత్రం డిస్నీ+ హాట్ స్టార్ లో

ఓటిటి సమీక్ష : “ఫ్రెడ్డీ” – హిందీ చిత్రం డిస్నీ+ హాట్ స్టార్ లో

Published on Dec 3, 2022 6:01 PM IST
Freddy Movie Review

విడుదల తేదీ : డిసెంబర్ 02, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: కార్తీక్ ఆర్యన్, అలయ ఎఫ్, కరణ్ ఎ పండిట్, సజ్జాద్ డెలాఫ్రూజ్, మైర్నా ఎస్ దలాల్

దర్శకుడు : శశాంక ఘోష్

నిర్మాతలు: శోభా కపూర్, ఏక్తా కపూర్, జే శేవక్రమణి, నరేంద్ర హిరావత్, & శ్రేయాన్ష్ హిరావత్

సంగీత దర్శకుడు: క్లింటన్ సెరెజో

సినిమాటోగ్రఫీ: అయనంక బోస్

ఎడిటర్: చందన్ అరోరా

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

లేటెస్ట్ గా ఓటిటి లో రిలీజ్ కి వచ్చిన మరో చిత్రం “ఫ్రెడ్డీ”. బాలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించిన ఈ చిత్రం అయితే ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ డిస్నీ+ హాట్ స్టార్ లో రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్రం ఓటిటి వీక్షకులను ఎంతవరకు అలరించిందో చూద్దాం రండి.

 

కథ :

ఇక కథలోకి వస్తే.. ఫ్రెడ్డీ గిన్వాలా(కార్తీక్ ఆర్యన్) వృత్తిపరంగా ఓ డెంటిస్ట్ కాగా మానసికంగా తాను కాస్త నెమ్మదస్తుడు. దీనితో తనకి పెళ్లి టైం వచ్చేసరికి తనలోని భయంతో కాస్త అటు ఇటుగా ఆలోచిస్తూ ఆగిపోతూ ఉంటాడు. మరి ఇదిలా ఉండగా తనకి ఆల్రెడీ పెళ్ళైన ఓ అమ్మాయి కైనాజ్ ఇరానీ(అలయ ఫర్నిచర్ వాలా) తో పరిచయం ఏర్పడుతుంది. అయితే ఆమె అప్పటికే తన భర్త రుస్తుం(సజ్జాద్) వేధింపులతో ఇబ్బంది పడుతూ ఉంటుంది. అయితే మరోపక్క ఫ్రెడ్డీ మరియు కైనాజ్ ఒకరికొకరు దగ్గర అవుతుండగా ఫ్రెడ్డీ ఆమెని తన భర్త నుంచి విడిపోతే మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తాడు. మరి ఇక్కడ నుంచి ఈమె ఎలాంటి డెసిషన్ తీసుకుంది? తీసుకుంటే నెక్స్ట్ ఏమవుతుంది? మరి ఈ క్రమంలో ఫ్రెడ్డీకి ఏమన్నా ఇబ్బందులు ఎదురైతే తాను ఎలా వాటిని ఎదుర్కొంటాడు అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో మెయిన్ హైలైట్ గా కార్తీక్ ఆర్యన్ నటన కోసం చెప్పుకోవాలి. గతంలో తాను ఎన్నో ఐకానిక్ రోల్స్ ని చేసి ఆశ్చర్యపరిచాడు. అయితే వీటికి కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుందని చెప్పాలి. ఓ ఇంట్రోవెర్ట్ గా వారు కనబరిచే ప్రతి ఎమోషన్ ని తాను సూపర్బ్ గా చేసాడు. అలాగే మరికొన్ని సీన్స్ లో చాలా సెన్సిబుల్ నటనతో ఇంప్రెస్ చేస్తాడు.

ఇక ఫీమేల్ లీడ్ లో నటించిన అలయ ఫర్నిచర్ వాలా తనకిచ్చిన ఛాలెంజింగ్ రోల్ ని బాగా చేసింది. డీసెంట్ లుక్స్ తో కనిపించి మంచి ఎమోషన్స్ ని ఆమె పలు కీలక సన్నివేశాల్లో పండించింది. అలాగే ఆర్యన్ తో ఆమె కెమిస్ట్రీ కూడా బాగుంది. ఇక సినిమాలో అయితే కాస్త సెకండాఫ్ ఆసక్తిగా అనిపిస్తుంది. అలాగే నరేషన్ కూడా మంచి ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. అలాగే క్లైమాక్స్ కూడా డీసెంట్ గా ఉంటుంది.

 

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో చెప్పుకునేదగ్గ స్టోరీ లైన్ అయితే కనిపించదు. చాలా రొటీన్ గానే సినిమా లైన్ మరియు చాలా చోట్ల నరేషన్ లు కనిపిస్తాయి. అలాగే సినిమా కూడా ఆల్ మోస్ట్ ఊహించే రేంజ్ లో ఉంటుంది. ఓకే ఈ సీన్ తర్వాత సినిమా ఇలా ఉంటుంది అని అనుకుంటే నెక్స్ట్ అదే తరహాలో సీన్స్ ఈ చిత్రంలో కనిపిస్తాయి.

అలాగే చాలా సీన్స్ బాగా సిల్లీగా కూడా అనిపిస్తాయి. పైగా వాటిని మరీ కేర్ లెస్ గా అయితే మేకర్స్ చూపించడం చికాకు తెప్పిస్తుంది. ఇంకా సినిమా ఫస్టాఫ్ పూర్తయ్యే వరకు ఆడియెన్స్ లో ఆసక్తి స్టార్ట్ ఎవ్వడు. నెమ్మదిగా స్లో నరేషన్ తో సినిమా సాగుతుంది. దీనితో సినిమా బాగా సాగదీతగా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ ని ఇంకా బెటర్ గా చేయాల్సి ఉంది అలాగే మరికొన్ని సీన్స్ ని అనవసరంగా పెట్టి సినిమాని లాగ్ చేసారు.

 

సాంకేతిక వర్గం :

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు పరవాలేదు. బాలీవుడ్ సినిమాలు ఇప్పుడు ఏవి కూడా తక్కువ ప్రమాణాలతో రావట్లేదు. ఇక టెక్నీకల్ టీం లో అయితే క్లింటన్ ఇచ్చిన స్కోర్ బాగుంది. అలాగే సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటింగ్ మాత్రం ఉంది. చాలా సీన్స్ ఎడిట్ చేసి తీసేయాల్సింది.

ఇక శశాంక గౌష్ విషయానికి వస్తే.. జస్ట్ యావరేజ్ అని చెప్పొచ్చు. కొన్ని సీన్ వరకు పర్వాలేదు కానీ సినిమాలో తాను చాలా లాజికల్ ఎర్రర్స్ చేసాడు. పైగా రొటీన్ కథనే తీసుకొని అంతే రొటీన్ నరేషన్ తో చాలా చోట్ల బోర్ తెప్పిస్తాడు. కొన్ని థ్రిల్లింగ్ అంశాలు పర్వాలేదు అనిపిస్తాయి. ఓవరాల్ గా అయితే తన వర్క్ అంతగా మెప్పించదు.

 

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “ఫ్రెడ్డీ” లో కార్తీక్ ఆర్యన్ నటన బాగుంటుంది. అలాగే ఇతర నటీనటులు పర్వాలేదనిపిస్తారు. ఇంకా కొన్ని సీన్స్ పర్వాలేదనిపిస్తాయి. కానీ రొటీన్ కథ మరియు కొత్తదనం కథనాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. దీనితో ఈ వారాంతం ఓటిటి లో చాలా యావరేజ్ ట్రీట్ ని ఈ చిత్రం అందిస్తుంది.

 

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు