సమీక్ష : గంధర్వ – కాన్సెప్ట్ బాగున్నా అంతగా ఆకట్టుకోదు

సమీక్ష : గంధర్వ – కాన్సెప్ట్ బాగున్నా అంతగా ఆకట్టుకోదు

Published on Jul 9, 2022 3:01 AM IST
Gandharwa Movie Review

విడుదల తేదీ : జులై 8, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: సందీప్ మాధవ్, గాయత్రి సురేష్, శీతల్ భట్, సాయికుమార్, రోహిణి, బాబు మోహన్

దర్శకత్వం : అప్సర్

నిర్మాత: ఎం.ఎన్ మధు

సంగీత దర్శకుడు: రాప్ రాక్ షకీల్

సినిమాటోగ్రఫీ: జవహర్ రెడ్డి

ఎడిటర్: బస్వా పైడి రెడ్డి


వంగవీటి, జార్జి రెడ్డి చిత్రాలతో నటుడు సందీప్ మాధవ్ ప్రేక్షకులని విశేషం గా ఆకట్టుకున్నారు. ఈ హీరో నటించిన గంధర్వ చిత్రం నేడు థియేటర్ల లో విడుదల అయ్యింది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.

కథ:

కెప్టెన్ అవినాష్ (సందీప్ మాధవ్) 1971 లో అమూల్య (గాయత్రి ఆర్. సురేష్) ను వివాహం చేసుకుంటాడు. ఆ సమయం లో ఇండో – పాక్ యుద్ధం లో చేరమని ఆర్మీ నుండి అతనికి పిలుపు వస్తుంది. దురదృష్టవశాత్తూ, అతను యుద్ధం జరిగే సమయం లో ఒక లోయలోకి జారిపోతాడు. అయితే అతను. 50 ఏళ్ల తర్వాత మేల్కొని, చనిపోయాడు అని భావించే అతని కుటుంబం ను కనుగొంటాడు. నిజం తెలిసిన తర్వాత అమూల్య షాక్ అవుతుంది. అంతేకాక, అవినాష్ తన భర్త అని నిరూపించాలని నిర్ణయం తీసుకుంటుంది. అందుకోసం ఆమె ఏమి చేసింది? అవినాష్ కి అసలు ఏమైంది? ఆ వ్యక్తి నిజంగా ఆమె భర్తేనా? వీటన్నిటికీ సమాధానాలు తెలియాలంటే వెండితెర పై సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

టాలీవుడ్ లో ఇప్పటి వరకూ టచ్ చేయని ఒక మంచి పాయింట్ ను ఈ చిత్రం లో చూపించడం జరిగింది. సందీప్ మాధవ్ తన నటన తో ఆకట్టుకున్నారు. సాయి కుమార్ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్స్ బాగున్నాయి.

చిత్రం లో జబర్దస్త్ ఆర్టిస్టులు రామ్ ప్రసాద్, రోహిణి ల కామెడీ బాగుంటుంది. ఈ చిత్రం లో నటించిన మిగతా నటీనటులు తమ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అంతేకాక సెకండాఫ్ లో యాక్షన్ ఎపిసోడ్ ను చక్కగా చూపించారు.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రం కథ చాలా ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, దాన్ని అంత సీరియస్ గా చూపించలేదు అని చెప్పాలి. స్క్రీన్ ప్లే అంతగా ఆకట్టుకోలేదు, అంతేకాక అనవసరమైన ప్రేమ సన్నివేశాల కారణం గా కొన్ని చోట్ల ఫన్నీ గా అనిపిస్తుంది. సందీప్ మాధవ్ పెర్ఫార్మెన్స్ ఇంకా మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. కానీ చాలా సన్నివేశాల్లో అంతగా సందీప్ నటన అంతగా ఆకట్టుకోదు. హీరోయిన్ విషయం లో కూడా అదే విధంగా ఉంటుంది.

హీరోయిన్ 68 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాయిస్ మాత్రం యువతి గొంతు లా వస్తుంది. ఆమె మేకప్ ఏ మాత్రం బాగుండదు. అంతేకాక ఈ చిత్రం లో సీనియర్ హీరో సురేష్, కమెడియన్ మోహన్ బాబు లు ఉన్నా కూడా, వాళ్ళ పాత్రలు అంతగా ఆకట్టుకోలేదు. కథ లో కొన్ని చోట్ల లోపాలు తేలికగా గమనించవచ్చు.

సినిమా చూసేందుకు వచ్చే ప్రేక్షకుడికి వినోదాన్ని అందించే ఏ ఒక్క పాయింట్ కూడా లేదు. అవినాష్ ఇంకా అదే విధంగా ఎందుకు ఉన్నాడు అని వివరించేటప్పుడు ఉపయోగించిన VFX కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. మెయిన్ పాయింట్ ను మంచి పద్దతిలో చెప్పడానికి చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటే బావుండేది.

సాంకేతిక విభాగం:

ప్రేక్షకులకు కొత్త పాయింట్ చెప్పాలని అనుకున్న దర్శకుడు స్క్రీన్ ప్లే విషయం లో జాగ్రత్తలు తీసుకుంటే బావుండేది. సిల్లీ స్క్రీన్ ప్లే కారణంగా మెయిన్ పాయింట్ సరైన రీతిలో వివరించలేదు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నేపథ్యం పర్వాలేదు. ఎడిటింగ్ ఇంకా బాగుండే అవకాశం ఉంది.

తీర్పు:

మొత్తం మీద సందీప్ మాధవ్ నటించిన గంధర్వ చిత్రం విసుగు తెప్పించడం మాత్రమే కాకుండా, ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో విఫలం అయ్యింది. డైరెక్టర్ ఈ చిత్రాన్ని సీరియస్ గా, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో కథ ను చెప్పి ఉంటే సినిమా బాగుండేది. ఈ సినిమా లో ప్రేక్షకులను అలరించే అంశాలు ఏమీ లేవు. ఈ వారాంతం లో సినిమాలు చూడటానికి ఏమీ లేకుండా ఉంటే, వచ్చే వారం వరకు వేచి ఉండటం బెటర్.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు