సమీక్ష : ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ – కొన్ని చోట్ల ఆకట్టుకున్న గ్యాంగ్‌స్టర్ !

Gangster Gangaraju Movie Review

విడుదల తేదీ : జూన్ 24, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: లక్ష్, వేదిక దత్త, గోపరాజు రమణ తదితరులు
దర్శకత్వం : ఇషాన్ సూర్య‌

నిర్మాత: చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి, సినిమాటోగ్ర‌ఫీ: క‌ణ్ణ పి.సి

సంగీత దర్శకుడు: సాయి కార్తీక్‌

సినిమాటోగ్రఫీ: క‌ణ్ణ పి.సి.

ఎడిటర్: అనుగోజు రేణుకా బాబు

ఇషాన్ సూర్య దర్శకత్వంలో హీరో లక్ష్ హీరోగా వచ్చిన సినిమా ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’. ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

కథ:

గంగరాజు (లక్ష్) తన ఫ్రెండ్స్ తో సరదాగా తిరుగుతూ టైమ్ పాస్ చేస్తుంటాడు. అంతలో ఉమాదేవి (వేదిక దత్త) ఫ్యామిలీ గంగరాజు ఇంటి ఎదురింట్లో కొత్తగా దిగుతారు. ఆమెను చూసిన గంగరాజు తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమలో పడేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో గంగరాజు తండ్రి గోపరాజు రమణకు అవమానం జరుగుతుంది. దాంతో ఆ అవమానించిన వ్యక్తిని గంగరాజు ఆవేశంలో చంపేస్తాడు. చివరకు గంగరాజు.. గ్యాంగ్‌స్టర్ గంగరాజుగా మారతాడు. ఇంతకీ గంగరాజు నిజంగా నే గ్యాంగ్‌స్టరా ? లేక అబద్దమా ? అసలు గంగరాజు లైఫ్ లో ఏమి జరిగింది ? ఈ కథ ఎలా ముగిసింది ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో హీరోగా నటించిన లక్ష్ తన డైలాగ్ డెలివరీ, తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్నిఎమోషనల్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ స్ లో చాలా బాగా నటించాడు. తన నటనతో సినిమా స్థాయిని పెంచాడు. ముఖ్యంగా గ్యాంగ్ స్టర్ గా మారే సన్నివేశంలో లక్ష్ నటన అద్భుతంగా ఉంది. అలాగే ఇంటర్వెల్ లో కూడా తన పాత్రలో డిఫెరెంట్ వేరియేషన్ చూపిస్తూ బాగా ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ గా నటించిన వేదిక దత్త కూడా తన క్యూట్ అండ్ హోమ్లీ లుక్స్ లో అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన గోపరాజు రమణ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో లక్ష్ పాత్ర.. ఆ పాత్రకు సంబంధించిన గ్యాంగ్‌స్టర్ ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ అఫ్ వ్యూస్.. మొత్తానికి ఈ సినిమాలో కొన్ని అంశాలు పర్వాలేదు. ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా బాగానే ఉంది. శ్రీకాంత్ అయ్యంగార్ అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

మైనస్ పాయింట్స్ :

సినిమా మెయిన్ పాయింట్ లో మ్యాటర్ ఉన్నపటికీ.. ఆ పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు ఇషాన్ సూర్య‌ విఫలం అయ్యాడు. అసలు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి కట్టేలా నడిపించాలి. కానీ హీరో తెలియకుండానే భారీ సమస్య లో ఇరుక్కున్నాడు అని బలంగా చూపించడంలో.. అలాగే ఆ సమస్య నుంచి చాకచక్యం గా బయటపడ్డాడు అని ఒప్పించి మెప్పించడం లో కూడా దర్శకుడు ఫెయిల్ అయ్యాడు.

ఈ కథలో ఫుల్ కామెడీని మెయింటైన్ చేయవచ్చు. కానీ.. ఈ విషయంలోనూ సినిమా ఎఫెక్టివ్ గా లేదు. గ్యాంగ్‌స్టర్ ట్రాక్ లోనూ ఎక్కడా లాజిక్ లేదు. పైగా ఆ ట్రాక్ మీదే మెయిన్ ప్లాట్ మొత్తం సాగడంతో సినిమాలో అదే పెద్ద మైనస్ అయింది. దర్శకుడు సెకెండాఫ్ ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రస్ట్ గా నడుపుదామని మంచి ప్రయత్నం అయితే చేశారు గాని, అది స్క్రీన్ మీద అసలు వర్కౌట్ కాలేదు.

సాంకేతిక విభాగం:

టెక్నికల్ గా చూసుకుంటే.. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సాయి కార్తీక్‌ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదే విధంగా క‌ణ్ణ పి.సి సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి హైలైట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన పనితనం చాలా బాగుంది. ఎడిటర్ అనుగోజు రేణుకా బాబు వర్క్ సినిమాకి తగ్గట్టు ఉంది. సినిమాలో నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

తీర్పు :

‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ అంటూ వచ్చిన ఈ చిత్రంలో కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ బాగున్నాయి. అయితే, ఇంట్రెస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం, పైగా సినిమాలో ఫేక్ ఎమోషన్స్ వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఐతే, సినిమాలో లక్ష్ తన నటనతో సినిమా స్థాయిని పెంచాడు. తన పాత్రలో రెండు డిఫెరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ బాగా ఆకట్టుకున్నాడు. ఓవరాల్ గా ఈ చిత్రం ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Exit mobile version