సమీక్ష : గీత సాక్షిగా – సాదాసీదాగా సాగే కోర్ట్ రూమ్ డ్రామా

సమీక్ష : గీత సాక్షిగా – సాదాసీదాగా సాగే కోర్ట్ రూమ్ డ్రామా

Published on Mar 23, 2023 3:01 AM IST
Sakshigaa Movie Review In Telugu

విడుదల తేదీ : మార్చి 22, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: ఆదర్శ్, చిత్ర శుక్లా, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంర్, భరణి శంకర్, అనిత చౌదరి, సుదర్శన్, రాజా రవీంద్ర తదితరులు

దర్శకుడు : ఆంథోనీ మట్టిపల్లి

నిర్మాతలు: చేతన్ రాజ్

సంగీత దర్శకులు: గోపి సుందర్

సినిమాటోగ్రఫీ: వెంకటహనుమ నారిశెట్టి

ఎడిటర్: కిషోర్ మద్దాలి

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ఆదర్శ్, చిత్రా శుక్లా హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గీత సాక్షిగా. చేతన్ రాజ్ తెరకెక్కించిన ఈ మూవీ నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఉగాది సందర్భంగా నేడు రిలీజ్ అయిన ఈమూవీ యొక్క సమీక్ష ఇప్పుడు చూద్దాం.

 

కథ :

 

అర్జున్ (ఆదర్శ్) హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ పబ్‌లో డీజే గా వర్క్ చేస్తూ తన కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంటాడు. ఒకానొక సందర్భంలో అమూల్య (చిత్రా శుక్లా) తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అయితే సడన్ గా ఒక అమాయక బాలికపై అత్యాచారం చేసి చంపినందుకు పోలీసులు అతన్ని అరెస్టు చేయడంతో అతని జీవితం తలకిందులవుతుంది. కాగా ఐదు సంవత్సరాల తర్వాత, ఏసిపి రూపేష్ (రూపేష్ శెట్టి) ఆ ఘోరమైన నేరం వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవడానికి కేసును మళ్లీ రీ ఓపెన్ చేస్తాడు. మరి అర్జున్ నిజంగానే ఆ నేరం చేశాడా లేక వేరొకరు అతనిని ఇరికించారా? విచారణలో ఏసీపీ ఏం కనుగొన్నాడు? మరి ఆ నేరంలో అసలు దోషి ఎవరు? అనే వాటికి అన్నింటికి సమాధానాలు దొరకాలి అంటే సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఫస్ట్ మూవీ అయినప్పటికీ కూడా హీరో ఆదర్శ్ ఎంతో అనుభవం ఉన్న నటుడి మాదిరిగా మంచి యాక్టింగ్ తో పాటు డ్యాన్స్, ఫైట్స్ కూడా బాగా చేసాడు. చిత్ర శుక్లా ఈ సినిమాలో కేవలం అందానికి మాత్రమే పరిమితం కాకుండా అభినయానికి కూడా చోటు గల పాత్రలో కనిపించారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఆమె సీన్స్ అలానే మెయిన్ గా కోర్ట్ సీన్స్ లో అయితే ఆమె నటన ఎంతో బాగుంది. తన కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మన్స్ చేసిన మూవీ ఇదే అని చెప్పాలి. ఇక సినిమాలో లాయర్ జోసెఫ్ పాత్రలో కనిపించిన శ్రీకాంత్ అయ్యంగార్ మరొక్కసారి తన నటనతో ఆడియన్స్ మనసు దోచారు. రూపేష్ శెట్టి, భరణి శంకర్, అనిత చౌదరి, సుదర్శన్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

మైనస్ పాయింట్స్ :

 

ముఖ్యంగా ఈ సినిమా కథని గతంలో వచ్చిన అనేక పాత సినిమాల కథల మాదిరిగా నిర్మాత, కథకుడు అయిన చేతన్ రాజ్ ఎంచుకున్నారు. చూస్తున్నంత సేపు గతంలో వచ్చిన అనేక సినిమాలు మనకు గుర్తుకు వస్తుంటాయి. ఈ సినిమాని కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కించాం అని ఇటీవల యూనిట్ తెలిపింది. అటువంటి సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ స్క్రీన్ ప్లే ని మరింత ఆసక్తికరంగా దర్శకుడు అంథోని మట్టిపల్లి రాసుకుని ఉంటె బాగుండేది. కథ బలంగా ఉన్నప్పటికీ దానిని ఆసక్తికరంగా ముందుకు నడపడంలో ఆయన విఫలం అయ్యాడు. స్క్రిప్ట్ లో ఎన్నో లోపాలు మనకు కనిపిస్తాయి. అయితే కోర్ట్ సీన్ సన్నివేశాలు బాగున్నా పరిచయం ఉన్న ఆర్టిస్టులని తీసుకుని ఉంటె అవి మరింత రక్తికట్టేవి. ఇక సెకండ్ హాఫ్ పై కూడా మరింత శ్రద్ధ పెడితే బాగుండేది. రాజారవీంద్ర, నెల్లూరు సుదర్శన్ వంటి పేరున్న నటులని దర్శకడు సరిగ్గా వినియోగించుకోలేకపోయారు. లవ్ ట్రాక్ కూడా పెద్దగా ఆకట్టుకోదు, దానికి బదులుగా వారి మధ్య కొన్ని ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలు పెడితే బాగుండేది అనిపిస్తుంది. సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలు కూడా పెద్దగా ఆకట్టుకోవు, ఆడవారి పై దర్శకుడు ఆంటోనీ రాసుకున్న కొన్ని డైలాగ్స్ బాగున్నా ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవడంతో అవి కూడా ఆడియన్స్ కి చేరువ కావు.

 

సాంకేతిక వర్గం :

 

దర్శకుడు ఆంథోనీ మరింత బెటర్ గా గీత సాక్షిగా స్క్రీన్ ప్లే రాసుకుని ఉంటె తప్పకుండా రిజల్ట్ సక్సెఫుల్ గా ఉండేది. సినిమాటోగ్రఫీ అందించిన వెంకటహనుమ నారిశెట్టి ఆకట్టుకునే తీరున సినిమాని చిత్రీకరించారు. గోపిసుందర్ తన పరిధి మేరకు చక్కని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. రెండు సాంగ్స్ ఆడియో పరంగా అలానే విజువల్ గా కూడా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో కొన్ని అనవసర సన్నివేశాలని ఎడిటర్ కిషోర్ మద్దాలి ట్రిమ్ చేస్తే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 

తీర్పు :

 

మొత్తంగా గీత సాక్షిగా మూవీ పర్వాలేదనిపిచే సాదా సీదాగా సాగే కోర్ట్ డ్రామా మూవీ అని చెప్పాలి. ఆదర్శ్, చిత్రా శుక్లా నటనతో ఆకట్టుకున్నప్పటికీ నారేషన్ మాత్రం ఆసక్తికరంగా లేదు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని అనవసర సన్నివేశాలు మినహాయిస్తే గీత సాక్షిగా మూవీని ఈ ఉగాదికి మీ కుటుంబంతో చూడవచ్చు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు