విడుదల తేదీ : అక్టోబర్ 21, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు: విష్ణు మంచు, సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్, నరేష్, చమ్మక్ చంద్ర, వెన్నెల కిషోర్, సునీల్, రఘుబాబు, సత్యం రాజేష్, సురేష్, భద్రం
దర్శకత్వం : ఈశాన్ సూర్య
నిర్మాతలు: మోహన్ బాబు మంచు
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: చోటా కె నాయుడు
ఎడిటర్స్: చోటా కె ప్రసాద్
సంబంధిత లింక్స్: ట్రైలర్
విష్ణు మంచు హీరోగా సూర్య దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం జిన్నా. రిలీజ్ కి ముందు ప్రచార చిత్రాలతో మంచి బజ్ ను సొంత చేసుకున్న ఈ చిత్రం నేడు థియేటర్ల లో గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ చిత్రం ప్రేక్షకులని ఏ మేరకు మెప్పించిందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.
కథ:
జిన్నా (విష్ణు మంచు) ఒక టెంట్ హౌస్ ను నడుపుతూ తన లైఫ్ ను కొనసాగిస్తాడు. అందరి వద్ద అప్పులు చేసే జిన్నా, స్వాతి (పాయల్ రాజ్ పుత్) తో ప్రేమలో ఉంటాడు. అయితే ఆ అప్పులు తీర్చడం కోసం ఏదైనా చేయాలని ఆలోచిస్తాడు. ఈలోగా రూబీ (సన్నీ లియోన్), రేణుక గా ఎంటర్ అవుతుంది. రేణుక అమెరికా నుండి వస్తుంది, ఆస్తి, డబ్బు ఉందన్న కారణం గా సన్నీ తో క్లోజ్ గా ఉంటాడు జిన్నా. అయితే తన ప్లాన్ లో భాగం గా సన్నీ కి దగ్గరైన జిన్నా, అమెరికా నుండి వచ్చింది రేణుక కాదు, రూబీ అని తెలుసుకుంటాడు. అసలు రూబీ, రేణుక గా ఎందుకు వచ్చింది. జిన్నా తన అప్పులు తీర్చాడా? స్వాతి నీ పెళ్లి చేసుకున్నాడా? రూబీ ను చివరకు జిన్నా ఏం చేశాడు లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
ఈ చిత్రం గురించి ముందుగా చెప్పాలంటే అది విష్ణు గురించే. ఈ సినిమా కోసం తను అన్ని విధాలుగా కష్టపడ్డాడు అని చెప్పాలి. ఈ చిత్రం లో తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం మాత్రమే కాకుండా, సెటైరికల్ కామెడీ తో అందరినీ నవ్వించాడు. డాన్స్, ఫైట్స్, డైలాగ్స్ బాగున్నాయి.
ఈ చిత్రం లో సన్ని లియోన్ తన అందం తో పాటుగా, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తను రూబీ గా చేసిన నటన సినిమా కి హైలైట్ గా ఉంది. పాయల్ రాజ్ పుత్ ఈ చిత్రం లో మంచి నటనను కనబర్చి సినిమా కి ప్లస్ అయ్యింది అని చెప్పాలి. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ తో పాటుగా, సెకండ్ హాఫ్ మద్యలో వచ్చే ట్విస్ట్ సినిమాను మరో లెవెల్ కి తీసుకు పోయింది.
సినీమా కి మరో హైలైట్ అంటే అది డైరెక్టర్ సూర్య ప్రతిభ. మొదటి ఫ్రేమ్ నుండి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ను చాలా బాగా హ్యాండిల్ చేశారు. అనూప్ రూబెన్స్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా కి ప్లస్ అయ్యాయి. చమ్మక్ చంద్ర, వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ చాలా ఆకట్టుకుంటుంది. సునీల్, రఘుబాబు, సత్యం రాజేష్, సురేష్, భద్రం లు తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.
మైనస్ పాయింట్స్:
స్లో నేరేషన్ తో పాటుగా, ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఎక్కువగా ఉంది. మొదటి నుండి పంచ్ డైలాగ్స్, కామెడీ సన్నివేశాలు, ఫైట్స్ ఉన్నప్పటికీ కథ ముందుకు సాగదు.
మొదటి భాగం లో కొన్ని సన్నివేశాలు ఊహించే విధంగా ఉన్నాయి. రొటీన్ కామెడీ సన్నివేశాలు ఫస్ట్ హాఫ్ కి మైనస్ అని చెప్పాలి.
సాంకేతిక విభాగం:
ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా దర్శకుడు సూర్య గురించి చెప్పాలి. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా సినిమాను తెరకెక్కించారు. సినిమా లో పాటలు బాగున్నాయి. అనూప్ రూబెన్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరో లెవెల్ కి తీసుకు వెళ్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా చేసే అవకాశం ఉంది.
తీర్పు:
విష్ణు మంచు జిన్నా గా వచ్చి ప్రేక్షకులను అలరించారు అని చెప్పాలి. ఇంతకుముందు కంటే మెరుగ్గా తన పర్ఫార్మెన్స్ ఉంది. ఫైట్స్, డాన్స్, కామెడీ తో పాటుగా, యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ కాస్త స్లో గా సాగినా, సెకండ్ హాఫ్ మరింత స్పీడ్ తో ఆడియెన్స్ ను అలరిస్తుంది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లలో థ్రిల్ కి గురి చేసే అంశాలు ఉండటంతో, కామెడీ ఎంటర్టైనర్ లని ఇష్టపడే వారు ఈ చిత్రాన్ని ఒకసారి చూడవచ్చు.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team