సమీక్ష: “గాడ్సే” – సత్యదేవ్ మెప్పిస్తాడు కానీ..

సమీక్ష: “గాడ్సే” – సత్యదేవ్ మెప్పిస్తాడు కానీ..

Published on Jun 18, 2022 3:02 AM IST
Godse Movie Review

విడుదల తేదీ : జూన్ 17, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: సత్య దేవ్, ఐశ్వర్య లక్ష్మి, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, నాగబాబు కొణిదెల, ప్రియదర్శి, చైతన్య కృష్ణ

దర్శకత్వం : గోపీ గణేష్ పట్టాభి

నిర్మాత: సి కళ్యాణ్

సంగీత దర్శకుడు: శాండీ

సినిమాటోగ్రఫీ: సురేష్ ఎస్

ఎడిటర్: సాగర్ ఉండగండ్ల


టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా గోపి గణేష్ తో బ్లఫ్ మాస్టర్ లాంటి అండర్ రేటెడ్ హిట్ తర్వాత నటించిన చిత్రం “గాడ్సే”. మరి ఈరోజు రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతవరకు మెప్పించిందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

కథ:

ఇక కథలోకి వచ్చినట్టు అయితే.. గాడ్సే (సత్యదేవ్) అనే వ్యక్తి హైదరాబాద్ లో ఆకస్మికంగా కొంతమంది పేరు మోసిన వ్యక్తులను హోస్టేజెస్ గా బంధించి పలు డిమాండ్స్ తో సంచలనం రేపుతాడు. దీనితో ఒక్కసారిగా హై అలర్ట్ అయ్యిన హైదరాబాద్ లో ఈ కేసును వైశాలి(ఐశ్వర్య లక్ష్మి) టేకప్ చేస్తుంది. అసలు ఈ గాడ్సే ఎవరు? ఎందుకు ఇలా చేసాడు? తాను చేసిన డిమాండ్స్ ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

మొదటగా సత్యదేవ్ పెర్ఫామెన్స్ కోసం చెప్పుకున్నట్టయితే దేవ్ తనకి ఇచ్చిన ఎలాంటి రోల్ ని అయినా కూడా చాలా ఈజ్ తో చేస్తాడు. అలాగే ఈ సినిమాలో గాడ్సే గా సాలిడ్ పెర్ఫామెన్స్ ని కనబరిచాడు. ముఖ్యంగా ఈ చిత్రంలో తన నటనతో పాటు స్టన్నింగ్ లుక్స్ కూడా బాగున్నాయి. ఇంకా తన పర్ఫెక్ట్ డైలాగ్ డెలివరీ కూడా ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ లో అయితే సత్యదేవ్ తనలోని పరిపూర్ణ నటుడిని చూపించాడు.

ఇలా ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ గా నటించిన ఐశ్వర్య లక్ష్మి మంచి నటనతో ఆకట్టుకుంది. తెలుగులో తనకి ఫస్ట్ సినిమానే అయినా తన పాత్రకి తగ్గట్టుగా డీసెంట్ లుక్స్ మరియు నటనతో మెప్పించింది. అలాగే ఈ చిత్రంలో కొన్ని థ్రిల్లింగ్ అంశాలు అలాగే హీరో పాత్ర ప్రస్తుత సమాజాన్ని ప్రశ్నించే విధానం తాను రైజ్ చేసే కొన్ని పాయింట్స్ ఆడియెన్స్ ని ఆలోచింపజేసేలా అనిపిస్తాయి.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రంపై ఓ రకంగా మంచి అంచనాలు పెట్టుకోడానికి కారణం ఈ కాంబో అని చెప్పాలి. సత్యదేవ్ మరియు గోపి ల నుంచి లాస్ట్ టైం వచ్చిన బ్లఫ్ మాస్టర్ తరహాలో ఈ సినిమా కూడా మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మరియు నరేషన్ తో ఉంటుంది అనుకుంటే ఈ చిత్రం మాత్రం డిజప్పాయింట్ చేస్తుంది అని చెప్పాలి.

పెద్ద డ్రా బ్యాక్ ఏదన్నా ఉంది అంటే అసలు సినిమాలో ఎక్కడా సరైన కీ పాయింట్ బాగా ఎలివేట్ అయ్యినట్టు కనిపించదు. సత్యదేవ్ పాత్ర కూడా ఓవరాల్ గా అంత బలంగా కనిపించదు. దీనితో ప్రేక్షకునికి సినిమా చూసాక అంత ఎఫెక్ట్ అనిపించదు. అలాగే సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ వంటివి చాలా రొటీన్ గా అనిపిస్తాయి.

ఇంకా డైరెక్షన్ లో కూడా చాలా లాజిక్స్ మిస్ అయ్యాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో అయితే మరీ ఓవర్ గా అనిపించక మానదు. ఇక సినిమాకి ఎంతో కీలకం అయినటువంటి సెకండాఫ్ కూడా అంత ఆకట్టుకునే విధంగా అనిపించకపోవడం నిరాశ పరుస్తుంది.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు యావరేజ్ గా ఉన్నాయని చెప్పాలి. ట్రైలర్ లో చూసేందుకు బాగానే అనిపించింది కానీ సినిమాలో అయితే నిర్మాణ విలువలు ఏమంత ఆకట్టుకునే విధంగా కనిపించలేదు. ఇక టెక్నికల్ టీం లో శాండీ సంగీతం పర్వాలేదు కానీ పలు సన్నివేశాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ కొన్ని సీన్స్ లో బాగుంది. ఎడిటింగ్ బెటర్ గా చెయ్యాల్సింది. డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి.

ఇక దర్శకుడు గోపి గణేష్ విషయానికి వస్తే ఈ కాంబో కోసం తెలిసిన వారిని ఒకింత ఎక్కువే డిజప్పాయింట్ చేస్తారని చెప్పాలి. జస్ట్ కొన్ని డైలాగ్స్ సత్యదేవ్ నుంచి మంచి నటన తప్ప మిగతా ఏ అంశంలో కూడా తాను మెప్పించలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ ని బాగానే హ్యాండిల్ చేసాడు కానీ సెకండాఫ్ లో మాత్రం గాడి తప్పింది. దీనితో కంప్లీట్ గా సినిమా ఫలితం దెబ్బ తింది అని చెప్పక తప్పదు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “గాడ్సే” తో సత్యదేవ్ మరియు గోపి గణేష్ ల కాంబో తమ మ్యాజిక్ ని అయితే పూర్తి స్థాయిలో రీ క్రియేట్ చెయ్యలేకపోయింది అని చెప్పాలి. సినిమాలో కీ పాయింట్, కొన్ని డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉంటాయి కానీ వీటికి అనుగుణంగా ఆకట్టుకునే నరేషన్ మాత్రం మిస్సైయింది. దీనితో సినిమా ఫలితం అయితే దెబ్బ తిన్నది. కానీ సత్యదేవ్ మాత్రం మరోసారి తన సిన్సియర్ పెర్ఫామెన్స్ తో మాత్రం తప్పకుండా ఆకట్టుకుంటాడు. మరి సత్యదేవ్ నటన పరంగా చూడాలి అనుకునే వారు తప్ప మిగతావాళ్ళని అంతగా ఈ చిత్రం మెప్పించదు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు